Dr. Rajasekhar : ఆపద్బాంధవుడు రాజశేఖర్.. ఆయన లేకపోయి ఉంటే సునీల్ కూతురు.. ఏమయ్యేదో?

Dr. Rajasekhar : డాక్టర్ కమ్ యాక్టర్ అయిన రాజశేఖర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. యాక్షన్ సినిమాలతో పాటు లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేసిన రాజశేఖర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజశేఖర్ కేవలం నటుడే కాదు ప్రాణం పోసే వైద్యుడు. కాగా, ఫిల్మ్ షూటింగ్ సమయంలో ఏదేని అనుకోని ఘటన జరిగినపుడు […].

By: jyothi

Published Date - Sat - 13 November 21

Dr. Rajasekhar : ఆపద్బాంధవుడు రాజశేఖర్.. ఆయన లేకపోయి ఉంటే సునీల్ కూతురు.. ఏమయ్యేదో?

Dr. Rajasekhar : డాక్టర్ కమ్ యాక్టర్ అయిన రాజశేఖర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. యాక్షన్ సినిమాలతో పాటు లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేసిన రాజశేఖర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజశేఖర్ కేవలం నటుడే కాదు ప్రాణం పోసే వైద్యుడు. కాగా, ఫిల్మ్ షూటింగ్ సమయంలో ఏదేని అనుకోని ఘటన జరిగినపుడు వారి ప్రాణాలు కాపాడేందుకుగాను రాజశేఖర్ ప్రథమ చికిత్స చేసేవారు. ఆ మధ్య ఓ నిర్మాత కమెడియన్‌కు మధ్య గొడవ జరిగి బుల్లెట్ పేలి కమెడియన్ గొంతు నుంచి రక్తం వచ్చినపుడు రాజశేఖర్ ప్రథమ చికిత్స చేసి దేవుడిలా కాపాడాడు.

తాజాగా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ‘భీమవరం బుల్లోడు’ కమెడియన్ కమ్ హీరో సునీల్ కూతురు జీవితాన్ని కాపాడాడట రాజశేఖర్. ఒక టైంలో ఎవరూ తన కూతురుకు ట్రీట్ మెంట్ చేయడానికి ముందు రాని టైంలో రాజశేఖర్ ట్రీట్ మెంట్ చేసి తన కూతురు ప్రాణాలు కాపాడాడని పేర్కొన్నాడు సునీల్.

Rajashekhar

Rajashekhar

తన కూతురు ప్రాణాలు కాపాడిన దేవుడు రాజశేఖర్ అని పేర్కొంటూ సునీల్ భావోద్వేగానికి గురయ్యాడు. తన కూతురు అనారోగ్యం పాలైనపుడు డాక్టర్స్ ఎవరూ ట్రీట్ మెంట్ చేయడానికి ముందుకు రాలేదని ఆ టైంలో రాజశేఖర్ వైద్యం చేశాడని గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి హీరో నిజంగానే ఆపద్బాంధవుడిగా మారి అవసరమైన వారికి వైద్య సేవలు అందించి నిజమైన హీరోగా ముందుకు సాగుతున్నాడు.

Rajashekhar sunil

Rajashekhar sunil

రాజశేఖర్ ఇచ్చిన మెడిసిన్స్ వల్లే తన జీవితం ఇంకొంత కాలం పాటు ఎక్స్‌టైండ్ అయిందని ప్రొడ్యూసర్ డాక్టర్ డి.రామానాయుడు పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులతో పాటు ఇతరులు డాక్టర్ రాజశేఖర్ వద్ద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రాజశేఖర్ హస్తవాసి చాలా మంచిదనే టాక్ కూడా సినీ వర్గాల్లో ఉంది. సీనియర్ హీరో రాజశేఖర్ ‘గరుడ వేగ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

ప్రస్తుతం ‘శేఖర్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ రీమేక్. రాజశేఖర్‌తో పాటు సునీల్ కూడా సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూనే కమెడియన్‌గాను సునీల్ రాణిస్తున్నాడు. విలన్ రోల్స్‌తో పాటు భిన్నమైన పాత్రలను సునీల్ పోషిస్తున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’, విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, శంకర్- రామ్ చరణ్ తేజ్ కాంబో పాన్ ఇండియా ఫిల్మ్‌లో సునీల్ నటిస్తున్నాడు.

Tags

Related News