మేల్ డైరెక్టర్లకు పోటీగా  డైనమిక్ లేడీ డైరెక్టర్స్

సినీ పరిశ్రమను పురుషాధిక్య పరిశ్రమగా భావిస్తుంటారు. ఇక్కడ మహిళల్ని గ్లామర్ అనే కోణంలో మాత్రమే చూస్తారన్న భావన వుంది. అయితే, కొందరు హీరోయిన్లు కూడా దర్శకులుగా, నిర్మాతలుగా, గాయనీమణులుగా.. ఇలా రకరకాల టాలెంట్స్ ప్రదర్శించి తమదైన ముద్ర వేశారు సినీ పరిశ్రమపై. దర్శకత్వం.. ఈ విభాగంలో చాలావరకు పురుషులే కనిపిస్తారు. అలాగని, పురుషుల్ని సవాల్ చేసిన మహిళామణులు లేరని కాదు. వున్నారు. కానీ, చాలా తక్కువమందే. అలాంటివారి గురించి తెలుసుకుందామా మరి.? విజయనిర్మల రూటే సెపరేటు.. నటిగా […].

By: jyothi

Published Date - Fri - 21 May 21

మేల్ డైరెక్టర్లకు పోటీగా  డైనమిక్ లేడీ డైరెక్టర్స్

సినీ పరిశ్రమను పురుషాధిక్య పరిశ్రమగా భావిస్తుంటారు. ఇక్కడ మహిళల్ని గ్లామర్ అనే కోణంలో మాత్రమే చూస్తారన్న భావన వుంది. అయితే, కొందరు హీరోయిన్లు కూడా దర్శకులుగా, నిర్మాతలుగా, గాయనీమణులుగా.. ఇలా రకరకాల టాలెంట్స్ ప్రదర్శించి తమదైన ముద్ర వేశారు సినీ పరిశ్రమపై. దర్శకత్వం.. ఈ విభాగంలో చాలావరకు పురుషులే కనిపిస్తారు. అలాగని, పురుషుల్ని సవాల్ చేసిన మహిళామణులు లేరని కాదు. వున్నారు. కానీ, చాలా తక్కువమందే. అలాంటివారి గురించి తెలుసుకుందామా మరి.?

విజయనిర్మల రూటే సెపరేటు..

నటిగా ఎన్నో సినిమాల్లో తనదైన నటతో ఆకట్టుకున్న ఒకప్పటి హీరోయిన్ విజయనిర్మల, నటన మాత్రమే కాదు దర్శకురాలిగానూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మలను చూసి, అప్పటి స్టార్ డైరెక్టర్లు. అదేనండీ పురుష డైరెక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆమె మెగా ఫోన్ పడితే సినిమా హిట్టేనన్న భావన వుండేది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ విజయనిర్మల. ‘మీనా’ అనే సినిమాతో దర్శకురాలిగా మారిన విజయ నిర్మల, చాలా చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమె చివరి సినిమా నేరము శిక్ష.

జీవిత రాజశేఖర్

 

హీరో రాజశేఖర్ సతీమణి అయిన జీవిత, నటిగా చాలా సినిమాలు చేశారు. దర్శకురాలిగా మారి కొన్ని సినిమాల్ని తెరకెక్కించారు. రాజశేఖర్ హీరోగానే పలు సినిమాల్ని ఆమె దర్శకురాలిగా తెరకెక్కించడం గమనార్హం. అయితే, దర్శకురాలిగా ఆమెకు పరాజయాలే ఎక్కువగా ఎదురయ్యాయి.

బి.జయ

 

పాత్రికేయురాలిగా పనిచేసిన బి.జయ, తన భర్త బి.ఎ. రాజు సహాయ సహకారాలతో దర్శకురాలిగా మారారు. ‘చంటిగాడు’, ‘లవ్ లీ’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు జయ. ఓ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేశారుగానీ, ఇంతలోనే ఆమె అకాలమరణం చెందారు. లేదంటే, స్టార్ డైరెక్టర్ అనే గుర్తింపుని ఆమె సొంతం చేసుకునేవారే.

నందిని రెడ్డి

‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా మారిన నందిని రెడ్డి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘జబర్దస్త్’ అనే సినిమాతో పరాజయాన్ని చవిచూశారు. ‘కళ్యాణ వైభోగం‘ సినిమాతో మళ్ళీ ఆమె బౌన్స్ బ్యాక్ అయ్యారు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ సినిమాతో ఆమె స్టార్ డైరెక్టర్ అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వెండితెరపై మంచి మంచి సినిమాలు చేస్తూ, ఓటీటీ పైనా ఫోకస్ పెట్టారు నందిని రెడ్డి. ఇటీవలే ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్ వచ్చింది ఆమె నుంచి. అందులో ఓ  కథకు ఆమె దర్శకత్వం వహించారు.

సుధ కొంగర

సుధ కొంగర అనగానే ‘గురు’, ‘ద్రోహి’ తదితర సినిమాలు గుర్తుకొస్తాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, కథా బలం వున్న సందేశాత్మక చిత్రాల్ని తెరకెక్కిస్తుంటారు సుధ కొంగర. తమిళ స్టార్ హీరో సూర్యతో ఇటీవల ఆమె తెరకెక్కించిన ‘ఆకాశం నీ హద్దురా’ సంచలన విజయం సాధించడమే కాదు, విమర్శకుల ప్రశంసల్నీ అందుకుంది. ‘గురు’ సినిమాని ఆమె వివిధ భాషల్లో రూపొందించారు. ‘గురు’ తెలుగు వెర్షన్ కోసం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

శ్రీ ప్రియ

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమాకి దర్శకత్వం వహించారు శ్రీ ప్రియ. తెలుగులో మరో పెద్ద హీరోతో సినిమా తెరకెక్కించాలనే ప్రయత్నాల్లో వున్నారామె. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలను తెరకెక్కిస్తున్నారామె.

లక్ష్మీ సౌజన్య

నాగ శౌర్య హీరోగా ‘వరుడు కావలెను’ అనే సినిమా తెరకెక్కతోంది. ఈ చిత్రానికి దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్.

ఇలా చెప్పుకుంటూ వెళితే లిస్టు చాలా పెద్దదే, షార్ట్ ఫిలింస్ ట్రెండ్ నడుస్తోంది.. అట్నుంచి వెండితెరపై సత్తా చాటేందుకు చాలామంది మహిళా దర్శకులు దూసుకొస్తున్నారు. కుదిరితే సినిమాలు, కుదరకపోతే.. ఓటీటీ ఎలాగూ వారికి అండగానే వుంది. ఆకాశంలో సగం.. డైరెక్షన్ విభాగంలోనూ సగం.. అన్నమాట.

Tags

Latest News

Related News