Devatha nov 23 today episode : రాధ మనసులో మాధవ్‌..? రామ్మూర్తికి కండీషన్ పెట్టిన ఆదిత్య..

Devatha nov 23 today episode :స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునే వాటిలో దేవత సీరియల్ ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పడు ట్విస్టులు ఇస్తు కథ ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుంతోంది. మరి ఈ రోజు (నవంబర్ 23, 2021)న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ విశేషాలు తెలుసుకుందాం. రాధ, మాధవ్ ఇద్దరూ కలిసి ముడుపు కడితే వారు భార్యభర్తలని తేలిపోతుందని లేదంటే వారిద్దరు భార్యభర్తలు కాదని అనుకుంటుంది రమ్య. అయితే ఆ మొక్క […].

By: jyothi

Updated On - Tue - 23 November 21

Devatha nov 23 today episode : రాధ మనసులో మాధవ్‌..? రామ్మూర్తికి కండీషన్ పెట్టిన ఆదిత్య..

Devatha nov 23 today episode :స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునే వాటిలో దేవత సీరియల్ ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పడు ట్విస్టులు ఇస్తు కథ ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుంతోంది. మరి ఈ రోజు (నవంబర్ 23, 2021)న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ విశేషాలు తెలుసుకుందాం.


రాధ, మాధవ్ ఇద్దరూ కలిసి ముడుపు కడితే వారు భార్యభర్తలని తేలిపోతుందని లేదంటే వారిద్దరు భార్యభర్తలు కాదని అనుకుంటుంది రమ్య. అయితే ఆ మొక్క దేవి కోసమని జానకి చెబుతుంది. దీంతో ఇక తప్పక మాధవ్ తో కలిసి రాధ ముడుపు కట్టాలనుకుంటుంది. అదే టైంలో మాధవ్‌కు కొంచెం కళ్లు తరిగినట్టు అనిపించడంతో ముడుపును వదిలేస్తాడు.


దానిని రాధ కడుతుంది. కానీ వీరిద్దరిని దూరం నుంచి ఆదిత్య, రమ్య, జానకి, రామ్మూర్తి చూస్తారు. ఇద్దరు కలిసే ముడుపు కడుతున్నారని అనుకుంటారు. ఇక మరుసటి రోజు దేవి.. ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేసిన దేవుడమ్మ ఆదిత్యకు ఫోన్ ఇస్తుంది. ఇక ఆదిత్యతో కొంచెం ఎఫెక్షన్ తో మాట్లాడుతుంది దేవి. ప్రతి రోజూ నేను గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెబుతానని, అందరికంటే నువ్వు నాకు చాలా ఇష్టమని ఆదిత్యతో చెబుతుంది దేవి. అయితే దేవి చెప్పిన విషయాన్ని దేవడమ్మకు చెబుతాడు ఆదిత్య. ఇందుకు దేవుడమ్మ కాస్త సంతోషపడుతూ మీరిద్దరు ఏదో జన్మలో తండ్రికూతుర్లు అయి ఉంటారు అని చెబుతుంది.

Devatha nov 23 today episode -22

Devatha nov 23 today episode -22

తర్వాత రాధ.. మాధవ్ రూంలోకి వెళ్తుంది. నేను ఇలా చెబుతున్నానని ఏమీ అనుకోకండి.. నా బిడ్డకు మీరే సాయం చేశారు.. మీరే దేవికి తండ్రిగా ఉండాలని చెబుతుంది. అలా ఉంటే వాళ్లు ఆఫీసర్ సారుకు దగ్గర కాకుండా ఉంటారు. ఆఫీసర్ సారులాగా మీరు కూడా పిల్లలను ప్రేమగా చూసుకోండి అంటూ చెబుతుంది. ఈ మాటలకు మాధవ్ ఆనందపడతాడు. తన అమ్మ దగ్గరకు వెళ్లి.. నీ మొక్క ఫలించినట్టుంది అమ్మ.. రాధ నాతో ఈ రోజు ఓపెన్ గా మాట్లాడింది.


దేవికి నేనే తండ్రిగా ఉండాలని చెప్పింది. అంటే రాధ మనసులో నాకు స్థానం ఉంటుంది కాదా అని ఆనందపడతాడు. అందుకు జానకి సైతం పొంగిపోతుంది. అనంతరం ఊరి జనంతో కలిసి ఆదిత్య ఇంటికి వెళతాడు రామ్మూర్తి. మీ సహాయానికి సన్మానం చేయాలని అనుకుంటున్నామని చెబుతాడు రామ్మూర్తి. అందుకే కాదనలేక.. ఆ సన్మానం దేవి చేతుతమీదుగా జరగాలని చెబుతాడు ఆదిత్య. అందుకు సరేనంటాడు రామ్మూర్తి. ఇక తర్వాత ఏం జరిగిందనే విషయం నెక్ట్స్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Tags

Related News