• Telugu News
  • movies

Devatha Nov 19 today Episode : బయటపడ్డ రాధ, మాధవ్‌ల సంబంధం.. షాక్ కు గురైన ఆదిత్య..

Devatha Nov 19 today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న దేవత సీరియల్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు ఇంతింత ఇంట్రెస్టింగ్ పెంచుతూ సాగుతున్న ఈ సీరియల్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. మరి ఈ రోజు (నవంబర్ 19)న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ విశేషాలు తెలుసుకుందాం. మాధవ్ మామూలు మనిషి కావడానికి కారణం రాధే అని చెబుతాడు రామ్మూర్తి. తర్వాత అక్కడి నుంచి […].

By: jyothi

Updated On - Fri - 19 November 21

Devatha Nov 19 today Episode : బయటపడ్డ రాధ, మాధవ్‌ల సంబంధం.. షాక్ కు గురైన ఆదిత్య..

Devatha Nov 19 today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న దేవత సీరియల్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు ఇంతింత ఇంట్రెస్టింగ్ పెంచుతూ సాగుతున్న ఈ సీరియల్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. మరి ఈ రోజు (నవంబర్ 19)న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ విశేషాలు తెలుసుకుందాం.


మాధవ్ మామూలు మనిషి కావడానికి కారణం రాధే అని చెబుతాడు రామ్మూర్తి. తర్వాత అక్కడి నుంచి వెళ్తున్న మాధవ్ కు రాధ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లిన ఆదిత్య… మీరు, మాధవ్ గారు సంతోషంగా ఉండటం చూస్తుంటే నాకు హ్యాపీగా అనిపించిందని చెబుతాడు.

ఆ మాటలకు రాధ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. అనంతరం రాధ బధులిస్తూ మాధవ్ ను మార్చడంలో నా గొప్పతనం ఏమీ లేదని, చనిపోయిన వారి గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి లాభం ఉండదని చెప్పాను. దానిని ఆయన అర్థం చేసుకుని మారారు అంటూ చెబుతుంది రాధ. తనను ప్రాణంగా పేమించి వ్యక్తి తాను లేకపోతే బ్రతకలేడని తెలిసి కూడా ఆమె చనిపోయింది.

Devatha November 19 Episode-2

Devatha November 19 Episode-2

బతకాలని ఆమెకు ఆశ ఉన్నా.. అది ఆమె చేతుల్లో లేదు కాబట్టి ఆమె చనిపోయింది. అన్ని తెలిసి కూడా నా రుక్మణి చావుకు ఎందుకు ఎదురెళ్లింది రాధ గారు.. నేను ఏమైపోయినా పర్వాలేదనుకుని నన్ను వదిలేసింది. ఆడవాళ్లు గొప్పవాళ్లు. ఏమైనా సాధించగలరు అని చెప్పిన ఆదిత్య.. మాధవ్ కు అదృష్టం, నాకు దురదృష్టం మీలాంటి వారి వళ్లే కదా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆదిత్య.

నేనే రుక్మిణిని అని తెలిసిపోతే ఇంకేమానా ఉంటుందా? అంటూ ఏడుస్తూ ఉంటుంది రాధ. రాధను మాధవ్ ఉయ్యాలను ఊపుతున్నప్పుడు హ్యాపీగా ఉన్న విషయాలను గుర్తుచేసుకుంటున్న మాధవ్.. ఫొటో ఫ్రేమ్‌లోంచి అతని భార్యకు సంబంధించిన ఫొటోను తీసి ఆ స్థానంలో రాధ ఫొటోను అంటిస్తాడు. జీవితం ఇలా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటాడు మాధవ్. జానకి, రామ్మూర్తి సైతం ఆ ఫొటోను చూసి నవ్వుతారు. ఇక చిన్మయి, దేవి.. ఆదిత్యకు ఫోన్ చేస్తారు. తాము కొండలమ్మ టెంపుల్‌కు వెళ్తున్నామని మీరూ రావాలని సార్ అంటూ అతన్ని ఒప్పిస్తారు. ఇక అందరూ రెడీ అయ్యాక కారు శబ్ధం వినిపిస్తుంది. దీంతో ఆఫీసరు వచ్చాడని వెళ్లి లోపలికి పిలుస్తాడు రామ్మూర్తి. అనంతరం అందరూ కలిసి గుడికి వెళ్తామని అనుకుని గుడికి చేరుకుంటారు. ఇక మిగతా భాగంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరుసటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Tags

Latest News

Related News