Devatha Nov 22 today Episode : దేవిని సేవ్ చేసిన ఆదిత్య.. మరి రాధ అసలు విషయం చెప్పేసిందా?

Devatha Nov 22 today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే దేవత సీరియల్‌కు చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. రోజుకో ఇంట్రెస్టింగ్ సీన్‌తో కథ ముందుకు సాగుతోంది. మరి ఈ రోజు ఎపిసోడ్ ( నవంబర్ 22, 2021)న ఏం జరిగిందో తెలుసుకుందాం. రాధతో ముడికి కట్టించే బాధ్యత నీదే మాధవ్ అంటూ చెబుతాడు రామ్మూర్తి. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక చిన్మయి, దేవితో ఆడుకుంటూ ఉండగా ఉండగా ఆదిత్యకు.. […].

By: jyothi

Updated On - Mon - 22 November 21

Devatha Nov 22 today Episode : దేవిని సేవ్ చేసిన ఆదిత్య.. మరి రాధ అసలు విషయం చెప్పేసిందా?

Devatha Nov 22 today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే దేవత సీరియల్‌కు చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. రోజుకో ఇంట్రెస్టింగ్ సీన్‌తో కథ ముందుకు సాగుతోంది. మరి ఈ రోజు ఎపిసోడ్ ( నవంబర్ 22, 2021)న ఏం జరిగిందో తెలుసుకుందాం. రాధతో ముడికి కట్టించే బాధ్యత నీదే మాధవ్ అంటూ చెబుతాడు రామ్మూర్తి. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


ఇక చిన్మయి, దేవితో ఆడుకుంటూ ఉండగా ఉండగా ఆదిత్యకు.. సత్య నుంచి ఫోన్ వస్తుంది. అతడు ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఆగిఉన్న కారు వెనకకు వస్తుంటుంది. దీంతో అక్కుడున్న రామ్మూర్తి, రాధా అది చూసి దేవీ.. అని అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంతో మాధవ్ కిందపడిపోతాడు. అది గమనించిన ఆదిత్య దేవిని పక్కను నెట్టి కారు తగలకుండా సేవ్ చేస్తాడు.


అయితే ఆ భయంతో దేవి సృహతప్పి పడిపోతుంది. ఇక దేవికి ట్రీట్ మెంట్ చేసేందుకు గుడిలోకి ఆదిత్య వెళ్తాడు. మోహంపై నీళ్లు చల్లగానే దేవీకి మెలకువ వస్తుంది. ప్రాణాలు లెక్కచేయకుండా దేవిని కాపాడారు అని.. ఆమెకు ఏమైనా జరిగితే మేం బతికే వాళ్లము కాదని జానక అంటుంది.

Devatha Nov 22 today Episode-2

Devatha Nov 22 today Episode-2

అయితే ఆదిత్య బదిలిస్తూ దేవికి ఏమైనా జరిగితే అందరి కంటే నేనే ఎక్కువగా బాధపడేవాడినని.. దేవిని కాపాడితే నన్ను నేను కాపాడుకున్నట్టు ఉందని చెబుతాడు. మీరు అంతగా నాకు కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటే.. నాకో సాయం చేయండి.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మీ పిల్లలతో ఆడుకునేందుకు అవకాశమివ్వండి అని అడుగుతాడు ఆదిత్య. అందుకు రామ్మూర్తి బదులిస్తూ.. మీ ఇష్టం వచ్చినప్పుడల్లా పిల్లల దగ్గరకు రండి.. దానికి అంతలా అడగాలా అంటూడు రామ్మూర్తి. అదే టైంలో ఆదిత్య బయటకు వెళ్లడంతో రాధ అతని కాళ్లపై పడి ఏడుస్తుంది. దేవిని సేవ్ చేసినందుకు మీకు రుణపడి ఉంటానంటూ సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది.


దేవిని నేను కాపాడానని అంతా అనుకుంటున్నారు. దేవిని కాపాడితే నా బిడ్డను నేను కాపాడుకున్నట్టు అనిపిస్తుందని చెబుతాడు ఆదిత్య. దేవిని చూసినప్పటి నుంచే తనకు అలా అనిపిస్తుందంటాడు. అలా ఎందుకు అనిపిస్తుందో అర్థం కావడం లేదని, తమ మధ్య ఆ బంధం ఏంటో తెలియడం లేదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దేవి నీ బిడ్డే అంటూ మనసులో అనుకుని బాధపడుతుంది రాధ. ఇక రామ్మూర్తి తన భార్యతో ముడుపుకడతాడు. అనంతరం ముడుపు కట్టమని రాధను కోరగా అందుకు ఆమె సీరియస్ అవుతుంది.

Tags

Latest News

Related News