Intinti Gruhalakshmi Nov 22 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతోంది. నందు, తులసి, లాస్య మధ్య జరిగే సన్నివేశాలు అందరినీ మెప్పిస్తున్నాయి. ఇక ఈరోజు ఏం జరిగిందో హైలెట్స్ చూద్దాం.. లాస్య కొడుకు లక్కీ.. కోసం ప్రేమ్, శృతి గొడవ పడుతుంటారు. ఇంతలో తులసి వచ్చి వాడిని కూడా నీ తమ్ముడిగా భావించాలని తులసి చెప్పడంతో ప్రేమ్ సమస్యే లేదని అంటాడు.
కష్టంగా ఉంటుందని ప్రేమ్ అనడంతో… లాస్యను మీ నాన్న పెళ్లి చేసుకుంటే నాకు కలిగే అంత బాధ ఉందా? నీకు అని వెళ్లిపోతుంది తులసి.. జీవితంలో మీ నాన్నతో ఎన్నో కష్టాలు పడ్డాను నేను.. ఆయనతో వాదించలేక ఓడిపోయాను అంటుంది తులసి.. ఇప్పుడు ఏం చేయాలని ప్రేమ్ అడుగడంతో ఇంటి వారసులను అంగీకరించాలని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి..
నీకు ఇష్టలేకపోతే చెప్పు నాన్న.. హాస్టల్‌కు వెళ్తానని నందుతో అన్న లక్కీ..
బాధపడుతున్న లక్కీ కోసం పాస్తా చేస్తాను రా అని పిలుస్తుంది తులసి.. నేనంటే ఇష్టమో లేదో డాడీని అడిగి వస్తానని అంటాడు లక్కీ.. నందు కోపంగా ఆలోచిస్తుండగా.. మిమ్మల్ని డాడీ అంటే నచ్చదా? నేనంటే మీకిష్టమని మమ్మీ చెప్పింది.. ఒక వేళ నేను మీకు నచ్చకపోతే హాస్టల్‌కు వెళ్లిపోతాను.. మీరు రమ్మన్నప్పుడే వస్తానని నందుకు దండం పెడతాడు లక్కీ.. కానీ మారుమాట్లాడకుండా నందు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుండగా లాస్య వచ్చి లక్కీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అంటుంది.
Intinti Gruhalakshmi November 22 Episode-2
అప్పటికే కోపంగా ఉన్న నందు వద్దకు వస్తుంది అనసూయ. ఒరేయ్! నందు ఆ లాస్యను మర్చిపోయి తులసితో కలిసి ఉండరా? ఇన్నిరోజులు తెలిసో తెలియకో తప్పు చేశావు.. ఇకనైనా తప్పు తెలుసుకో అనడంతో అనసూయ మీద సీరియస్ అవుతాడు నందు..
నేను నడిసంద్రంలో ఉన్న నీకేం తెలుసు నా బాధ..
నేను నడి సముద్రంలో ఉన్నాను.. నువ్వు ఒడ్డున ఉన్నావ్ అమ్మా.. నీకు నా బాధ ఎలా తెలుస్తుంది. ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్న నువ్వు ఒక్కసారిగా తులసి వైపు మారిపోయావు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపో అమ్మా అంటాడు నందు.. ఇక దివ్య, లక్కీ ఆడుకుంటుంటే లాస్య వచ్చి వాడితో ఎంటీ? నీకు ఆట అని దివ్య మీద సీరియస్ అవుతుంది.. ఆడుకుందామని పిలిచింది లక్కీనే ఆ మాట తనకు చెప్పుకోవాలని అంటుంది దివ్య కోపంగా లాస్యతో..చివరగా లక్కీ కోసం తులసి పాస్తా చేసి తిందువ్ దా అని తీసుకెళ్తుంది.. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే .. వచ్చే భాగం కోసం వేచిచూడాల్సిందే.