Dr. Rajasekhar : ఆ చిత్ర షూటింగ్‌లో గన్ పేలి గొంతు నుంచి రక్తం.. రాజశేఖర్ అక్కడ లేకుండి ఉంటే.. ?

Dr. Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్ టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కాగా, రాజశేఖర్ నటించిన ఓ సినిమా విషయంలో జరిగన షాకింగ్ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ తనకు భయమేస్తుందని ఆ మూవీ ప్రొడ్యూసర్ పోకూరి బాబూరావు తెలిపారు. ఇంతకీ ఆ ఘటన ఏంటి? అసలేం జరిగింది? అనే విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి.. రాజశేఖర్ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా […].

By: jyothi

Published Date - Sun - 7 November 21

Dr. Rajasekhar : ఆ చిత్ర షూటింగ్‌లో గన్ పేలి గొంతు నుంచి రక్తం.. రాజశేఖర్ అక్కడ లేకుండి ఉంటే.. ?

Dr. Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్ టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కాగా, రాజశేఖర్ నటించిన ఓ సినిమా విషయంలో జరిగన షాకింగ్ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ తనకు భయమేస్తుందని ఆ మూవీ ప్రొడ్యూసర్ పోకూరి బాబూరావు తెలిపారు. ఇంతకీ ఆ ఘటన ఏంటి? అసలేం జరిగింది? అనే విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి..

Dr. Rajasekhar1

Dr. Rajasekhar1

రాజశేఖర్ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరుతెచ్చుకుని సూపర్ హిట్ మూవీస్ చేశారు. క్రమంగా రాజశేఖర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి సెంటిమెంట్ చిత్రాలు చేసి సక్సెస్ అయ్యాడు. కాగా, సందేశాత్మక చిత్రాల్లోనూ రాజశేఖర్ చాలా బాగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అటువంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ‘నవభారతం’. ఈ ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి ఇటీవల సినిమా ప్రొడ్యూసర్ పోకూరి బాబూరావు వివరించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ‘నవభారతం’ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోందని, అయితే, ఆ రోజున హీరో రాజశేఖర్ షూటింగ్‌కు ఇంకా రాలేదని ఆయన కోసం తాను , మూవీ యూనిట్ సభ్యులు ఎదురు చూస్తున్నామని పోకూరి బాబూరావు చెప్పాడు.

Dr. Rajasekhar122

Dr. Rajasekhar122

రాజశేఖర్ కోసం ఎదురు చూసి చూసి తమకు చిరాకు కూడా వచ్చిందని, ఆయన ఎప్పుడు వస్తాడా? షూటింగ్ ఎప్పుడూ స్టార్ట్ చేద్దాం అని అందరం డిస్కస్ చేసుకుంటుండగా, జూనియర్ ఆర్టిస్ట్ పీఎల్ నారాయణ డమ్మీ పిస్టోల్ తీసుకుని మరో జూనియర్ ఆర్టిస్ట్‌పైన గురిపెట్టాడని పేర్కొన్నాడు. అలా డమ్మీ పిస్టోల్ మరో ఆర్టిస్ట్ పైన పెట్టి. తనకు మద్యం తాగించాలని, తాగిస్తావా.. లేదా అని బెదిరించాడని.. దాంతో సదరు మరో ఆర్టిస్టు భయపడిపోయాడని, అప్పుడు తాను వెళ్లి డమ్మీ పిస్టోల్ తీసుకున్నానని పోకూరి చెప్పాడు. అయితే, ఆ తర్వాత తాను పీఎల్ నారాయణను డమ్మీ పిస్టోల్‌తో బెదిరిస్తే తన చేతిలో చచ్చిపోవడానికి సిద్ధమేనని పీఎల్ నారాయణ అన్నాడని పోకూరి అన్నాడు.

అంతలోనే తాను గాలిలోకి డమ్మీ పిస్టోల్ నుంచి గాలిలోకి ఓ బుల్లెట్ పేల్చానని చుప్.. అనే శబ్దం వచ్చిందని, ఆ తర్వాత పీఎల్ నారాయణ గొంతు దగ్గర డమ్మీ పిస్టోల్ పెట్టానని, అలా పెట్టి.. ట్రిగ్గర్ నొక్కగానే పీఎల్ నారాయణ గొంతు నుంచి రక్తం బయటకు వచ్చిందని పోకూరి బాబూరావు గుర్తు చేసుకున్నాడు.

Dr. Rajasekhar

Dr. Rajasekhar

పీఎల్ నారాయణ త్రోట్ నుంచి బ్లడ్ వస్తుండటం చూసి తాను చాలా భయపడిపోయానని, తన కాళ్లూ చేతులు వణికిపోయాయని, నోటి నుంచి మాటలు అస్సలు రావడం లేదని వివరించాడు. ఆ టైంలో తన జీవితం ఇక అయిపోయిందనుకున్నానని.., అంతలోనే హీరో రాజశేఖర్ వచ్చి పీఎల్ నారాయణకు ప్రథమ చికిత్స చేశాడని, ఆ తర్వాత ఒంగోలు ఆస్పత్రికి తరలించామని వివరించాడు. అలా ఆ‘నాటి’ సంగతి గుర్తు చేసుకుని పోకూరి భయపడిపోయాడు. ఒక వేళ ఆ టైంకు స్వయంగా డాక్టర్ అయిన హీరో రాజశేఖర్ షూటింగ్‌కు రాకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది.

Tags

Latest News

Related News