Devatha Nov 24 Episode : ఆదిత్యకు దేవి చేతుల మీదుగా సన్మానం.. కలుసుకోబోతున్న రుక్మిణి, దేవుడమ్మా..?

Devatha Nov 24 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న‘దేవత’సీరియల్ చాలా ఆసక్తిగా ముందుకు సాగుతోంది. నవంబర్ 24వ తేదిన ఏం జరిగిందో దాని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. ఆఫీసర్ బాబుకు సన్మానం చేయాలని రామ్మూర్తి వెళ్లి చెప్పడంతో ‘దేవి’చేతుల మీదుగా చేస్తేనే చేయించుకుంటానని ‘ఆదిత్య’ అంటాడు. లేకపోతే అసలు రానని చెబుతాడు. అప్పుడు ‘దేవుడమ్మ’వచ్చి దేవితో ఎందుకు అని అడుగడంతో తనను చూస్తే నా కూతురిలా అనిపిస్తుందని నువ్వే అన్నావు కదమ్మా.. నాకు ఇంకో అమ్మలా […].

By: jyothi

Updated On - Wed - 24 November 21

Devatha Nov 24 Episode : ఆదిత్యకు దేవి చేతుల మీదుగా సన్మానం.. కలుసుకోబోతున్న రుక్మిణి, దేవుడమ్మా..?

Devatha Nov 24 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న‘దేవత’సీరియల్ చాలా ఆసక్తిగా ముందుకు సాగుతోంది. నవంబర్ 24వ తేదిన ఏం జరిగిందో దాని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. ఆఫీసర్ బాబుకు సన్మానం చేయాలని రామ్మూర్తి వెళ్లి చెప్పడంతో ‘దేవి’చేతుల మీదుగా చేస్తేనే చేయించుకుంటానని ‘ఆదిత్య’ అంటాడు. లేకపోతే అసలు రానని చెబుతాడు. అప్పుడు ‘దేవుడమ్మ’వచ్చి దేవితో ఎందుకు అని అడుగడంతో తనను చూస్తే నా కూతురిలా అనిపిస్తుందని నువ్వే అన్నావు కదమ్మా.. నాకు ఇంకో అమ్మలా కనిపిస్తుందని చెప్పావ్.. అందుకే ఇలా చెప్పానని అనడంతో దేవుడమ్మా సరే అంటుంది.


మనవరాలికి రామ్మూర్తి ముద్దులు..

ఆదిత్య ఇంటి నుంచి వచ్చిన ‘రామ్మూర్తి’ఆనందంతో మనవరాలికి ముద్దులు పెడుతూ అదృష్టవంతురాలు అని పొడుగుతాడు. ఆఫీసర్ బాబు దేవి చేతుల మీదుగా సన్మానం చేయించుకోవడానికి ఓకే చెప్పాడు. లేదంటే వద్దే వద్దన్నాడు అనడంతో దేవి కూడా పొంగిపోతుంది.


కానీ , రాధ, మాధవ్ మాత్రం రామ్మూర్తి మీద సీరియస్ అవుతారు. పెద్దవాళ్లుండగా దేవితో ఎందుకని రాధ అనగా.. పాప ప్రాణాలు కాపాడి ఆదిత్యే తనకు పునర్జన్మనిచ్చాడు. అందుకు తాను చేస్తేనే బాగుంటుందని రామ్మూర్తి అనడంతో రాధ, మాధవ్‌లు సైలెంట్ అవుతారు. రాధ మాత్రం తన నా పెనిమిటి బిడ్డే దేవి అని తెలిస్తే తనకు దూరం అవుతుందని లోలోపల ఎంతో బాధపడుతుంటుంది.

Devatha Nov 24 Episode

Devatha Nov 24 Episode

రుక్మిణి, దేవుడమ్మ కలుసుకోనున్నరా..?

ఆదిత్యకు సన్మానం జరుగుతున్న టైంలో ‘రుక్మిణి’ఉంటే ఎంతో సంతోషించేదని మదన పడుతుంటుంది దేవుడమ్మా.. రుక్మిణి ఫోటోకు దండం పెడుతూ తను ఇంకా బతికే ఉందని నీకు ఎలా చెప్పనమ్మా అనుకుంటూ లోలోపల బాధపడుతుంటాడు ఆదిత్య.. ఇంతలో దేవి ఆదిత్యకు కాల్ చేసి వస్తున్నారా? అని అడుగగా హా.. బయలు దేరామని అంటాడు ఆదిత్య.. సత్య కోసం మనసులో నుంచి రుక్మిణి తీసేసావ్.. కానీ, నీ మాటల్లో నుంచి కూడా రుక్మిణి ని దూరం చేస్తే నేను తట్టుకోలేనని అంటుంది దేవుడమ్మా..


అయితే, ఈ సన్మాన కార్యక్రమానికి తాను కూడా వస్తానంటాడు మాధవ.. సరే, వెళ్లి రాధను తీసుకుని రా అనడంతో మాధవ లోనికి వెళ్లగా కర్టన్లు శుభ్రం చేస్తూ రాధ అనుకోకుండా కిందపడబోతుంటే మాధవ చేయి ఇచ్చి సాయం చేయాలని చూడగా.. రాధ నేరుగా కిందకు దూకి కోపంగా మాధవను చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘దేవత’సీరియల్ కొనసాగుతోంది.

Tags

Related News