Devatha Serial: రుక్మిణీ బ్ర‌తికే ఉంది.. ఈ విష‌యం స‌త్య‌కు మాత్ర‌మే తెలుసు..!

Devatha Serial రాధ‌ని రుక్మిణీగా చూసిన‌ప్ప‌టి నుండి క‌థ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. సత్య.. రుక్మిణీ ఫొటో చేతిలోకి తీసుకుని ఎమోషనల్ అవడం, అదే సమయంలో అనుకోకుండా ఫొటో కిందపడి ఫ్రేమ్‌ పగిలిపోవడంతో.. దాన్ని కట్టించుకోవడానికి ఓ ఫొటో స్టూడియోకి వెళ్లడం, అంతకు 2 నిమిషాల ముందే.. రాధ, దేవి, చిన్మయ్‌లను తీసుకుని అదే ఫొటో షాప్‌లో వాళ్ల మొత్తం ఫ్యామిలీ ఫొటో గ్రూప్‌ ఫొటో పెద్దది కట్టించుకుని వెళ్తుండ‌డం జ‌రుగుతుంది. స‌త్య వ‌చ్చి రుక్మిణి పొటో ఆ […].

By: jyothi

Published Date - Sat - 27 November 21

Devatha Serial: రుక్మిణీ బ్ర‌తికే ఉంది.. ఈ విష‌యం స‌త్య‌కు మాత్ర‌మే తెలుసు..!

Devatha Serial రాధ‌ని రుక్మిణీగా చూసిన‌ప్ప‌టి నుండి క‌థ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. సత్య.. రుక్మిణీ ఫొటో చేతిలోకి తీసుకుని ఎమోషనల్ అవడం, అదే సమయంలో అనుకోకుండా ఫొటో కిందపడి ఫ్రేమ్‌ పగిలిపోవడంతో.. దాన్ని కట్టించుకోవడానికి ఓ ఫొటో స్టూడియోకి వెళ్లడం, అంతకు 2 నిమిషాల ముందే.. రాధ, దేవి, చిన్మయ్‌లను తీసుకుని అదే ఫొటో షాప్‌లో వాళ్ల మొత్తం ఫ్యామిలీ ఫొటో గ్రూప్‌ ఫొటో పెద్దది కట్టించుకుని వెళ్తుండ‌డం జ‌రుగుతుంది.

స‌త్య వ‌చ్చి రుక్మిణి పొటో ఆ వ్య‌క్తికి ఇవ్వ‌డంతో ఎవ‌రు మేడం అని అడుగుతాడు. మా అక్క అని స‌త్య అని స‌మాధానం ఇస్తుంది. ఇప్పుడే మీ వాళ్లు వ‌చ్చి పెద్ద ఫ్రేమ్ క‌ట్టించుకొని వెళ్లారు. ఫ్యామిలీ బాగుంది అని అంటాడు. ‘నిజమేచెబుతున్నారా’ అంటే.. 2 నిమిషాలైదమ్మా వాళ్లు వెళ్లి అంటాడు.

వాళ్ల‌ను చూసేందుకు బ‌య‌ట‌కు ప‌రుగులు తీస్తుంది. దేవిని, చిన్మయ్‌ని కారు ఎక్కించి.. తను కారు ఎక్కుతుండగా.. సత్య రుక్మిణీని చూసేస్తుంది. ‘అక్కా అక్కా’ అంటూ పరుగుతీస్తుంది. కాని రాధ దొర‌క‌లేదు. ఫొటో పట్టుకుని ఇంటికి వెళ్లిన రాధ.. ఆదిత్యకు నిజం చెబితే.. ఆలోచనలో పడిపోతాడనే భయంతో చెప్పకుండా ఆగిపోతుంది. అక్క బతికే ఉందని చిన్న అత్తగారికి నమ్మకం చెబుతుంది.

మరోవైపు రాధ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఆ ఫొటోని మాధవకు ఇచ్చి.. ‘మీరు చెప్పినట్లే కట్టించాను’ అంటూ ఇస్తుంది. అందులో రామ్మూర్తి, జానకి, ఇటువైపు దేవి, రాధ, అటువైపు మాధవ, చిన్మయ్‌లు ఉంటారు. ఆ పెద్ద ఫొటోని రాధ లోపలికి వెళ్లగానే హాల్లో తగిలిస్తాడు మాధవ. మొత్తానికి రుక్మిణి బతికే ఉందనే విషయం సత్యకు తెలిసిపోయింది.

Latest News

Related News