Divi Vadthya : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా సరే కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. మొన్నటి వరకు బాలీవుడ్ లోనే ఇది ఎక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇది బాగానే వినిపిస్తోంది. మన తెలుగు అమ్మాయిలు ఎక్కువగా దీనిపై గళం విప్పుతున్నారు.
మీటూ ఉద్యమం తర్వాత చాలామంది తెలుగు అమ్మాయిలు ఈ కాస్టింగ్ కౌచ్ మీద నోరు విప్పుతూ.. హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ దివి కూడా దీనిపై స్పందించింది. ఆమె అంతకు ముందు హీరోయిన్ గా చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ ఆమెకు బిగ్ బాస్ తోనే ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తోంది ఈ భామ. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడింది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా ఇది కామన్ అయిపోయింది. కాకపోతే ఏదైనా మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
కొందరు అవకాశాల కోసం కమిట్ మెంట్లు ఇస్తారు. అలాంటి వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వారిది. కాకపోతే ఒకసారి కమిట్ మెంట్ ఇచ్చి మళ్లీ దానిపై మాట్లాడకూడదు. అలాంటి వారు ఏం చేసినా చెల్లుతుందనుకోవద్దు అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
Read Also : Samantha : సమంతకు ఇంత మందితో లవ్ ఎఫైర్ వార్తలు వచ్చాయా..?
Read Also : Agent Movie : ఏజెంట్ సినిమాను వదులుకున్న లక్కీ హీరో అతనే.. పాపం అఖిల్..!