Devatha october 23 Today episode : రుక్మిణి బతికే ఉందన్న సంకేతాలు.. కథలో ఆసక్తికర మలుపు..

Devatha october 23 Today episode : టెలివిజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో ఒకటి ‘దేవత’ సీరియల్. కాగా, తాజాగా ఈ సీరియల్ 368వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Devatha october 23 Today episode : రాధే రుక్మిణి అని కనిపెట్టేసిన ఆదిత్య.. రమ్య పుట్టిన రోజు సందర్భంగా ఆదిత్యను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ క్రమంలోనే తానే రుక్మిణి […].

By: jyothi

Published Date - Sat - 23 October 21

Devatha october 23 Today episode : రుక్మిణి బతికే ఉందన్న సంకేతాలు.. కథలో ఆసక్తికర మలుపు..

Devatha october 23 Today episode : టెలివిజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో ఒకటి ‘దేవత’ సీరియల్. కాగా, తాజాగా ఈ సీరియల్ 368వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Devatha october 23 Today episode : రాధే రుక్మిణి అని కనిపెట్టేసిన ఆదిత్య..
రమ్య పుట్టిన రోజు సందర్భంగా ఆదిత్యను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ క్రమంలోనే తానే రుక్మిణి అని ఆదిత్య కనిపెట్టేస్తాడని గ్రహించిన రాధ వంటకాల్లో కారం ఎక్కువగా వేస్తుంది. అయితే, ప్రతీ రోజు చాలా బాగా వంటలు చేసే రాధ ఇలా కారం ఎక్కువగా వేయడం చూసి అక్కడున్న వారు ఇలా చేశావేంటి అని రాధను అడుగుతారు. ఇకపోతే కారం తిని నోరు కడుక్కుంటూ అరుస్తున్న ఆదిత్యను చూసి రాధ లోలోపల మధనపడుతుంది.

ఇక్కడే ట్విస్టు వస్తుంది.. తాను రుక్మిణిని కాదని ఇప్పుడైనా నమ్మకం వచ్చిందా? అని రాధ ఆదిత్యను అడగగా, ఇప్పుడు నిజమైన నమ్మకం వచ్చిందని, నువ్వే రుక్మిణివి అని కన్ఫర్మ్ అయిందని ఆదిత్య చెప్పడంతో షాక్ అవుతుంది. ఈ క్రమంలోనే దేవుడమ్మ కాల్ చేసి రుక్మిణికి తద్దినం పెట్టాలని చెప్పడం..ఆదిత్య రమ్యకు ఫోన్ చేసి ఊరు చివరకు రాధను రావాలని చెప్పడం చకచకా జరిగిపోతాయి.
ఇక ఆ తర్వాత ఆదిత్య, రాధ ఇద్దరూ మాట్లాడుకుంటారు. మీకు ఎన్ని సార్లు చెప్పినా మారరా సారు అంటూ ఆదిత్యతో అంటుంది రాధ. అయితే, ఆదిత్య మాత్రం రాధ రాధ కాదని, రుక్మిణి అని బలంగా నమ్ముతున్నానని చెప్తాడు. ఇకనైనా ఒప్పుకో నువ్వే రుక్మిణి అని రాధను ఉద్దేశించి ఆదిత్య అంటాడు.అయినా రాధ మనసు కరగదు. లేని భార్యకు వెళ్లి తద్దినం పెట్టుకో అని చెప్తుంది రాధ. ఈ నేపథ్యంలోనే ఎమోషనల్ స్యాడ్ సాంగ్ ప్లే అవుతుంటే ప్రేక్షకులు కూడా బాధపడే సిచ్యువేషన్స్ ఉంటాయి.

Devatha october 23 Today episode

Devatha october 23 Today episode

మరోవైపు తద్దినానికి ఏర్పాట్లు జరుగుతుండగా, ఆదిత్య రావడానికి ఇష్టపడడు. ఈ క్రమంలోనే తనలో తాను నలిగిపోతూనే వచ్చి పూజలో కూర్చుంటాడు. రుక్మిణి ఫొటోను చూసి ఆమె తల్లి ఏడుస్తుంటుంది. నా భార్య బతికే ఉందని ఆదిత్య తన మనసులో అనుకుంటాడు. అంతలోనే పూజ ప్రారంభమవుతుంది.

ఆదిత్య పూజ చేస్తున్న సమయంలో తన ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది. దాంతో అందరూ షాక్ లో పడిపోతారు. అయితే, రుక్మిణి బతికే ఉందన్న సంకేతం ఇలా అందిందని ఆదిత్య అనుకుంటాడు. అంతటితో పూజను ఆపేస్తాడా అని అనుకునేలోపు ఎపిసోడ్ ముగుస్తుంది. తద్దినం కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.

Tags

Latest News

Related News