Devatha Oct 21 Episode : రాధా.. రమ్యతో జాగ్రత్తగా ఉండు.. మాధవ్ ఇలా ఎందుకు అన్నాడో తెలుసా..!

Devatha October 21 Episode : సుహాసిని, అర్జున్ జంటగా నటిస్తున్న దేవత సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ప్రధానంగా రుక్మిణీ, ఆదిత్యల మధ్య ప్రేమాయణంకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్టోబర్- 21వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చదవండి.. ఆదిత్య కోసం కంట తడిపెట్టిన సత్య.. ఆదిత్య తనను పట్టించుకోవడం లేదని, తన అక్కకు ఇస్తున్న విలువ కూడా ఇవ్వడం లేదని సత్య ఆదిత్యను అడుగుతుంది. అప్పుడు […].

By: jyothi

Updated On - Thu - 21 October 21

Devatha Oct 21 Episode : రాధా.. రమ్యతో జాగ్రత్తగా ఉండు.. మాధవ్ ఇలా ఎందుకు అన్నాడో తెలుసా..!

Devatha October 21 Episode : సుహాసిని, అర్జున్ జంటగా నటిస్తున్న దేవత సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ప్రధానంగా రుక్మిణీ, ఆదిత్యల మధ్య ప్రేమాయణంకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్టోబర్- 21వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చదవండి..

ఆదిత్య కోసం కంట తడిపెట్టిన సత్య..

ఆదిత్య తనను పట్టించుకోవడం లేదని, తన అక్కకు ఇస్తున్న విలువ కూడా ఇవ్వడం లేదని సత్య ఆదిత్యను అడుగుతుంది. అప్పుడు దేవుడమ్మ ఆదిత్య నీ ఆలోచనలతో సత్యను ఎందుకు బలి చేస్తున్నావ్ అని అడుగుతుంది. మధ్యలో కలుగు జేసుకున్న సత్య.. నా కోసం నువ్వేం చేయకున్నా పర్లేదు కానీ, నీకోసం నేనున్నాని గుర్తిస్తే చాలని బాధపడుతుంది. అంతలోనే ‘ఆడది తిడితే తట్టుకుంటుంది కానీ, తనను లవ్ చేయని భర్త వస్తే తట్టుకోలేదురా ’ అని చెబుతుంది దేవుడమ్మ. దీంతో అక్కడ నుంచి ఆదిత్య వెళ్లిపోతాడు.

ఆదిత్య ఆఫీసకు రావడాన్ని చూసిన రామ్మూర్తి దగ్గరకు వచ్చి బాబు కొంచెం రైతుల సమస్యల్ని చూడు అని చెప్పగా.. నేను ఉండగా వారికి ఏ కష్టం రాదని చెబుతాడు ఆదిత్య. రామ్మూర్తి, భాషా, ఆదిత్య మాట్లాడుకుంటుండగా.. చీర కట్టుకొని రమ్య కారులో వస్తుంది. ఏంటి రమ్య అందగా రెడీ అయ్యావు అంటాడు ఆదిత్య. ఈరోజు తన పుట్టిన రోజు.. మీరు మా ఇంటికి రావాలంటూ ఆదిత్యను ఆహ్వానిస్తుంది రమ్య. సరే అంటాడు ఆదిత్య.

Devatha Oct 21 Episode madhav advise to radha-1

Devatha Oct 21 Episode madhav advise to radha-1

రమ్య బర్త్ డే దగ్గర సీన్ కట్ చేస్తే..

రాధా, జానకి కూరగాయలు కట్ చేస్తూ .. రాధ నీ భర్త ఎవరో గానీ చాలా అదృష్టవంతుడు. నీ ప్రేమ గొప్పది. కానీ మా మాధవ్ జీవితంలోకి రాను అంటున్నావ్ అంటుంది జానకి. దీంతో కోపంగా చూస్తుంది రాధా. ఆఫీసర్ సారు వాళ్ల కుటుంబం ఎంత ఆనందంగా ఉంటారో చూడమ్మా అని జానకి అంటే.. వాళ్లు ఇక్కడకు రావడం నాకు నచ్చలేదంటుంది రాధా.

అదే టైంలో మాధవ్ వచ్చి.. రమ్య ఏమనుకుంటుంది అమ్మ? నాకు నచ్చని ఆ ఆఫీసర్‌ను మన ఇంటికి తీసుకొస్తుంది అనగా.. జానకి కోపంగా ఆయన మన అతిథి.. రావొద్దు అని ఎలా చెబుతావ్ అని సీరియస్ అవడంతో అక్కడినుంచి వెళతాడు మాధవ్.

ఆ తర్వాత మాధవ్ రాధ దగ్గరికి వచ్చి.. నీకో విషయం చెప్పాలి. నా మీద రమ్యకు అనుమానం కలిగి మొన్న టెంపుల్‌కు వచ్చింది. మనం మాట్లాడుకున్నదంతా విన్నట్టు ఉంది. దాని గురించి నన్ను అడిగితే ఏదో కవర్ చేశా.. ఆమెకు అసలు నిజం తెలిస్తే నాకు చిన్మయిని దూరం చేసి, నిన్ను మొత్తానికే బయటకు పంపించేస్తుంది. ఊర్లో పరువు పోతుంది. అలా జరగడం నాకిష్టం లేదు. ప్లీజ్.. రాధా నువ్వు కేర్ ఫుల్‌గా ఉండు అని చెబుతాడు మాధవ్. సరే సారూ అంటుంది రాధా.

ఆదిత్య రమ్య ఇంటికి రాగానే పిల్లలు ఆయన్ను లోనికి తీసుకెళ్తారు. ఆదిత్య రావడం ఇష్టంలోని మాధవ్ తన పిల్లల దగ్గరకు వచ్చి చాక్లేట్స్ ఇస్తాడు. వాటిని తీసుకుని పిల్లలు ఆదిత్య దగ్గరకు వెళ్ళి ముద్దు పెట్టి కృతజ్ఞతలు చెబుతారు.అది చూసి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్య పోతారట. వెంటనే రమ్య కలుగజేసుకుని చాక్లెట్స్ మీ డాడీ ఇస్తే.. సార్‌కు ఎందుకు థ్యాంక్స్ చెప్పారేంటీ అని అడుగగా.. మా డాడీ ఇన్ని రోజులు తమను పట్టించుకోలేదని.. ఆఫీసర్ రాగానే ఇచ్చారని పిల్లలు చెప్పడంతో అంతా షాక్ అవుతారట.. ఆ తర్వాత ఎం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం..

Tags

Latest News

Related News