Devatha Nov 11th Episode : సుహాసిని, అర్జున్‌లు జంటగా నటిస్తున్న సీరియల్ ‘దేవత’. ఈ సీరియల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే రుక్మిణి, ఆదిత్యల మధ్య ప్రేమను ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డ సంగతి అందరికీ విదితమే. నవంబర్ 11న అనగా గురువారం ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం.
రుక్మిణి ఫొటో చూసి దేవుడమ్మ చివరి కోరిక నెరవరేతుందని అంటుంది. ఇక దిగులు లేదు వాళ్లిద్దరూ కలిసిపోయారు. వారసుడి నవ్వుల కోసం ఇల్లు ఎదురు చూస్తుందని అంటూనే..దిగులు పడుతుంటుంది దేవుడమ్మ. రుక్షిణి అమ్మ నీ గురించి కఠినంగా మాట్లాడి ఆదిత్య మనసులో లేకుండా చేశానని చెప్తూ బాధపడిపోతుంది దేవుడమ్మ. ఇప్పుడు నీకు సంతోషమా తల్లి అని అడుగుతుంది.
ఇకపోతే దేవి, ఆదిత్య మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. దేవి, ఆదిత్యకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతుంది. మంచిగా రెస్ట్ తీసుకుంటున్నావా? అలా ఎందుకు చేస్తున్నావ్? దేవి అడుగుతుంది. గా రోజు చెప్పిన మాటలు మర్చిపోయావా? దావత్ ఇస్తా అన్నవ్ కదా.. ఇవ్వాలి మరి అని అంటుంది. దాంతో ఆదిత్య నువ్వు, చిన్మయి రెడీ అయి ఉండండి మీ ఇద్దరిని బయటకు తీసుకెళ్తా అని ఆదిత్య అంటాడు. ఇంతలోనే సత్య వచ్చి ఆది లే అని అంటుంది. ఆ మాట విన్న హ్యాపీగా పైకి లేచి సత్య నువ్వు నన్ను ‘ఆది’ అనే పిలువు అని అంటాడు.
Devatha Nov 11th Episode
దాంతో సత్య ఆనందపడిపోయి.. మనం ఏకాంతంగా ఉన్నపుడు ఆది అని పిలుస్తానులే అని అంటుంది.ఈ క్రమంలోనే దేవీ, చిన్మయితో బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వివరిస్తాడు. దానికి సత్య ఓకే చెప్పి కాఫీ తాగి వెళ్లాలని అంటుంది. మరో వైపు దేవీ, చిన్మయి బయటకు వెళ్లేందుకుగాను రెడీ అయిపోతారు. అంతలోనే మాధవ్ వచ్చి ఆదివారం రోజు హ్యాపీగా క్యారం బోర్డు ఆడేద్దాం అంటాడు. దాంతో రాధా, పిల్లలు అందరూ ఆట ఆడేందుకు వెళ్తారు. దేవీ సైతం క్యారం ఆడేందుకు వెళ్తుంది.
అంతలోనే దేవి తాను ఆదిత్యతో కలిసి బయటకు వెళ్లాలని అనుకున్న విషయం గుర్తొస్తుందేమో తెలియదు. కానీ, ఆట నుంచి లేచేస్తుంది. దేవీ లేచి క్యారమ్ బోర్డ్ కాయిన్స్‌ను చెల్లా చెదురుగా విసిరేస్తుంది. అప్పుడు అయ్యో దేవీ అలా చేశావేంటీ అని అడుగుతాడు మాధవ్.. దానికి నాకు ఇష్టం లేదని చెప్పి దేవీ వెళ్లిపోతుంది. అంతలోనే తనకు కూడా హోం వర్క్ ఉందని చెప్పి అక్కడ నుంచి చిన్మయి వెళ్లిపోతుంది. ఇక ఆదిత్య, సత్య.. చిన్మయి, దేవీని బయటకు తీసుకెళ్లేందుకుగాను కారులో వస్తుండగా, వారికి ఎదురుగా సైకిల్ మీద దేవీ ఎదురొస్తుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.