Devatha nov 12 episode : రాధతో గొడవ పెట్టుకున్న రమ్య.. పిల్లలు ఆదిత్యతో గ‌డ‌ప‌డంతో రాధ సీరియ‌స్‌..

Devatha nov 12 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు్న్న ‘దేవత’ సీరియల్ శుక్రవారం నవంబర్ 12వ తేదీన 384 ఎపిసోడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఇందులోని హైలెట్స్ చూసేద్దాం.. రాధ పిల్లలు ఆఫీసర్ ఆదిత్యకు కాల్ చేసి ఈరోజు మాకు పార్టీ ఇస్తానన్నారు మర్చిపోయారా? అని అడుగడంతో.. అప్పుడే బయటకు వెళ్దామని సత్య అంటుంది. దీంతో తనను తీసుకుని పిల్లల దగ్గరకు వెళ్తాడు ఆదిత్య. ఇకపోతే రాధ ఇంట్లో ఉన్న రమ్యకు కాఫీ […].

By: jyothi

Published Date - Fri - 12 November 21

Devatha nov 12 episode : రాధతో గొడవ పెట్టుకున్న రమ్య.. పిల్లలు ఆదిత్యతో గ‌డ‌ప‌డంతో రాధ సీరియ‌స్‌..

Devatha nov 12 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు్న్న ‘దేవత’ సీరియల్ శుక్రవారం నవంబర్ 12వ తేదీన 384 ఎపిసోడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఇందులోని హైలెట్స్ చూసేద్దాం.. రాధ పిల్లలు ఆఫీసర్ ఆదిత్యకు కాల్ చేసి ఈరోజు మాకు పార్టీ ఇస్తానన్నారు మర్చిపోయారా? అని అడుగడంతో.. అప్పుడే బయటకు వెళ్దామని సత్య అంటుంది.

దీంతో తనను తీసుకుని పిల్లల దగ్గరకు వెళ్తాడు ఆదిత్య. ఇకపోతే రాధ ఇంట్లో ఉన్న రమ్యకు కాఫీ తీసుకుని వెళ్తుంది. పనిచేస్తున్న రమ్యతో.. అది తర్వాత చేద్దువు కానీ ఈ కాఫీ తాగు అంటుంది రాధ.. రమ్య కప్పు తీసుకుని కొద్దిగా టేస్ట్ చేసి విసిరికొడుతుంది.

రాధ తెచ్చిన కాఫీని విసిరిగొట్టిన రమ్య..

కాఫీ సూపర్‌గా పెట్టినట్టు తాగు తాగు అని బలవంత పెట్టావు. దీనికేనా అని అంటుంది రమ్య. అంతలో నీకు నచ్చనిది కాఫీ కాదు నేను.. కావాలనే నాతో రోజు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావ్ అని రమ్యతో అంటుంది రాధ. నీకు త్వరగానే అర్థమైంది.. అయినా ఈ ఇంట్లో నీ పెత్తనమెంటీ? నోటికి వచ్చినట్టు మాటలు అంటుంది రమ్య.. నేను ఈ ఇంటి పెద్ద కోడలి చెల్లెలిని అన్న మర్యాద ఎవరూ ఇవ్వడం లేదని కోపంగా అంటుంది రమ్య.

Devatha nov 12 episode-2

Devatha nov 12 episode-2

ఏందీ నీ బాధ అసలు. నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు.. పోనీ నీకు నా స్థానంలో ఉండాలని ఉంటే చెప్పు అని కోపంగా అంటుంది రాధ. దీంతో రమ్యకు నోటి నుంచి మాట రాలేదు. అయితే, రాధ స్థానంలో రమ్యకు చోటివ్వడం అంటే మాధవను పెళ్లి చేసుకుని ఆ ఇంటి రెండో కోడలిగా సెట్ అవ్వాలన్నది రమ్య ఆలోచనగా అందరూ అనుకుంటారు. ఆ తర్వాత రాధ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంట్లో పిల్లలు లేరని గుర్తించిన రాధ కంగారుగా ఇళ్లంతా వెతుకుతూ ఉంటుంది.

కానీ పిల్లలు మాత్రం ఆఫీసర్ ఆదిత్య, సత్యలతో కలిసి ఐస్‌ క్రీమ్‌ తింటూ ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు కనిపించడం లేదని రామ్మూర్తి, జానకీలను అడుగుతుంటే రమ్య నెమ్మదిగా బయటకు వచ్చి.. ‘ఆఫీసర్ దగ్గరకు పోయి ఉంటారని చెప్పడంతో రాధ కోపంగా.. గా సార్‌కు కాల్‌ చేయండి అంటూ రామ్మూర్తిని అడుగుతుంది. మాధవకు విషయం తెలిసి ఆదిత్యను తిడుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే దేవత కొనసాగుతోంది.

Tags

Latest News

Related News