Devatha Nov 18 Episode: బుల్లితెర ప్రేక్షలకు ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది. నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆఫీసర్ ఆదిత్య రాధ వద్దకు వెళ్లి మీరు నాకు మంచి స్నేహితురాలిగా అయినా ఉంటారా? అని అడుగుతాడు. నాకు మీకు స్నేహం ఏంటీ? నాది మీది స్నేహం చేసే వయస్సు కాదని ఆదిత్యకు కోపం వచ్చేలా చేస్తుంది రాధ. మీరు మీ భార్య ఇప్పుడిప్పుడే బాగుంటున్నారు, అలాగే ఉండండి, నేను రుక్మిణి కాదు, నా వెంట పడకండి అని కుండబద్దలు కొడుతుంది రాధ.
ఆదిత్యకు పాయసం తినిపించిన సత్య.. ఖుషీ అయిన దేవుడమ్మ..
వంటగదిలో దేవుడమ్మ, సత్య కలిసి పాయసం చేస్తుంటారు. దేవుడమ్మ ఆదిత్యకు స్వీట్ తీసుకెళ్లి ఇవ్వాలని అనడంతో సత్య వెళ్లి ఇస్తుంటే, ఆదిత్య మాత్రం అదేది పట్టించుకోకుండా ఫైల్స్ తిరగేస్తుంటాడు. ఇంతలో సత్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనడంతో సరే.. తినిపించు అనడంతో సత్య తన భర్తకు పాసయం తినిపిస్తుంటుంది. అదే టైంలో దేవుడమ్మా వచ్చి వీళ్లిద్దరిని చూస్తుంది. ఆదిత్య, సత్య ప్రేమగా ఉంటున్నారని ఎంతో సంతోషిస్తుంది..
Devata satya
ఇకపోతే రాధ దేవి, చిన్మయిలను ఉయ్యాల ఊపుతుంటుంది. పిల్లలు ఏమో అమ్మా.. నీ చిన్నతనంలో ఉయ్యాల ఊగవా అని అడుగగా, అప్పుడు పని చేయడానికే సరిపోయేది. అప్పుడు ఇవన్నీ లేవని చెప్పడంతో అప్పుడు ఊగకపోతే ఇప్పుడు ఊగు అని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఊపుతుంటారు. ఇంతలో మాధవ్ వచ్చి పిల్లలకు సైగ చేసి సైలెంట్‌గా అక్కడ నుంచి వెళ్లిపోమంటాడు.రాధ కూర్చున్న ఉయ్యాలను మాధవ్ ఊపుతుండగా.. పిల్లలు అనుకోని నెమ్మదిగా ఊపండి కింద పడేస్తారా అంటుంది రాధ.
రాధ, మాధవ్‌లను అలా చూసి రగిలిపోయిన ఆదిత్య
సరిగ్గా అదే టైంలో ఆదిత్య రాధ ఉయ్యాల ఊగడం చూస్తాడు.మాధవ్ వెనుకనుంచి ఊపడానికి చూసి రగిలిపోతాడు. ఇంతలో రాధ తనను ఉయ్యాల ఊపేది మాధవ్ అని తెలుసుకుని చివాట్లు పెడుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారని మండిపడుతుంది. ఇక ఇంట్లోకి వెళ్లి రామ్మూర్తితో మాట్లాడుతుండగా మాధవ్ వచ్చి ఎందుకు వచ్చావ్ అని అడుగడంతో రమ్య అదే టైంలో ఎంట్రీ ఇచ్చి సారీ సార్..! ఫైల్ మారిపోయిందంటూ కవర్ చేస్తుంది. ఆదిత్య, రామ్మూర్తితో మాట్లాడుతూ మీ కొడుకు రాధా.. చాలా అన్యోన్యంగా ఉంటారేమో కాదా.. అనడంతో అవును! బాబు.. నా కోడలు మరణించాక మాధవ్ పిచ్చివాడు అయిపోతే రాధనే వాడిని మార్చింది అని అనడంతో ఆదిత్యకు ఆ ఉయ్యాల సీన్ మాత్రమే గుర్తుకు వస్తుంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘దేవత’ కొనసాగుతోంది.