• Telugu News
  • movies

Khaalli Peeli: 25 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 30 లక్షలు మాత్రమే వచ్చాయి ఇంతకీ అది ఏ సినిమా…?

Khaalli Peeli: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అనేది బాగా ఆడింది అనడానికి చాలా కారణాలు ఉంటాయి అలాగే ఒక సినిమా బాగా ఆడలేదు అని చెప్పడానికి కొన్ని సార్లు కారణాలు ఉండవు కానీ సినిమా మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోతుంది అలాగే ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నప్పటికీ మరీ దారుణమైన డిజాస్టర్ సినిమాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ సినిమాలను చూసినప్పుడు మరి అంత ఫ్లాప్ […].

By: jyothi

Updated On - Mon - 6 September 21

Khaalli Peeli: 25 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 30 లక్షలు మాత్రమే వచ్చాయి ఇంతకీ అది ఏ సినిమా…?

Khaalli Peeli: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అనేది బాగా ఆడింది అనడానికి చాలా కారణాలు ఉంటాయి అలాగే ఒక సినిమా బాగా ఆడలేదు అని చెప్పడానికి కొన్ని సార్లు కారణాలు ఉండవు కానీ సినిమా మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోతుంది అలాగే ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నప్పటికీ మరీ దారుణమైన డిజాస్టర్ సినిమాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.

ఈ సినిమాలను చూసినప్పుడు మరి అంత ఫ్లాప్ సినిమాలు అయితే కాదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమా అనేది ఆడితే ఆడుతుంది లేకపోతే లేదు అలాంటి సినిమాల్లో ఒకటి అనన్య పాండే మరియు ఇషాన్ కట్టర్ ల కాంబినేషన్ లో రూపొందిన ఖాళీ పీలి సినిమా ఒక రకంగా ఈ సినిమా కంటెంట్ పరంగా బాగానే ఉన్నప్పటికీ బాలీవుడ్ హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోవడం వలన నెపో కిడ్స్ పై సుశాంత్ ఫ్యాన్స్ తో పాటు అందరికీ ఉన్న కోపం ఈ సినిమా విషయం లో పీక్స్ కి వెళ్ళింది.

అయితే ఒక వ్యక్తి చావు కారణం అయిన వాళ్ల సినిమా అనేది వస్తే ఒకరకంగా జనాల్లో నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది దాంతో సినిమాను ఎదో రేటు కి అమ్మి డైరెక్ట్ రిలీజ్ చేయకుండా పే పెర్ వ్యూ పద్దతిలో జీ ప్లేక్స్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎంత రిలీజ్ చేసినప్పటికీ సినిమా కి ఏకంగా 25 కోట్ల బడ్జెట్ పెట్టడంతో నిర్మాతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు సరిగ్గా అదే సమయంలో ఈ సినిమాని పే పెర్ వ్యూ పద్దతిలో టికెట్ 299 తో రిలీజ్ చేయగా సినిమాను కొని చూడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు సినిమా కి టోటల్ గా పే పెర్ వ్యూ పద్దతిలో సేల్ అయిన టికెట్లు మొత్తం

20.5 వేల దాకా ఉండగా 299 టికెట్ రేటు తో 61 లక్షల 29 వేల దాకా వెళ్ళగా అందులో జీ ప్లేక్స్ వాళ్లకి 20 లక్షల దాకా వెళ్ళగా నిర్మాతలకు 41 లక్షల దాకా వచ్చిందని, డిజిటల్ యాడ్స్ కి 10 లక్షల వరకు ఖర్చు చేసిన జీ ప్లేక్స్ వాళ్ళు అవి కూడా తీసుకోగా మొత్తం మీద నిర్మాతలకు వెళ్ళింది మాత్రం 30 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు మొత్తం మీద ఈ సినిమాని 25 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే 30 లక్షలు మాత్రమే రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి 25 కోట్లతో నిర్మిస్తే 30 లక్షలు రావడం అనేది బహుశా ఇంత తక్కువ మొత్తం ప్రొడ్యూసర్లకు రావడం అనేది ఈ సినిమానే మొదటి సినిమా ఏమో…

సినిమా ఇండస్ట్రీలో భారీ ఫ్లాప్ లు రావడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది కానీ ఈ సినిమాకి వచ్చిన నష్టాలు ఏ సినిమాకి రాలేదేమో ఎందుకంటే కలెక్షన్స్ పరంగా చూస్తే ఎంత ఫ్లాప్ సినిమా అయినప్పటికీ ఎంతో కొంత కలెక్షన్స్ అనేది సహజంగా వస్తుంటాయి కానీ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మరి దారుణం అని చెప్పాలి బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా కొన్ని భారీ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి అయినప్పటికీ కథ కంటెంట్ బాగానే ఉండి ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోయిన సినిమాలు మాత్రం తక్కువగానే ఉంటాయి…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News