• Telugu News
  • movies

Bigg Boss Telugu 5, Episode 89: మ‌ళ్లీ అదే తీరులో రెచ్చిపోతున్న ష‌ణ్ముక్‌, సిరి.. హ‌గ్గులు, కిస్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ‌..

Bigg Boss Telugu 5, Episode 89: బిగ్ బాస్ హౌస్ కాస్తా హగ్గులు, ముద్దుల హౌస్‌గా మారిపోయింది. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చిన దానిలో షణ్ను-సిరిల కౌగిలింతలు, కిస్సులు ఉండాల్సిందే అన్నట్లుగా సాగుతోంది. కోట్ల మంది ప్రజలు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్ షిప్ హగ్ అంటూనే కెమెరాలకు ఎదురుగా బిగి కౌగిలిలో మునిగిపోతున్నారు. మా అమ్మకు అన్నీ తెలుసులే అంటూ సిరి మరీ బరితెగింపుగా షణ్ముక్‌కు ముద్దులు పెట్టడం బిగ్ […].

By: jyothi

Updated On - Fri - 3 December 21

Bigg Boss Telugu 5, Episode 89: మ‌ళ్లీ అదే తీరులో రెచ్చిపోతున్న ష‌ణ్ముక్‌, సిరి.. హ‌గ్గులు, కిస్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ‌..

Bigg Boss Telugu 5, Episode 89: బిగ్ బాస్ హౌస్ కాస్తా హగ్గులు, ముద్దుల హౌస్‌గా మారిపోయింది. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చిన దానిలో షణ్ను-సిరిల కౌగిలింతలు, కిస్సులు ఉండాల్సిందే అన్నట్లుగా సాగుతోంది. కోట్ల మంది ప్రజలు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్ షిప్ హగ్ అంటూనే కెమెరాలకు ఎదురుగా బిగి కౌగిలిలో మునిగిపోతున్నారు. మా అమ్మకు అన్నీ తెలుసులే అంటూ సిరి మరీ బరితెగింపుగా షణ్ముక్‌కు ముద్దులు పెట్టడం బిగ్ బాస్ ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది.


కాగా, బిగ్ బాస్ ఎపిసోడ్ 89లో టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహించారు. 29 నిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంట్‌లో సన్నీ చివరి స్థానంలో నిలిచాడు. మాసన్ చెప్పిన విధంగా గేమ్ ఆడి తన ఓటమిని తానే తెచ్చుకున్నాడు. ఈ టాస్క్‌లో మానస్ మొదటి స్థానంలో నిలవగా.. షణ్ముక్-2, సిరి-3, శ్రీరామ్-4, ప్రియాంక-5, కాజల్-6, సన్నీ-7వ స్థానంలో నిలిచాడు. అయితే సిరి, షణ్ను 2, 3వ స్థానాల్లో నిలవడంతో ఇద్దరు హగ్గులు ఇచ్చుకోని పండుగ చేసుకున్నారు.


అయితే సిరి హగ్గు అడిగినా షణ్ను కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అయినా సిరి అతడిని బలవంతంగా తన దగ్గరకు రప్పించుకొని హగ్గులు ఇవ్వడం కొసమెరుపు. షణ్ను హగ్గులు ఇస్తూనే ఇది ఫ్రెండ్ షిప్ హగ్గని కెమెరాలను చూస్తూ చెప్పాడు. మా అమ్మకు ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుందిలే.. నువ్వు రా అంటే సిరి అతడిని హత్తుకోని ముద్దు పెడుతుంది. వీరి హద్దులు దాటిన హగ్గులను చూసి పింకీ తనకు కూడా హగ్గు ఇవ్వమని షణ్ముక్‌ను కోరుతుంది. అయితే అటుగా వెళ్తున్న షణ్నును సిరి ఆపి.. ఇప్పుడే ఇక్కడ ఇచ్చావుగా.. కొద్దిసేపు ఆగు అంటూ అతడిని కట్టడి చేస్తోంది.

Bigg Boss Telugu 5, Episode 89-2

Bigg Boss Telugu 5, Episode 89-2

మరోవైపు నిన్నటి ఐస్ ట్యూబ్ టాస్క్‌లో సిరి గాయపడిన విషయం తెలిసిందే. అయితే సిరి ఎక్కడకు వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా షణ్ను ఆమెను చేతులపై ఎత్తుకుని తిప్పుతున్నాడు. బెడ్ రెస్ట్ లో ఉన్న ఆమెకు అన్ని సేవలు చేస్తున్నాడు. దీనిని కూడా సిరి అడ్వాంటేజ్‌గా తీసుకుంది. తనకు సేవలు చేస్తున్న షణ్నుకు హగ్గులు, ముద్దులు ఇవ్వాల్సేందేనని అతడిని బ్లాక్ మెయిల్ చేసి మరీ దగ్గరకు రప్పించుకొని షణ్ను కౌగిలి వెచ్చదనంలో మునిగిపోతుంది.


ఇప్పటికే వీరిద్దరిపై వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, సిరి తల్లి, బాయ్ ఫ్రెండ్ ప్రత్యేకంగా హెచ్చరికలు చేసినా ఆమెలో మార్పు రావడం లేదు. బ్రదర్, సిస్టర్ రిలేషన్ అంటూనే హద్దులు దాటి ప్రవర్తించడం, తాను షణ్నుకి కనెక్ట్ అయ్యానని చెప్పడంపై వీక్షకులు మండిపడుతున్నారు. ఇది బిగ్ బాస్ హౌసా.. హగ్గుల హౌసా అని ప్రశ్నిస్తున్నారు.

Tags

Latest News

Related News