Director Sukumar : నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేసినట్టే నటిస్తుంది. అంత ట్యాలెంటెడ్ యాక్టర్ ఆమె. కాగా ఇప్పుడు ఆమెను అంతా లేడీ పవర్ స్టార్ అంటూ పిలుస్తున్నారు. మరి ఆమెకు ఈ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా.. ఇంకెవరు మన సుకుమార్.
డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన బిరుదుతో ఆమె మరింత ఫేమస్ అయింది. అలాంటి సుకుమార్ ఆమెకు అన్యాయం చేశాడని అంటున్నారు సాయిపల్లవి ఫ్యాన్స్. రీసెంట్ గా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా సంయుక్తకు బదులు సాయిపల్లవిని తీసుకోవాలని అనుకున్నాడంట కార్తీక్.
Director Sukumar Rejected Sai Pallavi For Virupaksha Movie
సినిమాకు బ్యాక్ బోన్ లాంటి పాత్ర ఇది. అయితే ఈ విషయాన్ని సుకుమార్ కు చెప్పగా ఆయన వద్దన్నారంట. సాయిపల్లవిని తీసుకుంటే సినిమాలో ఇచ్చే ట్విస్ట్ ముందే తెలిసిపోతుంది కాబట్టి ఎవరైనా కొత్త అమ్మాయి, ట్యాలెంటెడ్ హీరోయిన్ ను తీసుకోమని చెప్పారంట. దాంతో సంయుక్తను తీసుకున్నారంట కార్తీక్.
ఒకవేళ ఈ పాత్ర సాయిపల్లవి చేసి ఉంటే ఆమె రేంజ్ మరింత పెరిగేది కాబోలు. కానీ ఏం చేస్తాం మన లెక్కల మాస్టర్ ఇలా షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంత పని చేశావయ్యా సుకుమారూ అంటూ సాయిపల్లవి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Rashmika Mandanna : రష్మిక ఇన్ స్టా ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా.. ఒక్క పోస్టుకు అన్ని కోట్లా..?
Read Also : Astrologer Venu Swamy : వరుణ్-లావణ్య పెండ్లిని ముందే చెప్పేసిన వేణుస్వామి.. మరో విషాదం తప్పదా…?