Devatha nov 5th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘దేవత’సీరియల్ తాజా ఎపిసోడ్ చప్పగా సాగింది. నవంబర్ 5వ తేదిన ఈ సీరియల్ 378 ఎపిసోడ్‌లో అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఇపుడు చూసేద్దాం.. తన భార్య సత్యను ఆఫీసర్ ఆదిత్య బాబు బయటకు తీసుకెళ్తాడు. తిరిగొచ్చాక రుక్మిణీ తల్లి .. సత్య బయట బాగా ఏంజాయ్ చేశారా అని అడుగడంతో తను మౌనంగా ఉంటుంది. ఆదిత్య మాట్లాడుతూ… అమ్మకు నచ్చిన పనే చేశాను.
సత్య.. చెప్పు నేను నిన్ను ఎలా చూసుకున్నానో.. అనడంతో సత్య పైపైన నవ్వుతూ చాలా బాగా చూసుకున్నాడని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది. రుక్మిణీ తల్లి దేవుడమ్మతో పటేల్ సారు మారాడు.. ఇప్పటికైనా ఆదిత్యతో మాట్లాడు అని అంటుంది. దేవుడమ్మ మాట్లాడుతూ… సత్య నిజంగానే హ్యాపీగా ఉంటే మనం అడగక ముందే అన్ని విషయాలు చెప్పేదని బదులిస్తుంది.
రమ్య మాస్టర్ ప్లాన్.. మాధవ, రాధ ఒకే గదిలో
పిల్లలకు గేమ్స్ ఆశ చూపి రమ్య మాస్టర్ ప్లాన్ వేస్తుంది. రాత్రంతా ఇక్కడే ఉంటే చాలా గేమ్స్ ఆడుకోవచ్చని చెబుతుంది. పిల్లలు రాధ వద్దకు వెళ్లి మేము ఈ రాత్రికి చిన్నమ్మ దగ్గరే ఉంటామని చెప్పి పైకి వెళ్తుంటే.. రమ్య రాధతో ఈ రోజు పిల్లలు నాతోనే ఉంటారు. నువ్వు, బావ ఒకే గదిలో పడుకోండని అనగానే.. రామ్మూర్తి, జానకితో సహా మాధవ కూడా షాక్ అవుతాడు. ‘ఏం అంటున్నావ్ అమ్మా..? అని రామ్మూర్తి అనగానే.. అందులో తప్పు ఏముంది ఇన్నాళ్లు వారు పడుకోడానికి పిల్లలే కదా అడ్డు కదా అంటుంది.
Devatha nov 5th episode-2
దీంతో రాధ, మాధవ కోపంగా రగిలిపోతుంటారు. వెంటనే రామ్మూర్తి, జానకి ఇద్దరు కలిసి రాధ వద్దకు వెళ్లి.. ‘ఈ ఇంటి పరువు పోకుండా చూసుకో రాధా అంటూ ఎమోషనల్ అవుతారు. దీంతో రాధ మాధవ రూంలోకి వెళ్తుంది. రమ్య పై నుంచి గమనిస్తుంది. లోనికి వెళ్లిన రాధ.. మాధవతో మీరు మంచంపై పడుకోండి, నేను సోఫాలో పడుకుంటానని చెబుతుంది.
రూమ్‌లో నుంచి సపరేట్‌గా పడుకోవడానికి వెళ్తున్న సత్యను ఆదిత్య ఆపుతాడు. నీదగ్గర నాకు నిజమైన ప్రేమ కనిపించడం లేదని చెప్పి..సత్య వెళ్లి సోఫాలో పడుకుంటుంది. తెల్లవారి రాధ బయటికు వచ్చి కోపంతో రగిలిపోతుంటుంది. పాలు కావాలని పిల్లలు రాధను అడుగగా వెళ్ళి మీ నానమ్మను లేదా మీ పిన్నిని అడగాలని కోపంతో అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాంటే ‘దేవత’సీరియల్ కొనసాగుతోంది.