Gattamaneni Krishna : సీనియర్ ఎన్టీఆర్‌ను ఆ సినిమాలో పాత్ర ఇవ్వాలని అడిగిన కృష్ణ.. తర్వాత ఏమైందంటే?

Gattamaneni Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ సృష్టించిన ప్రభం‘జనం’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ, రాజకీయ రంగంలో ధృవతారగా వెలుగొందిన ఎన్టీఆర్..తన నటనతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. మాస్ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచేసుకున్న ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలు అన్నిటిలోనూ సత్తా చాటారు. కాగా, ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్‌లో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో కృష్ణ. ఒకానొక దశలో ఎన్టీఆర్‌తో పోటీ పడేంత స్థాయికి వెళ్లారు కృష్ణ. మాస్ […].

By: jyothi

Published Date - Sat - 20 November 21

Gattamaneni Krishna : సీనియర్ ఎన్టీఆర్‌ను ఆ సినిమాలో పాత్ర ఇవ్వాలని అడిగిన కృష్ణ.. తర్వాత ఏమైందంటే?

Gattamaneni Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ సృష్టించిన ప్రభం‘జనం’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ, రాజకీయ రంగంలో ధృవతారగా వెలుగొందిన ఎన్టీఆర్..తన నటనతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. మాస్ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచేసుకున్న ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలు అన్నిటిలోనూ సత్తా చాటారు. కాగా, ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్‌లో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో కృష్ణ.

ఒకానొక దశలో ఎన్టీఆర్‌తో పోటీ పడేంత స్థాయికి వెళ్లారు కృష్ణ. మాస్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న కృష్ణ.. ప్రయోగాలు చేసే విషయంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ..తొలుత తనకు సినీ అవకాశం కావాలని ఎన్టీఆర్‌నే అడిగారట.

‘సీతారామ కళ్యాణం’ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ సీనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. ఆ చిత్రంలో తనకు రాముని వేషం ఇవ్వాలని అడిగారు. అయితే, అప్పుడు కృష్ణ వయసు రిత్యా కొంచెం చిన్నవాడిగా కనిపించడంతో సీనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రకు నీవు సరిపోవని చెప్పాడు. దాంతో పాటు లక్ష్మణుడి పాత్రను నీకు ఇవ్వాలనుకున్నా అప్పటికే ఆ పాత్రను వేరే వాళ్లకు ఇచ్చేశామని, మూడేళ్ల తర్వాత వచ్చి కనిపించాలని ఎన్టీఆర్ కృష్ణకు చెప్పి పంపించారు. అయితే, ఆ టైంలో కృష్ణ వయసు 18 ఏళ్లు. కాగా, ఆ తర్వాత మూడేళ్ల పాటు సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో వేషం కోసం వేచి చూడకుండా కృష్ణ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

sr ntr krishna

sr ntr krishna

Krishna Tene manasulu

Krishna Tene manasulu

మూడేళ్ల తర్వాత ‘తేనె మనసులు’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే, తొలి సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ ఎన్టీఆర్ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్, కృష్ణ అన్నా దమ్ములుగా సినిమాలు చేశారు. ఇద్దరూ పోటీ పడి మరి సినిమాలు చేశారు. కృష్ణ సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ నటించారు. అన్నా దమ్ములుగా వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

sr ntr seethaarama kalyanam 1

sr ntr seethaarama kalyanam 1

ఇకపోతే కృష్ణ ఎక్సపరిమెంట్‌గా చేసిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని సీనియర్ ఎన్టీఆర్ చూసి అభినందించారు. తొలుత ఆ సినిమా చేయొద్దు బ్రదర్ అని కృష్ణకు ఎన్టీఆర్ చెప్పారట. కానీ, చిత్రం పూర్తి అయిన తర్వాత చూసి మరీ కృష్ణను అభినందించారు.

Krishna Tene manasulu 11

Krishna Tene manasulu 11

ఆ తర్వాత కాలంలో సినీ రంగంలో ఎలాగూ ధృవతారగా వెలుగొందిన సీనియర్ ఎన్టీఆర్ ‘తెలుగు దేశం పార్టీ’ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు.

Tags

Latest News

Related News