Devatha 3 nov Today Episode : రాధ మాటలకు మారిన ఆదిత్య.. సత్యను ప్రేమగా చూసుకుంటానంటూ ప్రామిస్..

Devatha 3 nov Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే దేవత సీరియల్స్‌కు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. పల్లెటూరి భాషలో మాట్లాడే సుహాసిని కోసం వీవర్స్ ఎంతగానే ఎదురుచూస్తారు. ఇదిలా ఉండగా నవంబర్ 3వ టెలికాస్ట్ కానున్న ఎసిపోడ్ గురించి తెలుసుకుందాం. శ్రీమంతంలో జరిగిన సిచ్చువేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది రుక్మిణి.. నా భర్త ఇన్ని సంవత్సరాలుగా నా గురించి ఆలోచిస్తున్నాడా.. ఆయనతో నేను మాట్లాడాలి అంటూ ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఆఫీసర్‌సార్.. నీతో […].

By: jyothi

Published Date - Wed - 3 November 21

Devatha 3 nov Today Episode : రాధ మాటలకు మారిన ఆదిత్య.. సత్యను ప్రేమగా చూసుకుంటానంటూ ప్రామిస్..

Devatha 3 nov Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే దేవత సీరియల్స్‌కు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. పల్లెటూరి భాషలో మాట్లాడే సుహాసిని కోసం వీవర్స్ ఎంతగానే ఎదురుచూస్తారు. ఇదిలా ఉండగా నవంబర్ 3వ టెలికాస్ట్ కానున్న ఎసిపోడ్ గురించి తెలుసుకుందాం.

శ్రీమంతంలో జరిగిన సిచ్చువేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది రుక్మిణి.. నా భర్త ఇన్ని సంవత్సరాలుగా నా గురించి ఆలోచిస్తున్నాడా.. ఆయనతో నేను మాట్లాడాలి అంటూ ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఆఫీసర్‌సార్.. నీతో మాట్లాడాలి.. మొన్న వచ్చారుగా అక్కడికి రండి అని చెబుతుంది. ఇక వెంటనే అక్కడికి వస్తాడు ఆదిత్య. రుక్మిణిని చూస్తూ రమ్మన్నావ్ ఎందుకు? అని అడుగుతాడు. శ్రీమంతం ఫంక్షన్‌లో జరిగిన విషయం మాట్లాడుదామని రమ్మనాను అని రాధ సమాధానం ఇస్తుంది.

Devatha November 3 Episode-2

Devatha November 3 Episode-2

నువ్వు ఆ ఫంక్షన్‌కు వచ్చావా అంటూ ఆశ్చర్యపోతాడు ఆదిత్య. అంటే సత్యను, అమ్మను చూసి కనబడకుంటా దాక్కుండిపోయావ్ కదా అంటూ అంటాడు ఆదిత్య. దాక్కోవాల్సిన అవసరం తనకు లేదని, బయట రుక్మిణి అంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. ఇక మీ వారి ముందు కనిపిస్తే ఏమంటారో అని కనిపించలేదని రాధ చెబుతుంది. సత్యను మీరు ఎందుకు దూరం పెడుతున్నారు. వాళ్లు ఎంత బాధపడుతున్నారో తెలుసా? అంటూ అడుగుతుంది రక్మిణి. మీకు కనిపించని రుక్మిణి కోసం సత్యను ఎందుకు బాధ పెడుతున్నారు. మీ ముందు మీ భార్యకు అలా అవమానం జరిగినా మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు. అందరికీ చెప్పాల్సిన మీరే..

ఇలా వేరే వాళ్లతో చెప్పించుకోవడం బాగోలేదు అని అంటుంది రాధ. లేని వాళ్ల కోసం ఉన్న వారిని వదులుకోకండి అంటు సెంటిమెంట్ డైలాగులు చెబుతుంది. అందుకు ఆదిత్య మాట్లాడుతూ నువ్వు రుక్మిణివి అని నాకు తెలుస్తోంది. నేను సత్య ఒక్కటి అయితే నువ్వు హ్యాపీగా ఉంటావా అని ఆదిత్య ప్రశ్నిస్తాడు. దీంతో రాధ బదిలిస్తూ.. నేను రుక్మిణిని కాదు రాధను.. మీరిద్దరు ఒక్కటైతే నేను సంతోషిస్తాను అని చెబుతుంది.

సీన్ కట్ చేస్తే… ఆదిత్య ఇంటికి వెళ్లి సత్య గురించే ఆలోచిస్తాడు. తర్వాత సత్యకు ప్రేమగా మాట్లాడతాడు. ఇక పాతవి అన్నీ మర్చిపో.. ఈ రోజు నుంచి నాలో కొత్త మనిషిని చూస్తావంటూ సత్యకు చెబుతాడు ఆదిత్య. రుక్మిణి కోసం తీసుకున్న చీరను సత్యకు ఇచ్చి.. ఈ చీర కట్టుకుని రా.. బయటకు వెళదాం అంటాడు ఆదిత్య. అప్పుడే దేవుడమ్మ ఎంట్రీ ఇస్తుంది. చూడండి ఆంటీ.. మా అక్క చీరను నాకిచ్చి కట్టుకోమంటున్నాడు.. నాకు చాలా హ్యాపీగా ఉంది. అని చెబుతుంది సత్య.

Tags

Latest News

Related News