Heroes Temple: సినిమా ఇండస్ట్రీలో హీరోల అభిమానులు హీరోల మీద వాళ్ల అభిమానాన్ని చాటు కోవడానికి రక్త దానాలు చేస్తూ, పేదలకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, తిండి లేని వారికి తిండి పెడుతూ ఉంటారు కానీ కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ల హీరోకి ఏకంగా గుడి కడతారు ఇప్పటివరకు ఏ హీరోకి గుళ్ళు కట్టారో ఒకసారి తెలుసుకుందాం…
ఎన్టీఆర్ నెల్లూరు
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉండడం నిజంగా మన అందరి అదృష్టం గానే చెప్పాలి ఇప్పటికీ రాముడు అంటే ఆయనే గుర్తొస్తాడు కృష్ణుడు అన్న కూడా ఆయనే గుర్తొస్తాడు సినిమాల్లో మన అందరినీ అలరించి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి కూడా వెళ్లి సీఎం అయి పేద ప్రజలందరికీ ఉపాధి కల్పించాడు అలాగే చాలా మందికి సహాయం కూడా చేశారు. అయితే పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరిస్తూ NTR డై హార్డ్ ఫ్యాన్ చిత్తూర్ లో ఆయన పేరు మీద గుడి కట్టించాడు
కరుణానిధి వెల్లూరు తమిళ్ నాడు
సినీ నటుడిగా మంచి గుర్తింపు పొందిన కరుణానిధి అనతికాలంలోనే రాజకీయ రంగం వైపు వెళ్లి రాజకీయ నాయకుడిగా కూడా మంచి గుర్తింపు సాధించాడు అయితే రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు గాను జనాల్లో ఆయన పట్ల గొప్ప భావం ఉండేది అయితే తమిళనాడు సిఎంగా వ్యవహరించిన కరుణానిధికి వెల్లూర్ లో గుడి కట్టించారు ఈ గుడిలో కరుణానిధి రాతి విగ్రహం కనిపిస్తుంది…
కుష్బూ తిరుచ్చురాపల్లి
తమిళనాడులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఖుష్బూ అనతికాలంలోనే హీరోలందరి పక్కన నటించి మంచి నటిగా గుర్తింపు కూడా పొందింది.ఈమధ్య పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ కి అమ్మ గా నటించి మంచి గుర్తింపును సాధించింది. ఒకప్పుడు
స్టార్ హీరోయిన్ గా నీరాజనాలందుకున్న ఖుష్బూకు ఫ్యాన్స్ తిరుచ్చురాపల్లిలో గుడి కట్టించారు. ఖుష్భూ పెళ్లికి ముందే సెక్స్ సరైనదే అని కామెంట్ చేయడంతో ఆవేశంతో ఊగిపోయిన కొంతమంది ఆమె గుడిని ధ్వంసం చేశారు.
అమితాబచ్చన్ కలకత్తా
హిందీ సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలిగిపోయిన అమితాబచ్చన్ చాలా సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు షోలే లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో నటించి నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు కోల్ కత్తాలో అమితాబ్ పేరు మీద అతని ఫ్యాన్స్ ఒక గుడి కట్టించారు ఈ గుడికి ప్రధాన పూజరి కూడా ఉండడం విశేషం…
రజినీకాంత్ కోలార్
ఒక సామాన్య మానవుడు బస్ కండక్టర్ గా ఉద్యోగం చేసుకుంటూ ఉండే ఒక మనిషి సినిమా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగవచ్చు అని నిరూపించిన వ్యక్తి రజనీకాంత్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో హీరోగా నటించాడు. మంచి నటుడిగానే కాకుండా మంచి మానవత్వం ఉన్న మనిషిగా కూడా రజనీకాంత్ చాలాసార్లు తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే వారికి తన వంతు సహాయంగా రజనీకాంత్ అండగా నిలబడతాడు
కర్నాటకలోని కోలార్ లో కోటి శివలింగాలతో ఏర్పాటు చేసిన గుడికి రజనీకాంత్ టెంపుల్ అనే పేరు పెట్టారు అక్కడి రజనీ కాంత్ ఫ్యాన్స్. ప్రస్తుతం రజినీకాంత్ శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు…