Pawan Kalyan : సాధారణంగా సినిమా స్టార్లు అనగానే ఇప్పుడు యాడ్స్ లలో కనిపించడం చాలా కామన్ అయిపోయింది. సినిమాల్లో కంటే కూడా యాడ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే రెండు నిముషాల యాడ్ లో కనిపిస్తే ఏకంగా కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. అందుకే యాడ్స్ లో ఎక్కువగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు హీరో, హీరోయిన్లు.
కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం మనకు యాడ్స్ లలో అస్సలు కనిపించడు. తాను ప్రమోట్ చేసే ప్రాడక్ట్స్ వల్ల జనాలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే ఆయన యాడ్స్ లలో కనిపించరు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన కూడా అప్పట్లో ఓ యాడ్ లో కనిపించారు.
ఆయన ఖుషీ సినిమాతో పెద్ద హిట్ అందుకున్న సమయంలో పెప్సీ యాడ్ లో కనిపించారు. ఈ యాడ్ తర్వాత ఆయన మరో యాడ్ లో కనిపించలేదు. అయితే ఈ యాడ్ కూడా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఇందులో నటించినందుకు పవన్ కు భారీగానే రెమ్యునరేషణ్ ఇచ్చారంట.
ఈ విషయాలను పవన్ కల్యాన్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ దాని తర్వాత ఆయన మరో యాడ్ లో కనిపించలేదు. ఇక ఆయన తర్వాతనే చిరంజీవి థమ్సప్ యాడ్ లో కనిపించారు.