Director Venu Yeldandi Spoke About His First Love An Interview : టాలీవుడ్ లో న్యాచురల్ స్టోరీతో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి.. ఎప్పుడో ఒకసారి అలాంటి జోనర్ లో సినిమాలు తెరకెక్కడం వల్ల ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు బ్రహ్మరధం పడుతున్నారు. మరి మన తెలుగులో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక జోనర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమానే ”బలగం”..
ఈ సినిమా పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సహజ సిద్ధమైన క్యారెక్టర్ లతో ముఖ్యంగా తెలంగాణ పల్లెలో జరిగే అచ్చమైన సన్నివేశాలను గుర్తు చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా తెరకెక్కించిన వేణుకు కూడా మంచి పేరు తెచ్చింది.
ప్రముఖ కమెడియన్ వేణు మొదటిసారిగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి.. దీంతో వేణు పేరు మార్మోగి పోయింది. ఇక సెన్సేషనల్ హిట్ తర్వాత బలగం వేణు మరో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈయన తన లైఫ్ లో ఫస్ట్ లవ్ ఉందని ఆమెని మోసం చేసానని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.
ఎవ్వరికైనా ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది.. అందరిలానే నేను కూడా ప్రేమలో పడ్డాను.. అయితే నేను ఆర్టిస్ట్ అయ్యాక ప్రేమలో పడడంతో నా రేంజ్ మారిపోయింది అనుకున్న.. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను పడేయడానికి ఎన్నో రకాల జోక్స్ వేసేవాడిని.. అయితే ఒకసారి ఆమెను సిటీ మొత్తం తిప్పి బిల్ 30 వేలు చేశాను.
దీంతో నాకు జ్ఞానోదయం అయ్యింది. ఒక అమ్మాయి కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా.. నా కోసం నా అక్కలు ఎంత కష్టపడ్డారు అనేది గుర్తుకు వచ్చింది. ప్రేమించిన తర్వాత కుటుంబం ఒప్పుకోక పోతే ఎలా అని ఆమెను కాదనుకుని ఇంట్లో చుసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను.. అంటూ ఈయన చెప్పిన లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది..
Read Also : Ileana D’Cruz Enjoys Sex : నేను శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తా.. ఇలియానా బరితెగింపు మాటలు..!