intinti Gruhalakshmi nov 02 episode : జీకే చేతిలో నందుకు ఘోర అవమానం.. అంకితను మడతబెట్టిన రాములమ్మ.. !

intinti Gruhalakshmi nov 02 episode : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో డిపాజిట్ కోసం వెళ్లిన నందును జీకే ఘోరంగా అవమానించగా, వంటింట్లో అంకితను పనిమనిషి రాములమ్మ మడతబెడుతుంది.. నవంబర్ 2న ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చూసేయ్యండి.. నందును తులసి కాళ్లు పట్టుకోవాలన్న జీకే.. తాను ఆఫీసుకు రానని తులసితో చెప్పిన నందు.. రూ. […].

By: jyothi

Published Date - Tue - 2 November 21

intinti Gruhalakshmi nov 02 episode : జీకే చేతిలో నందుకు ఘోర అవమానం.. అంకితను మడతబెట్టిన రాములమ్మ.. !

intinti Gruhalakshmi nov 02 episode : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో డిపాజిట్ కోసం వెళ్లిన నందును జీకే ఘోరంగా అవమానించగా, వంటింట్లో అంకితను పనిమనిషి రాములమ్మ మడతబెడుతుంది.. నవంబర్ 2న ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చూసేయ్యండి..

నందును తులసి కాళ్లు పట్టుకోవాలన్న జీకే..

తాను ఆఫీసుకు రానని తులసితో చెప్పిన నందు.. రూ. 2 కోట్ల డిపాజిట్‌ డబ్బుల కోసం జీకేను కలిసి సాయం కోరగా.. అతను ఘోరంగా అవమానిస్తాడు.. నువ్వో పెద్ద చీటర్.. నిన్ను నేను ఎలా నమ్ముతానని అనుకున్నావ్.. నన్ను, నా బిడ్డను చీట్ చేశావు.. నీ కొడుకు ప్రేమను చెడగొట్టాలని అనుకున్నావు.. నీ తప్పులకు వెళ్లి నీ భార్య తులసి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుకో..? అని క్లాస్ పీకుతాడు.

మరోవైపు నందు అన్న మాటలను గుర్తుచేసుకుంటూ తులిసి కుమిలిపోతుంటుంది. ఇంతలో లాస్య వచ్చి నీ బతుకంతా ఇక చీకటి మయమే. నందు 2 కోట్ల అప్పును తీర్చేందుకు వెళ్ళాడు. తనస్థాయిని పెంచుకున్నాక ఈ ఇంటి నుంచి బయటకు గెంటేయబోతున్నాడు. ఇక ఎప్పటికీ నందు నీతో ఆఫీసుకు రాడని లాస్య అనడంతో.. నిజమే లాస్యా.. నందు ఈ ఇంట్లో నుంచి గెంటేస్తాడు కావచ్చు. కానీ, అది నన్ను కాదు నిన్ను అనడంతో లాస్యకు షాక్ తగులుతుంది. 25 ఏళ్లు ఉన్నా నందు ఎలాంటి వాడో నాకు తెలీదా.. అని తులసి పంచ్ ఇస్తుంది.

intinti Gruhalakshmi nov 02 episode-1

intinti Gruhalakshmi nov 02 episode-1

సీన్ కట్ చేస్తే.. వంటింట్లో శ్రుతిని టార్గెట్ చేసి అంకిత నానా మాటలు అంటుంది. అంకిత మాటలు విన్న పనిమనిషి రాములమ్మ వెంటనే కలుగుజేసుకుని అంకిత దుమ్ముదులిపేస్తుంది. ఎందుకమ్మా అలా శ్రుతమ్మపై నోరు పారేసుకుంటావ్.. నువ్వు అన్ని మాటలు అన్నా శ్రుతి నిన్ను ఒక్కమాట కూడా అనలేదు. అదీ సంస్కారం అంటే.. ఈ ఇంటి పరువును తీసింది నువ్వు.. మొగుడిని కొంగున చుట్టుకుని.. వారసుడు రాకుండా అబార్షన్ చేయించుకున్నావ్.. శ్రుతి అమ్మగారిని ఎందుకు మాటలు అంటున్నావ్ అని రాములమ్మ ఫైర్ అవుతుంది. దీంతో పని మనిషి పని మనిషిలాగే ఉండు.. ఎక్కువ చేస్తే బయటకు పంపిస్తానని అంకిత్ వార్నింగ్ ఇస్తుంది.

జీకే చేతిలో ఘోర అవమానం జరిగడంతో నందు బాధపడుతూ ఇంటికి వస్తాడు. అదే సమయానికి దివ్య.. తన ఎగ్జామ్ అప్లికేషన్‌పై తండ్రితో సైన్ పెట్టించుకోవడానికి ఎదురు చూస్తుంటుంది. నందు ఇంటికి రావడంతో ‘డాడీ అంటూ వెళ్తుతుంది. మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా కుదరలేదని దివ్య అనగానే.. నాకు చిరాకుగా ఉంది నేను ఇపుడు నీతో మాట్లాడలేనని దివ్యపై కోపం తెచ్చుకుంటాడు నందు.. ఇంతలో పరందామయ్య వచ్చి.. ‘భార్యకు విడాకులు ఇచ్చి దూరం చేసుకున్నావ్.. ఇపుడు పిల్లలను కూడా దూరం చేసుకుంటావా తన కూతురుకు సారీ చెప్పి అప్లికేషన్‌పై సంతకం పెట్టి పంపిస్తాడు నందు..

లాస్య గదిలోకి వెళ్లిన నందును వెళ్లిన పని ఏమైందని అడుగగా అక్కడ జరిగింది చెప్పడంతో లాస్యకు కరెంట్ షాక్ కొట్టినంత పనవుతుంది. ఇక నందుకు సాయం చేసేందుకు తులసి సిద్ధమవుతుంది. తన బంగారాన్ని తాకట్టు పెట్టాలని భావించగా.. మిగతాది తర్వాతి ఏపిసోడ్‌లో చూద్దాం..

Tags

Latest News

Related News