• Telugu News
  • movies

Devatha 28 Oct Today Episode : సన్మానంలో ట్విస్ట్ ఇచ్చిన ఆదిత్య.. శ్రీమంతంలో సత్యకు అవమానం.. అంతలోనే రాధ ఎంట్రీ..

Devatha 28 Oct Today Episode : టీవీ వీవర్స్‌ను ఎంతగానో అట్ట్రాక్ట్ చేస్తున్న సీరియల్స్‌లో దేవత సీరియన్ ఒకటి. స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అక్టోబర్ 28న 376వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. చిన్మయి, దేవికి ఆదిత్య గిఫ్ట్‌లు ఇస్తాడు. అనంతరం స్కూల్ వాళ్లు ఆదిత్యను సన్మానించాలని అనుకుంటారు. కానీ సన్మానం నాకు కాదని చదువుల్లో, ఆటల్లో ఫస్ట్ వచ్చేందుకు కృషి చేసిన రాధ, మాధవ్ […].

By: jyothi

Published Date - Thu - 28 October 21

Devatha 28 Oct Today Episode : సన్మానంలో ట్విస్ట్ ఇచ్చిన ఆదిత్య.. శ్రీమంతంలో సత్యకు అవమానం.. అంతలోనే రాధ ఎంట్రీ..

Devatha 28 Oct Today Episode : టీవీ వీవర్స్‌ను ఎంతగానో అట్ట్రాక్ట్ చేస్తున్న సీరియల్స్‌లో దేవత సీరియన్ ఒకటి. స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అక్టోబర్ 28న 376వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం.

చిన్మయి, దేవికి ఆదిత్య గిఫ్ట్‌లు ఇస్తాడు. అనంతరం స్కూల్ వాళ్లు ఆదిత్యను సన్మానించాలని అనుకుంటారు. కానీ సన్మానం నాకు కాదని చదువుల్లో, ఆటల్లో ఫస్ట్ వచ్చేందుకు కృషి చేసిన రాధ, మాధవ్ గారిని బెస్ట్ పేరెంట్స్‌గా సన్మానించాలని చెబుతాడు. తర్వాత పిల్లలంతా రాధను, మాధవిని పైకి తీసుకొచ్చి శాలువాతో సన్మానిస్తారు. మీ పెరేంట్స్ గురించి చెప్పాలంటూ వారిద్దరికి మైక్ ఇస్తారు. దీంతో వారిద్దరు మాట్లాడుతూ మా విజయానికి మా పేరెంట్సే కారణమని చెబుతారు.

అందులోనూ ముఖ్యంగా మా అమ్మ అని, తనకు చదువు రాకున్నా చాలా తెలివైనదని, తనకు సంతకం చేయడం మేమే నేర్చించామని అసలు విషయాన్ని చెప్పడంతో.. అక్కడే ఉన్న ఆదిత్య, రమ్య, రాధ ఒక్క సారిగా షాక్ అవుతారు. ఆదిత్య, రమ్య ఆలోచించుకుంటూ ఎలాంటి అనుమానం లేదు. రాధా, రుక్మణి ఒక్కరే అని అనుకుంటారు. ఇంటికి పదండి తేల్చేద్దామని రమ్య అనడంతో.. ఇప్పుడే వద్దు.. మరిన్ని ఆధారాలు సేకరించాలంటూ ఆదిత్య చెబుతాడు. దానికి రమ్య సైతం సరే అంటుంది.

Devatha 28 Oct Today Episode

Devatha 28 Oct Today Episode

ఇంటికి వచ్చాక పిల్లలకు పెన్‌ను గిఫ్ట్ గా ఇస్తాడు మాధవ్. కలెక్టర్ కావాలంటూ చిన్మయ్‌కు చెబుతుంటే.. నేను కూడా కలెక్టర్ అవుతాను నాన్న.. ఆఫీసర్ గారిలాగా నేను బాగా చదువులుకుంటానంటూ చెబుతుంది. ఈ మాటలతో కోపానికి గురైన మాధవ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనంతరం రాధ పిల్లలపై సీరియస్ అవుతుంది. నాకు చదువు రాదని అందరి ముందు నా పరువు తీసేశారు అంటూ గట్టిగా అంటుంది. అదేంటమ్మ అలా మాట్లాడతావ్.. నీ గొప్పతనం గురించి చెప్పాలనే అలా అన్నాం.

చిన్మయ్‌ వెళ్లిపోగానే దేవి.. ఆదిత్యను పొగుడుతుంది. దీంతో రాధ మళ్లీ దేవిని తిట్టేస్తుంది. ఆఫీసర్‌ గురించి మాట్లాడకుండా ఉండలేవా అని సీరియస్ అవుతుంది. నాకు ఆఫీసర్ సారు నాన్నగా ఎందుకు కాలేదని అనిపిస్తుంది అంటూ అనే సరికి రాధ కాస్త ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మవాళ్ల ఇంటి వద్దకు ఒక ఆఫీసరు వస్తాడు.. మాఅమ్మాయికి శ్రీమంతానికి సంబంధించి ఫంక్షన్ చేస్తున్నామని.. మీరందరూ మా ఇంటికి రావాలని చెబుతాడు. శ్రీమంతం ఫంక్షన్‌లో సత్య అక్షింతలు వేస్తుండగా.. నువ్వు గొడ్రాలివి అక్షింతలు వేయొద్దంటూ ఒకరు ఆపేస్తారు. పిల్లలు పుట్టకపోవడం నా తప్పేనా.. అంటూ సత్య కాస్త ఎమోషనల్ అవుతుంది. అంతలోనే అక్కడ రాధ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఇక్కడి ట్విస్ట్ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.

Tags

Latest News

Related News