Gattamaneni Krishna : టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గురించి తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన పని లేదు. వైవిధ్యమైన చిత్రాలు చేసి తెలుగు ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కృష్ణ.. సినిమా రంగంలో ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచాడు. జానపద, సాంఘిక, పౌరాణిక సినిమాలతో పాటు డిఫరెంట్‌గా కౌబాయ్, జేమ్స్ బాండ్ సినిమాలు చేసి నటశేఖర కృష్ణ కాస్త సూపర్ స్టార్ అయి అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు.
Gattamaneni Krishna 2
అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం చూసి తాను సినిమాల్లోకి రావాలనుకున్నానని కృష్ణ తెలిపాడు. అలా ఆదుర్తి సుబ్బారావు కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నారన్న ప్రకటన చూసి తన ఫొటోలు పంపి ఆ సినిమాలో సెలక్ట్ అయ్యాడు కృష్ణ.‘తేనె మనసులు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృష్ణ.. విలక్షణ నటుడిగా అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. కాగా, ఆయన రేంజ్‌ను పెంచిన సినిమా ఏంటంటే..
కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కృష్ణ ఆ తర్వాత కాలంలో హీరోగా సినిమాలు చేసి వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. ఏడాదికి పది సినిమాల చొప్పున 30 ఏళ్ల పాటు కృష్ణ 300 సినిమాలు చేయడం విశేషం. కొత్త రకం టెక్నాలజీని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో కృష్ణ ఎప్పుడూ ముందుండేవాడు. సినీ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. కృష్ణ కెరీర్‌లో ఎన్నో ప్రత్యేకమైన సినిమాలున్నప్పటికీ ఆయనకు స్టార్ హీరో రేంజ్ తెచ్చి.. ఆయన రేంజ్‌ను మరింతగా పెంచిన చిత్రం ‘గూఢాచారి 116’. ఈ ఫిల్మ్‌తో కృష్ణకు మాస్ ఇమేజ్ వచ్చిందని పేర్కొంటారు.
Gattamaneni Krishna
ఇకపోతే ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుండే కృష్ణ.. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చేసి తన క్రేజ్‌ను ఇంకా పెంచేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల్లోనూ కృష్ణ నటించారు. నటుడిగానే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ సహకారంతో అప్పట్లోనే కృష్ణ పద్మాలయ స్టూడియోస్ నిర్మించాడు. ఇండస్ట్రీలో సాంకేతికత బాగా పెరగాలనే ఆకాంక్షించే నటుల్లో ఒకరు కృష్ణ అని చెప్పొచ్చు.
Gattamaneni Krishna gg
వృద్ధాప్యం వల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ కృష్ణ. ఇకపోతే కృష్ణ నట వారసత్వాన్ని ఆయన తనయుడు మహేశ్ బాబు కొనసాగిస్తున్నారు. ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు.. అంతకు ముందు బాల నటుడిగా కృష్ణ పలు చిత్రాల్లో నటించాడు. మహేశ్ బాబు ప్రజెంట్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు.