• Telugu News
  • movies

Guppedanta Manasu December 2 Episode: వన భోజనాలకు జగతిని ఆహ్వానించిన మినిస్టర్ .. అక్కడ ఏం జరగబోతుంది

Guppedanta Manasu December 2 Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది. ఈ సీరియల్ నేటితో 307వ ఎపిసోడ్ కు చేరుకుంది. రిషి రాగానే మహేంద్ర దేవయాని దగ్గర ఇరికించిన ఘటన జరుగుతుంది. వసుంధర కేవం నా స్టూడెంట్ మాత్రమే అని రిషి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ రోజు ఏం జరుగుతుందంటే.. గత ఎపిసోడ్‌లో వసు, రిషి కాలేజ్‌లో కలుసుకున్నారని దేవయాని వాచ్‌మెన్ ద్వారా తెలుసుకుని.. […].

By: jyothi

Updated On - Thu - 2 December 21

Guppedanta Manasu December 2 Episode: వన భోజనాలకు జగతిని ఆహ్వానించిన మినిస్టర్ .. అక్కడ ఏం జరగబోతుంది

Guppedanta Manasu December 2 Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది. ఈ సీరియల్ నేటితో 307వ ఎపిసోడ్ కు చేరుకుంది. రిషి రాగానే మహేంద్ర దేవయాని దగ్గర ఇరికించిన ఘటన జరుగుతుంది. వసుంధర కేవం నా స్టూడెంట్ మాత్రమే అని రిషి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ రోజు ఏం జరుగుతుందంటే..

గత ఎపిసోడ్‌లో వసు, రిషి కాలేజ్‌లో కలుసుకున్నారని దేవయాని వాచ్‌మెన్ ద్వారా తెలుసుకుని.. ‘రిషి చెయ్యి దాటిపోతాడు’ అంటూ మహేంద్రపై అరిచిన సంగతి తెలిసిందే. అందుకే మహేంద్ర రిషి రాగానే.. దేవయానిని ఇరికించడం నిన్నటి కథలో చూశాం. అదే సమయంలో రిషి.. ‘వసుధర నాకు కేవలం ఓ స్టూడెంట్ మాత్రమే’ అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు నేటి హైలైట్స్ చూద్దాం.

వసు కేవలం తన స్టూడెంటే అని దేవయాని, మహేంద్రలకు క్లారిటీ ఇచ్చిన తర్వాత రిషి తన గదిలోనికి వచ్చి దీర్ఘాలోచనలో పడిపోతాడు. వసు కేవలం తన స్టూడెంట్ అయినపుడు తాను ఎందుకు వసు మీద ఆదిపత్యం చెలాయిస్తున్నానని ఆలోచిస్తాడు. వసు కాలేజిలో జాయిన్ అయిన దగ్గరి నుంచి అహంకారం చూపిస్తూనే ఉన్నానని అనుకుంటాడు. ఇలా అనుకుంటుండూ ఉండగా.. జగతి చెప్పిన మాటలు రిషికి గుర్తుకు వస్తాయి. నీవు వసుని ప్రేమిస్తున్నావ్ అన్న జగతి మాటలు రిషికి గుర్తుకువచ్చి తనలో తానే మధనపడతాడు.

Guppedanta Manasu December 2 Episode

Guppedanta Manasu December 2 Episode

తాను ఎవరూ చెబితే ఒప్పుకునే రకం కాదని కానీ ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తాడు. తన మనసులో ఉన్న విషయాన్ని వేరే వారు చెబితే తెలుసుకోవడమేంటని అనుకుంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చి డోర్ కొట్టడంతో రిషి ఎస్ అని అంటాడు. దాంతో మహేంద్ర గది లోపలికి రాకుండా గుమ్మం దగ్గరే నిల్చొని ఏమయింది రిషి అదోలా చిరాకుగా ఉన్నావ్? అని ప్రశ్నిస్తాడు. దాంతో రిషి డాడ్.. నేను కాలేజికి వెళ్లి వర్క్ చేసి వచ్చాను రెస్ట్ లేకుంటే ఇలాగే ఉంటుంది అని అంటాడు. దీంతో మహేంద్ర ఓకే నాన్న నీవు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ఇపోతాడు. మహేంద్ర వెళ్లిన తర్వాత రిషి తన డాడ్ నా మనసులో ఉన్న విషయం గురించి ఎలా కనిపెట్టాడని ఆలోచిస్తాడు.

వనభోజనాలకు మినిస్టర్ గారు మనందర్నీ ఇన్వైట్ చేశారని మహేంద్ర, మరియు ఫణేంద్రలు చెబుతారు. కానీ దేవయాని నేను రాను అంటూ బిల్డప్ ఇస్తుంది. దానికి రిషి పెద్దమ్మా మీరు వస్తేనే నేను వెళతాను అని అంటాడు. తర్వాత సీన్ లో మినిస్టర్ జగతికి కూడా కాల్ చేసి వనభోజనాలకు ఆహ్వానిస్తాడు. కానీ జగతి అక్కడికి వెళ్లకూడదని అనుకుంటుంది. అక్కడ దేవయాని కుట్రల వలన తాను అక్కడికి రాలేను. అనవసరంగా రిషి బాధపడతాడు. అని మహేంద్రతో చెబుతుంది. దీంతో మహేంద్ర మరియు వసులు జగతిని వన భోజనాలకు వచ్చేలా ఒప్పిస్తారు.

Tags

Latest News

Related News