Devatha 2 nov Today Episode : తన ప్రేమను తలచుకుంటూ బాధపడుతున్న ఆదిత్యపై దేవుడమ్మ సీరియస్ అవుతుంది. ఇంకెన్ని రోజులు ఇలా బాధపడతావంటూ క్లాస్ పీకుతుంది. సత్యను నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు గొంతు కోసినట్టు అయింది. రుక్మిణి చివరి కోరికను నెరవేర్చలేకపోయాను. ఆడవారి కన్నీటిలో కాగితం పడవులు చేస్తూ ఆడుకుంటున్నావురా.. అంటూ ఆదిత్యను దేవుడమ్మ నానా మాటలు అంటుంది. ప్లీజ్ అమ్మ అలా మాట్లాడొద్దని ఆదిత్య చెబుతాడు.
సత్యను గొడ్రాలు అన్నారు దానికి కారణం నువ్వు అంటే ఆదిత్యపైకి సీరియస్ అవుతుంది దేవుడమ్మ.. ఇక నీతో మాట్లాడను అని ఆదిత్యకు దేవుడమ్మ తేగేసి చెబుతుంది. నువ్వు నాతో మాట్లాడకుంటే నేనెలా ఉంటానమ్మా.. మాట్లాడు అంటూ బ్రతిమిలాడతాడు ఆదిత్య. ఇక శ్రీమంతం ఫంక్షన్‌లో జరిగిన విషయాన్ని తలుచుకుంటూ రుక్మిణి బాధపడుతుంది.
ఇంతలో దేవి ఆమె దగ్గరకు వచ్చి ఎంతకలా ఉన్నావంటూ అడుగుతుంది. అంతలోనే మాధవ్ ఎంట్రీ ఇస్తాడు. శ్రీమంతంలో తల దిరుగుతుందని అన్నావ్ కదా.. హాస్పిటల్‌కు వెళ్దామంటూ చెబుతాడు మాధవ్. ఇందుకు రాధ స్పందిస్తూ.. నా గురించి ఆలోచించకండి.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెబుతుంది. దీంతో మాధవ్ కలుగజేసుకుని ఇంట్లో మనం ఇద్దరం కావొచ్చు. కానీ బయట ఒక్కటేగా.. నీకు ఏమైనా అయితే అందరూ నన్ను తిడతారు అంటూ మాధవ్ వెళ్లిపోతాడు.
Devatha November 2 Episode-1
ఇంట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతుంది సత్య. అంతలోనే ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు. దీంతో అతన్ని హగ్ చేసుకుని సత్య ఏడుస్తుంది. తప్పు నాదే సత్య.. అని చెబుతాడు ఆదిత్య. తప్పు మీది కాదు.. సూటి పోటి మాటలు అన్నవాళ్లది అంటుంది సత్య. ఎవరు ఎలా ఉంటే వాళ్లకేంటి.. శరీరాలు కలిస్తేనే ప్రేమ ఉన్నట్టా.. కలవకుంటే ప్రేమ లేనట్టా.. అంటూ ఏడుస్తుంది. నేను ఫంక్షన్ కు రాకుంటే ఆంటీ ఇలా నీతో మాట్లాడను అని అనేది కాదుగా అంటూ సత్య ఇంకా ఎమోషన్ అవుతుంది.
ఇక దేవుడమ్మ దగ్గరికి వెళ్లిన సత్య భోజనం చేయడానికి రండి ఆంటీ అంటూ పిలుస్తుంది. మీరు మాట్లాడటం లేదని ఆదిత్య చాలా బాధపడుతున్నాడు. ఆయనతో మాట్లాడండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. బాధపడనివ్వు.. అప్పుడే బాధ అంటే ఏంటో తెలిసి వస్తుంది. తప్పు చేసిన వారికి శిక్ష పడాలంటూ దేవడమ్మ కాస్త సీరియస్ గానే మాట్లాడుతుంది. ఇక అలా మాట్లాడొద్దంటూ దేవడమ్మను సత్య రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూద్దాం