Tollywood: కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తెలుగు సినిమాలివే.. ఎన్ని హిట్ అయ్యాయంటే…

Tollywood: కోల్ కతా బ్యాక్ డ్రాప్. తెలుగు సినిమాలకు హిట్ ఫార్ములా. అక్కడ తీసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. కొన్ని సినిమాలు బోల్తా పడ్డాయి. అయినా కానీ మన దర్శకులకు కోల్ కతా బ్యాక్ డ్రాప్ అంటే ఎప్పుడూ ఇంట్రెస్టే. సినిమా చూసే ప్రేక్షకులు కూడా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని చెప్పగానే ఏదో ఉందని అంచనా వేస్తారు. అలా ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాలు కోల్ […].

By: jyothi

Updated On - Fri - 3 December 21

Tollywood: కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తెలుగు సినిమాలివే.. ఎన్ని హిట్ అయ్యాయంటే…

Tollywood: కోల్ కతా బ్యాక్ డ్రాప్. తెలుగు సినిమాలకు హిట్ ఫార్ములా. అక్కడ తీసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. కొన్ని సినిమాలు బోల్తా పడ్డాయి. అయినా కానీ మన దర్శకులకు కోల్ కతా బ్యాక్ డ్రాప్ అంటే ఎప్పుడూ ఇంట్రెస్టే. సినిమా చూసే ప్రేక్షకులు కూడా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని చెప్పగానే ఏదో ఉందని అంచనా వేస్తారు. అలా ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాలు కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కాయి. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే..

ఒకప్పటి మెగాస్టార్ చూడాలని ఉంది సినిమా నుంచి ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ వరకు వచ్చిన సినిమాల జాబితా కింది విధంగా ఉంది. మెగాస్టార్, జాతీయ నటి కీర్తి సురేష్, ఏస్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ మూవీ కూడా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లోనే సాగనున్నట్లు తెలుస్తోంది. అక్కడ తీసిన సినమా హిట్ అయిందా, ఫట్ అయిందా అని మన దర్శకులు ఆలోచించడం లేదు. 1996 మెగాస్టార్ చిరంజీవి హీరోగా, గుణ శేఖర్ దర్శకుడిగా వచ్చిన చూడాలని ఉంది చిత్రం కోల్ కతా నగర వీధుల్లో సందడి చేసింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. ఇక పోతే 2001వ సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషీ మూవీ కూడా కోల్ కతా నేపథ్యంలోనే సాగింది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ ఎస్ జే సూర్య తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మణిరత్నం దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా 2004లో యువ సినిమా రిలీజయింది. ఈ సినిమా కథ కూడా కోల్ కతా వీధుల్లోనే తిరిగింది. ఇక 2006లో విక్టరీ వెంకటేశ్ హీరోగా టాప్ డైరెక్టర్ వి. వి. వినాయక్ తెరకెక్కించిన లక్ష్మీ మూవీ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందే.

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకుడిగా సాయిపల్లవి, కృతి శెట్టి లాంటి భామలు కలిసి నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా కోల్ కతా వీధుల్లోనే తిరగనుంది. ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాని సరికొత్త గెటప్ లో దర్శనమిస్తున్నారు.

Tags

Latest News

Related News