Chiranjeevi: చిరంజీవి నువ్వు ఆ ప‌ని ఆప‌క‌పోతే వెళ్లిపోతా.. అలయ్ బలయ్ లో గ‌రిక‌పాటి ఫైర్‌..!

Chiranjeevi: అలయ్ బలయ్ పేరు వింటే చాలు అందరికీ గుర్తొచ్చేది మాజీ కేంద్రమంత్రి, ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్‌ బండారు దత్తాత్రేయ..

By: jyothi

Published Date - Thu - 6 October 22

Chiranjeevi: చిరంజీవి నువ్వు ఆ ప‌ని ఆప‌క‌పోతే వెళ్లిపోతా.. అలయ్ బలయ్ లో గ‌రిక‌పాటి ఫైర్‌..!

Chiranjeevi: అలయ్ బలయ్ పేరు వింటే చాలు అందరికీ గుర్తొచ్చేది మాజీ కేంద్రమంత్రి, ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్‌ బండారు దత్తాత్రేయ. ఎంపీగా ఉన్నప్పటి నుంచి అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు నాయకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అధికారులను పిలుస్తుంటారు. చాలా ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించి
కులమతాలకు అతీతంగా సామరస్యాన్ని చాటుతుంటారు.

గరికపాటి అసహనానికి చిరునే కారణామా..

ప్రస్తుతం బండారు దత్తాత్రేయ హరియానా గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆయన ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఓసారి ముఖ్య అతిథులుగా చిరంజీవి, గరికపాటి నరసింహారావు కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అంతా ఎవరి బిజీలో వారుండగా…అప్పుడే స్టేజీ మీదకు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారట…

ఆ సమయంలో గరికపాటి నరసింహరావు ప్రవచనాలు చెబుతున్నారు. చిరంజీవిని చూసిన వారంతా సెల్ఫీస్ కోసం ఎగబడ్డారు.. పెద్దలు, పిల్లలు అంతా చిరంజీవిని చుట్టుముట్టి అల్లరి చేస్తుండటంతో గరికపాటి అసహనానికి గురయ్యారట.. తన ప్రవచనాలను ఆ టైంలో ఎవరూ వినడం లేదని ఒక్కసారిగా మైకులో తన అసహనాన్ని వెళ్లగక్కారు.

చిరంజీవి ఫొటోషూట్ ఆపకపోతే తనకు సెలవు ఇప్పించాలంటూ వినమ్రంగా మైకులో వేడుకున్నారట..దీంతో ఆయన మాటల్లో వినమ్రత కంటే అక్కసు కనిపించిందని అక్కడే ఉన్న వారు మాట్లాడుకోవడం ప్రారంభించారు. తన అభిమానులు, చిన్నారుల కోరికను కాదని గరికపాటి చెప్పారని చిరు స్టేజీ మీద నుంచి వచ్చేయాలా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా పెద్దవారికి కాస్త ఓపిక ఉండాలని, ఎదుటివారి ఖ్యాతిని చూసి అసూయ పడరాదని కొందరు గరికపాటికి సూచిస్తున్నారు.

Read Also : Ileana D cruz : ఇలియానా ఇంత మందితో ఎఫైర్ న‌డిపిందా.. పెద్ద ముదురు రా బాబు..!

Read Also : Nagarjuna-Samantha-Nagachaitanya : స‌మంత‌, చైతూ పెండ్లికి నాగార్జున‌ను ఒప్పించిన స్టార్ హీరో అత‌నే..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News