• Telugu News
  • movies

Devatha November 16 Episode : రాధతో మాట్లాడేందుకు ఆరాటపడ్డ సత్య.. ఆమెను లాక్కెళ్లిన ఆదిత్య..

Devatha November 16 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ ‘దేవత’. ఈ సీరియల్ తాజాగా 386వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మాధవ ఆదిత్యను అవమానించినందుకుగాను సత్య చాలా బాధపడిపోతుంది. ఈ క్రమంలోనే సత్య ఆవేశంగా రాధ ఇంటికి చేరుకుంటుంది. ఇకపోతే సత్యను చూసి అందరూ అప్యాయంగా పలుకరిస్తుంటారు. ఏంటమ్మా ఇలా వచ్చావ్.. ఆదిత్య బాబు రాలేదా? అని రామ్మూర్తి నవ్వుతూ కుశల ప్రశ్నలు వేస్తారు. అయితే, సత్య […].

By: jyothi

Published Date - Tue - 16 November 21

Devatha November 16 Episode : రాధతో మాట్లాడేందుకు ఆరాటపడ్డ సత్య.. ఆమెను లాక్కెళ్లిన ఆదిత్య..

Devatha November 16 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ ‘దేవత’. ఈ సీరియల్ తాజాగా 386వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

మాధవ ఆదిత్యను అవమానించినందుకుగాను సత్య చాలా బాధపడిపోతుంది. ఈ క్రమంలోనే సత్య ఆవేశంగా రాధ ఇంటికి చేరుకుంటుంది. ఇకపోతే సత్యను చూసి అందరూ అప్యాయంగా పలుకరిస్తుంటారు. ఏంటమ్మా ఇలా వచ్చావ్.. ఆదిత్య బాబు రాలేదా? అని రామ్మూర్తి నవ్వుతూ కుశల ప్రశ్నలు వేస్తారు. అయితే, సత్య మాత్రం రాధ కోసం చూస్తుంటుంది. రాధపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెతో మాట్లాడాలనుకుంటుంది. అయితే, రాధ మాత్రం వంట గదిలోనే ఉండిపోతుంది.

సత్య మాటలు వింటూనే ఉండిపోతుంటుంది. ఇకపోతే ఆదిత్య సత్యను రాధను చూస్తే ఎలా అని కంగారుపడిపోతుంటాడు. జానకి, రామ్మూర్తిలు సత్యను చూసి రాధ కోసం చూస్తున్నావా? అమ్మా అని అడుగుతారు. ఈ క్రమంోలనే రాధను టీ పంపాలని అడుగుతారు. ఇకపోతే వంటగదిలో ఉన్నటువంటి రాధ టీ చేసినప్పటికీ తాను తీసుకెళ్లి ఇవ్వకుండా జానకితోనే ఇచ్చి పంపుతుంది.

Devatha November 16 Episode

Devatha November 16 Episode

ఈ క్రమంలోనే సత్య ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తానే వెళ్లి రాధతో మాట్లాడాలని డిసైడ్ అవుతుంది. సత్య అలా రాధా కోసం వెళ్తుండగా, రాధ అక్కడ నుంచి తన రూంలోకి వెళ్లి తలుపులు పెట్టేసుకుంటుంది. ఈ క్రమంలోనే సత్య రాధను ఫాలో అయి రచ్చరచ్చ చేస్తుంటుంది. తలుపు తియ్యి రాధ అని, అంటుంది. నేను నీకోసం వచ్చాను రాధ అని సత్య పేర్కొంటూనే అరుస్తుంటుంది.

తన భర్తను నీ భర్త ఎలా అన్ని మాటలు ఎలా అంటాడు అని సత్య రాధాను అడుగుతుంది. ఇకపోతే ఈ విషయమై రామ్మూర్తి, జానకీలు సత్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. రాధను బయటకు రావాలని రిక్వెస్ట్ చేస్తారు. సత్య రూమ్ ఎదుట నిల్చొని అలా ఉంటుంది. తాను బయటకు వచ్చేదాకా అలానే ఉంటానని అంటుంది సత్య. దాంతో రాధ కూడా బాగా ఎమోషనల్ అవుతుంది.

సత్య ‘రా రాధా.. బయటకు రా’ అని అరుస్తూనే ఉంటుంది. ఇంతలోనే ఆదిత్య ఎంట్రీ ఉంటుంది. ఆదిత్య సత్యపై అరిచేయడంతో పాటు ఆమెను బలవంతంగా లాక్కెళతాడు. అలా ఆదిత్య ఎంట్రీతోనే రాధ ఊపిరి పీల్చుకుంటుంది. ఆదిత్య ఈ క్రమంలోనే మనసులోనే సత్య గొడవపడుతున్నది తన అక్క రుక్మిణి అలియాస్ రాధతోనే అన్న విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని అనుకుంటాడు ఆదిత్య. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Latest News

Related News