Devatha oct 29 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘దేవత’ సీరియల్ శుక్రవారం 377 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఆదిత్య, సత్య బాగా క్లోజ్ గా ఉండటాన్ని గమనించి దేవుడమ్మా వారిద్దరూ కలిసిపోయారనుకోలోపే ఊహించని షాక్ తగులుతుంది. అదేంటో ఈ ఎపిసోడ్‌లో చూసేద్దాం.. స్కూల్లో దేవి, చిన్మయ్‌లు అన్న మాటలను ‘ఆదిత్య’ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మా అమ్మకు చదువు రాదని దేవి చెప్పిన మాటలను రివైజ్ చేసుకుంటూ బ్లేడ్‌తో పెన్సిల్ చెక్కుతుంటాడు.
అనుకోకుండా పెన్సిల్ నలక కంట్లో పడుతుంది.ఆదిత్య విలవిలాడుతుండగా సత్య గమనిస్తుంది. ఏది నన్ను చూడని అని సాయం చేస్తుండగా..అప్పుడే దేవుడమ్మ గదిలోకి అడుగు పెడుతుంది. అదే సమయంలో ఆదిత్యకు సత్య చాలా క్లోజ్ గా ఉంటుంది. వారిని చూసిన దేవుడమ్మ ముద్దు పెట్టుకుంటున్నారేమో అనుకుంటుంది. నెమ్మదిగా వాళ్ల మాటలు వినేందుక ట్రై చేస్తుంది.
‘సత్యా నెమ్మది నెమ్మది’ అని ఆదిత్య అంటుండగా.. ఏంటి ఆదిత్య నువ్వు ఏమైనా చిన్న పిల్లోడివా అలా చేస్తున్నావ్ అంటూ సత్య తన పని తాను చేస్తుంటుంది. రుక్మిణీ తల్లిని పిలుచుకొచ్చి దేవుడమ్మ ఆ మాటలను వినిపిస్తుంది. వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ముద్దు పెట్టుకుంటున్నారని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంది దేవుడమ్మా.. నా ఆశలు ఫలించాయనుకునేలోపే ‘నలక’ బయటకు వచ్చిందని తస్య చెప్పడంతోనిరాశ చెందుతారు.
Devatha oct 29 episode-2
సీన్ కట్ చేస్తే.. రాధ ఊరు నుంచి ఆనందయ్య వచ్చి తన కూతురు శ్రీమంతానికి రావాలని ఆదిత్యను పిలుస్తాడు. అందుకు ఆదిత్య కూడా ఓకే అంటాడు. మరోవైపు రాధ అలిగిందని మాధవా, పిల్లలు కూడా తినకుండా అలానే ఉండిపోతారు. దీంతో రాధను ఎలాగోలా ఒప్పించి భోజనానికి వచ్చేలా చేస్తుంది జానకి. మాటల్లో భాగంగా ‘రాధికమ్మ అమ్మాయి శ్రీమంతం జరుపుతున్నారట.. మనం వెళ్లాలని అంటుంది. మొదట నీ చేతులతో వాయినం ఇప్పిస్తానని అంటుంది. అదే ఫంక్షన్‌కు దేవుడమ్మ, ఆదిత్య, సత్య వస్తారు.అప్పుడే కారు దిగిన రాధ.. వాళ్లను చూసి నేను తిరిగి వెళ్లిపోతానంటుంది.
ఇంతలో ఆనందయ్య వచ్చి ‘ఆదిత్య, దేవుడమ్మ, సత్యలను ఇంట్లోకి తీసుకెళ్తాడు. అదే టైంలో శ్రీమంతం ఫంక్షన్‌లో అమ్మాయికి గాజులు తొడగడాన్ని చూసి ఆ స్థానంలో సత్యను ఊహించుకుంటుంది. వాయినం తీసుకున్నాక దేవుడమ్మ, ఆదిత్య మెట్లు దిగడం చూసిన రాధ వారికి కనిపించకుండా తిరుగుతుంది.ఆ తర్వాత ఏం జరుగుతుందంటే.. దేవత సీరియల్ కొనసాగుతోంది…