Allu Ramalingaiah :సినిమా ఇండస్ట్రీలో కొందర్ని ఎన్నేండ్లు అయినా సరే మర్చిపోలేం. అందుకే వారిని లెజెండ్స్ అంటూ పిలుస్తాం. అలాంటి వారిలో అల్లు రామలింగయ్య కూడా ఒకరు. ఆయన తన హాస్యంతో కోట్లాదిమందిని నవ్వించారు. కామెడీ చేయడంలో కూడా ఆయనది సెపరేటు స్టైల్ అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.
అయితే ఓ సారి ఆయన్ను కొందరు చెప్పుతో కొట్టారంట. అంత గొప్ప నటుడు చెప్పుదెబ్బలు ఎందుకు పడాల్సి వచ్చిందో చూద్దాం. సినిమాల్లో ఆయన ఎక్కువగా నెగెటివ్ పాత్రలే చేశారు. అయితే అప్పట్లో నెగెటివ్ పాత్రలకు కూడా జనాలు చాలా సీరియస్ గా తీసుకునే వారు.
అప్పట్లో ఓ సినిమాలో అల్లు రామలింగయ్య అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ పిల్లల నోట్లో ఇంకు పిల్లర్ తో ఒక్కొక్క చుక్క పాలను పోస్తారు. ఈ సీన్ అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. రామలింగయ్య ఓ రోజు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో వెనక నుంచి ఆయన్ను చెప్పుతో కొట్టారంట.
కానీ రామలింగయ్య మాత్రం అస్సలు బాధపడలేదు. ఆ చెప్పును తీసుకువచ్చి తన అవార్డ్స్ ఉన్న ప్లేస్ లో పెట్టుకున్నారంట. అది కూడా తనకు అవార్డు లాంటిదే అని చెప్పారంట. తన పాత్ర అంతగా జనాల్లోకి వెళ్లింది కాబట్టే ఈ చెప్పు నా దగ్గరకు వచ్చింది.. ఇది కూడా నాకు ప్రశంస లాంటిదే అని చెప్పుకున్నారంట.