Devatha Nov 6 today Episode : ఆదిత్యను బాధించిన రమ్య పని.. అంతలోనే పిల్లలపై రాధ సీరియస్..

Devatha Nov 6 today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌లో దేవత సీరియల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో ట్విస్టుతో, మలుపులతో కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. దీనికి ఫ్యామిలీ వీవర్స్ చాలా కనెక్ట్ అయ్యారు. ఇక మరి ఈ రోజు (06 నవంబర్ 2021) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. సీరియస్ గా ఉన్న రాధ వద్దకు వచ్చిన చిన్మయి, దేవి.. అమ్మా.. పాలు కలిపి ఇవ్వు అని […].

By: jyothi

Published Date - Sat - 6 November 21

Devatha Nov 6 today Episode : ఆదిత్యను బాధించిన రమ్య పని.. అంతలోనే పిల్లలపై రాధ సీరియస్..

Devatha Nov 6 today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌లో దేవత సీరియల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో ట్విస్టుతో, మలుపులతో కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. దీనికి ఫ్యామిలీ వీవర్స్ చాలా కనెక్ట్ అయ్యారు. ఇక మరి ఈ రోజు (06 నవంబర్ 2021) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. సీరియస్ గా ఉన్న రాధ వద్దకు వచ్చిన చిన్మయి, దేవి.. అమ్మా.. పాలు కలిపి ఇవ్వు అని అడుగుతారు.

దీనికి రాధ సమాధానమిస్తూ మీ అమ్మ దగ్గరికి పోయి అడగండి.. లేదంటే మీ చిన్నమ్మను అడగండి.. నన్ను అడిగితే బాగోదు అని సీరియస్ అవుతుంది. దీంతో పిల్లలు షాకవుతారు. అలా అంటావేంటమ్మ అని చిన్మయి ప్రశ్నిస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే.. ఫుల్ సీరియస్ గా ఉన్న మాధవ్ వద్దకు వచ్చిన రమ్య.. అలా చూస్తున్నావ్ ఏంటి బావ.. అని అడుగుతుంది. మరదలివి కాబట్టి బతికిపోయావ్ లేదంటే ఏం చేసే వాడినో అంటూ ఫైర్ అవుతాడు మాధవ్.

థాంక్స్ చెబుతావ్ అనుకుంటే ఇలా సీరియస్ అవుతున్నావ్ ఏంటి అని అడుగుతుంది రమ్య. థాంక్స్ చెప్పాలా.. ఎందుకు.. అని మాధవ్ ప్రశ్నిస్తాడు. అదే.. నిన్న నైట్ రాధను, నిన్ను ఒకటి చేశాను కదా.. అని రమ్య చెబుతుంది. రాధ విషయంలో అన్ని తెలుసుకుని బిహేవ్ చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి మాధవ్ వెళ్లిపోతాడు.

Devatha Nov 6 today Episode-2

Devatha Nov 6 today Episode-2

ఇక మరో సీన్ లో.. ఏంటి సార్ డిస్ట్రబ్‌గా ఉన్నారు.. రుక్మిణి కోసం ఆలోచిండచం మానేశారుగా.. నిన్న సత్యను తీసుకుని అలా వెళ్లిపోయారేంటి అని రమ్య అడుగుతుంది. ఎందుకు అలా అనిపించిందని ఆదిత్య ప్రశ్నిస్తాడు. ఇక రాధను ఇబ్బంది పెట్టొద్దు అంటూ బదిలిస్తాడు ఆదిత్య. రాధ.. రుక్మిణి కాదని తేలింది అని కచ్చితంగా చెబుతాడు. తర్వాత రాధ, మాధవ్ ఒకే గదిలోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తుంది రమ్య. దీంతో సీరియస్ అయిన ఆదిత్య.. అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు.

ఇక స్కూలు నుంచి వస్తారు చిన్మయి, దేవి. అమ్మా.. నిన్న చిన్నమ్మ దగ్గర పడుకున్నాం. కానీ ఈ రోజు నీ దగ్గరే పడుకుంటా అని బాధగా చెబుతారు. కోపంగా ఉన్న రాధను బతిమిలాడతారు. ఇక.. భోజనం చేసేందుకు దేవుడమ్మ ఇంట్లో అందరు కూర్చుంటారు. ఏం ఆలోచిస్తున్నావ్ అంటూ సత్యను దేవుడమ్మ అడుగుతుంది. ఆదిత్య గురించే ఆంటీ అంటూ చెబుతుంది సత్య. ప్రేమ గురించి తెలియని వాడిపై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నావ్ అంటూ అడుగుతుంది దేవుడమ్మ.. ఇక అప్పుడే వచ్చిన ఆదిత్యపై అందరూ సీరియస్ అవుతారు.

Tags

Latest News

Related News