Devatha nov 10th episode : బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఆలరిస్తున్న ‘దేవత’ సీరియల్.. నవంబర్ 10న బుధవారం 382 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులోని హైలెట్స్ ఎంటో ఇపుడు చూసేద్దాం. ఆదిత్య అమ్మవారికి ఇచ్చిన చీరను కట్టుకున్న రాధ.. స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చి ‘సత్య’ లవ్ గురించి ఆదిత్యకు అర్థమయ్యేలా చెబుతుంది. సత్య ప్రేమ మొదటి నుంచి నీ మీద ఒకేలా ఉంది. రాధ మీ జీవితంలోకి వచ్చాక మీరు మారారు.. కానీ, సత్య ప్రేమ ఎన్నడూ మారలేదని గుర్తుచేయడంతో ఆదిత్య ఆలోచిస్తాడు. సత్య తలుచుకుంటే.. నాకు నాకు తాళి కట్టి మా అక్క గురించి ఎలా ఆలోచిస్తారని అడిగితే సమాధానం చెబుతారా అని ఆదిత్య రాధ గట్టిగా అడిగి వెళ్లిపోతుంది.
తల్లికి వార్నింగ్ ఇచ్చిన సత్య..
దేవుడమ్మ ఇంట్లోని అందరితో కలిసి టపాసులు కాలుస్తుంటే.. సత్య పైనే ఉండి బాధపడుతుంది. ఆమె కోసం వెళ్లిన రుక్మిణీ తల్లి అనగా సత్యకు (పినతల్లి) పిలువడానికి వెళ్తుంది. సత్య బాధను చూసి.. నీ భర్త మారడు, నిన్ను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడని అంటుంది. ఆ మాటలను అప్పుడే వచ్చిన ఆదిత్య చాటుగా వింటుంటాడు.
అమ్మా సత్యా మన ఇంటికి పోదాం పదా..? నీ భర్త అసలు మంచోడే కాదని పినతల్లి అనడంతో అమ్మా.. నోటికి ఏదొస్తే అదే మాట్లాడకు.. ఆదిత్య గురించి మరో మాట మాట్లాడితే తల్లివి అని కూడా చూడను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.నా ఆదిత్య అలా మారడానికి కారణం నేనే.. అక్కను పెళ్లిచేసుకోవాలని ఒప్పించాను. నా మీద ప్రేమ పోయేలా చేసుకున్నాను. కానీ, అక్క కూడా నా చెల్లిని ప్రేమించు అని చివరి కోరికగా చెప్పి వెళ్లిపోయింది.
Devatha nov 10th episode :
ఆదిత్యపై సత్య ముద్దుల వర్షం..
క్రాకర్స్ కాల్చి అంతా ఇంట్లోకి వచ్చాక ‘నన్ను క్షమించు సత్యా.. ఇకపై నిన్ను బాధపెట్టను అంటూ సత్యను దగ్గరకు తీసుకుంటాడు ఆదిత్య’..సత్య చాలా సంతోషిస్తుంది. అక్కడ రుక్మిణి మాత్రం పిల్లలు పడుకున్నాక, తన భర్తను దూరం చేసుకున్నానని రాత్రంతా కుమిలిపోతుంటుంది.
ఇక ఉదయం లేవగానే ఆదిత్య ముఖాన అంటుకున్న బొట్టును తుడుస్తూ సత్య తెగ సిగ్గు పడుతుంది. తన భర్త మారడం చూసి ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఆదిత్య మారాడని దేవుడమ్మకు, పినతల్లికి చెప్పి.. కాఫీ తీసుకుని ఆదిత్య వద్దకు వెళ్తుంది. సత్య సంతోషాన్ని చూసి దేవుడమ్మ రుక్మిణీ ఫొటో వద్దకు వెళ్లి.. నీ చివరి కోరిక ఇన్నాళ్లకు తీరిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం..