Devatha 1 nov Today Episode : టీవీ ఆడియన్స్‌ను ఎంతో అట్రాక్ట్ చేస్తున్న దేవత సీరియల్‌లో కొత్త కొత్త ట్విస్టులు వస్తున్నాయి. మరి నవంబర్ 1న (377వ) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.. సత్యకు గొడ్రలంటూ జరిగిని అవమానం జరిగిన తర్వత దేవడమ్మ ఆదిత్యపై సీరియస్ కావడం, దీన్నంతిటి చూసి రాధ ఏడ్వడం జరుగుతుంది. రాధ ఏడుస్తూ.. ఓ బొమ్మను పట్టుకుని ఆదిత్యను ఇమాజిన్ చేసుకుంటుంది.
నా వల్ల నువ్వు అవమానాలు ఎదుర్కొంటున్నావ్.. నా చెల్లెలి కోసమేగా నేను వదిలి వచ్చానంటూ కాస్త ఎమోషనల్ అవుతుంది. దాన్ని విన్న ఆదిత్య వెంటనే రుక్మణీ… అంటూ గట్టిగా కేక వేస్తాడు. దీంతో రాధ ఏడుపు ఆపేసి ఏంటిది సారు అంటూ మాట్లాడుతుంది. నాకు నిజమేంటో తెలిసింది. నువ్వే రుక్మిణీ అని అర్థమైందంటూ చెబుతాడు ఆదిత్య. అందుకు ఇదే సాక్షమంటూ రాధ ఎమోషనల్‌లో మాట్లాడిన వీడియోను చూపించేస్తాడు.
దీంతో ఒక్క సారిగా రాధ షాక్‌కు గురవుతుంది. ఇన్ని రోజులు ఇలాంటి సాక్ష్యం కోసమే వెయిట్ చేస్తున్నా.. నాకు ఇంకేం చెప్పొద్దు. ఇంటికి పోదాం నడువు అంటూ రాధ చెయ్యి పట్టకుని తీసుకెళ్తాడు. కన్విన్స్ చేద్దామని రాధ ట్రై చేసినా ఆదిత్య వినడు. దీంతో చేతిని విడిపించుకున్న రాధ.. చనిపోకుండా బతికున్నందు వల్లే ఇదంతా జరుగుతుంది.. ఇప్పుడు సత్య జీవితంలోని ఎలా రావాలి అంటూ ప్రశ్నిస్తుంది.
Devatha 1 nov Today Episode-1
నువ్వు రుక్మిణీ అని తెలిస్తే అందరూ పాత విషయాలు మరిచిపోయి ఆనంద పడతారు అంటూ ఆదిత్య రాధను కన్వీన్స్ చేసేందుకు ట్రై చేస్తాడు. అందరూ ఆనందపడినా నా చెల్లెలు బాధపడుతుంది. నన్ను చూశాక నేనే హ్యాపీగా ఉండాలని నా చెల్లెలు చచ్చిపోతుంది. అంటూ రాధ బాధపడుతుంది. అప్పుడు నేను చావలేదు.. ఇప్పుడు చస్తాను అంటూ ఎదురుగా వస్తున్న వ్యానుకు అడ్డు వెళ్తుంది. అప్పటికి ఆదిత్య ఆగు రుక్మిణీ అంటూ అరుస్తాడు. ఇంతలోనే ఆదిత్య రుక్మిణీ అని అరుస్తూ.. నిద్రలోంచి లేస్తాడు.. అంటే ఇప్పటిదాకా జరిగింది అంతా కలనా.. అంటూ ఆశ్చర్యపోతాడు.
రుక్మిణీ అని ఆదిత్య అరవడంతో రాధ బొమ్మను వదిలేసి చుట్టు పక్కల చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. నిజం నాకు తెలిసినట్టు రాధకు తెలిస్తే ఆమె చచ్చిపోతుంది. అంటూ ఆదిత్య పక్కనే నిలుచుండి పోతాడు. అనంతరం ఆ విషయాన్ని తలుచుకుంటూ ఆదిత్య వస్తుండగా అతన్ని చిన్మయి, దేవి చూసి.. అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది దేవి. అనంతరం ఆదిత్యను పట్టుకుంటుంది. ఆదిత్యతో ప్రేమగా మాట్లాడుతుంది. నువ్వు అక్కడికి వచ్చినందుకే నేను గెలిచాను అంటూ చెబుతుంది. దీంతో రుక్మిణీ బతికుందని నీ వల్లే తెలిసింది అంటూ మనసులో అనుకుంటాడు ఆదిత్య. తర్వాత దేవికి ముద్దు పెడతాడు.