Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ అప్పటి హీరో అయిన నాగేశ్వరరావు గారు హీరోగా మంచి గుర్తింపును సాధించుకున్నారు అలాగే నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హీరోగా మంచి గుర్తింపు దక్కలేదు ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన శివ సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత నుంచి తను వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకెళ్ళాడు అలాంటి నాగార్జునకి రామానాయుడు కూతురు అయిన శ్రీ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశారు వీరిద్దరికీ నాగ చైతన్య పుట్టిన తర్వాత గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు.
దాంతో శ్రీ లక్ష్మి శరత్ విజయ్ రాఘవ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు తనకి కూడా అది రెండో పెళ్లి నాగచైతన్య బాల్యమంతా తల్లి దగ్గరే గడిచింది. నాగార్జున ఇక్కడ తనతో పాటు సినిమాల్లో నటించిన అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి అఖిల్ పుట్టాడు. అయితే శరత్ శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ముందే తనకు పెళ్లి అయింది తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు తను కూడా వీళ్ళ దగ్గరే ఉండేవాడు శరత్ కొడుకు నాగ చైతన్య ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు.
అయితే ఈ మధ్య శరత్ కొడుకు పెళ్లి అవడంతో నాగచైతన్య తన భార్య అయిన సమంత ఇద్దరు కలిసి పెళ్లికి హాజరయ్యారు నాగచైతన్య హీరో అయినప్పటికీ కూడా శరత్ కొడుకుతో ఇంకా అన్నా తమ్ముళ్లు రిలేషన్ షిప్ ని మెయింటెన్ చేస్తున్నాడు. అయితే నాగ చైతన్య నాగార్జున వారసుడిగా జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేశావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దాంతో సమంత నాగచైతన్య మధ్య ప్రేమ చిగురించింది ఇద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు సమంత కూడా తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది స్టార్ హీరోలందరితో నటించి తను అగ్ర హీరోయిన్ గా గుర్తింపు పొందింది అలాగే దర్శకధీరుడు అయిన రాజమౌళి దర్శకత్వం నాని హీరోగా సమంత హీరోయిన్ గా చేసిన ఈగ సినిమాలో సమంత తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈగ సినిమాలో తన నటనకు విమర్శకుల దగ్గర నుంచి ప్రశంశలు అందుకుంది.
ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లోను, కొన్ని సినిమాల్లోను నటిస్తూ హీరోయిన్ గా బిజీగా గడుపుతోంది అలాగే నాగచైతన్య కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు అలాగే తనకు తన ఫ్యామిలీకి మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాడు. నాగ చైతన్య సమంత ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం మజిలీ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో నాగచైతన్యని అమితంగా ప్రేమించే క్యారెక్టర్ లో సమంత నటించింది భర్త ఏం చెప్తే అది చేసే క్యారెక్టర్ లో ఒదిగి పోయి నటించింది సమంత ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.