Social Media: సోషల్ మీడియా ద్వారా వచ్చి బాగా ఫేమస్ అయిన నటీనటులు ఎవరో మీకు తెలుసా…?

Social Media సినిమాల్లో కనిపిస్తూ గుర్తింపు పొందిన వారు చాలా మంది ఉన్నారు అయితే ప్రతి ఒక్కరికి సినిమాల్లో నటించాలని ఆశ ఉంటుంది దానికోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అలా సక్సెస్ ఫుల్ స్టోరీ అని అనుకున్న చాలామంది స్టోరీలను ఇప్పటికే మనం విని ఉన్నాం అయితే డైరెక్టుగా సినిమానే కాకుండా సోషల్ మీడియాలో ద్వారా కూడా ఫేమస్ అయిన వాళ్ల లో చాలామంది సినిమాల్లో నటిస్తున్నారు అలాగే బుల్లితెరపై కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి […].

By: jyothi

Published Date - Tue - 19 October 21

Social Media: సోషల్ మీడియా ద్వారా వచ్చి బాగా ఫేమస్ అయిన నటీనటులు ఎవరో మీకు తెలుసా…?

Social Media సినిమాల్లో కనిపిస్తూ గుర్తింపు పొందిన వారు చాలా మంది ఉన్నారు అయితే ప్రతి ఒక్కరికి సినిమాల్లో నటించాలని ఆశ ఉంటుంది దానికోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అలా సక్సెస్ ఫుల్ స్టోరీ అని అనుకున్న చాలామంది స్టోరీలను ఇప్పటికే మనం విని ఉన్నాం అయితే డైరెక్టుగా సినిమానే కాకుండా సోషల్ మీడియాలో ద్వారా కూడా ఫేమస్ అయిన వాళ్ల లో చాలామంది సినిమాల్లో నటిస్తున్నారు అలాగే బుల్లితెరపై కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నారు టిక్ టాక్ ద్వారా మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు ఎవరెవరు సినిమాల్లోకి వస్తున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం…
దీప్తి సునయన
దీప్తి సునయన టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చి మంచి కంటెస్టెంట్ గా గుర్తింపు కూడా పొందారు ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో హీరో తనీష్ తనతో క్లోజ్ గా ఉండడం చూసిన జనాలు వాళ్లు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అని ఊహాగానాలు వేసుకున్నారు అలా దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా క్రేజ్ ని సంపాదించుకుంది అలాగే తను చాలా షార్ట్ ఫిలిమ్స్ లో వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రస్తుతం ఆమె మంచి నటిగా గుర్తింపు పొంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
దేత్తడి హారిక
దేత్తడి హారిక అప్పట్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది తను బుల్లితెరపై కూడా చాలా ప్రోగ్రామ్స్ లో కనిపించింది అలాగే మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో లో కూడా కంటెస్టెంట్ గా వచ్చి తనదైన పోటీని ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి చెమటలు పట్టించింది తను కూడా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది…
వైష్ణవి చైతన్య
వైష్ణవి చైతన్య కూడా టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ తో నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా తను చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ తను మంచి నటిగా గుర్తింపు సాధించుకుంది…


దీపిక పిల్లి
దీపిక పిల్లి టిక్ టాక్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు అలాగే ఇంస్టాగ్రామ్ లో కూడా తనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారనే చెప్పాలి ప్రస్తుతం తను ఈటీవీ లో ప్రసారమయ్యే డి కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మెంటర్ గా చేస్తూ బుల్లితెర అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో కూడా పాల్గొంటూ తనదైన నటనతో మంచి గుర్తింపును సాధించుకుంది…
షణ్ముఖ్ జస్వంత్
సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు షణ్ముక్ ఆయనకి ఒక స్టార్ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ వెబ్ సిరీస్ ద్వారా రావడం జరిగింది అలాగే ఆ క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ మన ముందుకు వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు షణ్ముఖ ఇలా తన వెబ్ సిరీస్ ల ద్వారా మనందరినీ ఆకట్టుకుంటున్నాడు షణ్ముక్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు…
సాయి చందు
పక్కింటి కుర్రాడు గా అందరికీ పరిచయమైన సాయి చందు బాగా ఫేమస్ అయ్యాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు సాయి చందు ఆయన సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News