guppedanta manasu december7 episode: జగతి, రిషి, మహేంద్ర పక్కపక్కనే… సీన్ చూస్తేనే కడుపునిండుతుందిగా..

guppedanta manasu december7 episode:తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మరో సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ నేటితో 311 వ ఎపిసోడ్ కి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మహేంద్ర, జగతి, దేవయాని, ఫణీంద్ర అందరూ మినిస్టర్ గెస్ట్ హౌజ్ కు వెళ్లి అక్కడ వనభోజనాల పేరిట ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారికి అరటి ఆకులు అయిపోవడంతో వసు అరటి ఆకులు తీసుకుని వెళ్లబోతుంటే… నేను కూడా వస్తానని రిషి చెబుతాడు. […].

By: jyothi

Published Date - Tue - 7 December 21

guppedanta manasu december7 episode: జగతి, రిషి, మహేంద్ర పక్కపక్కనే… సీన్ చూస్తేనే కడుపునిండుతుందిగా..

guppedanta manasu december7 episode:తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మరో సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ నేటితో 311 వ ఎపిసోడ్ కి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మహేంద్ర, జగతి, దేవయాని, ఫణీంద్ర అందరూ మినిస్టర్ గెస్ట్ హౌజ్ కు వెళ్లి అక్కడ వనభోజనాల పేరిట ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారికి అరటి ఆకులు అయిపోవడంతో వసు అరటి ఆకులు తీసుకుని వెళ్లబోతుంటే… నేను కూడా వస్తానని రిషి చెబుతాడు. దీంతో వసు చేసేదేం లేక రమ్మని అంటుంది. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..


అలా అరటి ఆకులను పట్టుకుని రిషి, మరియు వసులు ఆటో దిగడం చూసిన జగతి చాలా సంబురపడిపోతుంది. అరటి ఆకులు పట్టుకున్న రిషితో వసు సార్ ఆ ఆకులను ఇలా ఇవ్వండి నేను పట్టుకుంటాను అని చెబుతుంది. అలా వసు రిషిలు కలిసి నడుచుకుంటూ రావడం మహేంద్ర చూసి చాలా సంతోషపడతాడు. కానీ దేవయాని మాత్రం ఆ సీన్ చూసి రగిలిపోతుంది. ఎలాగైనా సరే రిషిని వసు మరియు జగతిల నుంచి కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అవుతుంది. ఇంతలో మినిస్టర్, దేవయాని, ఫణీంద్ర భోజనానికి కూర్చుంటారు. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు. ఇలా అక్కడకు వచ్చిన రిషితో మినిస్టర్ అక్కడ కూర్చో అని చెబుతాడు. ఇంతలోనే అక్కడికి జగతి కూడా వస్తుంది. జగతిని చూసిన మినిస్టర్ జగతి మేడమ్ రండి కూర్చోండి అని రిషి పక్కన ఉన్న సీట్ ను చూపిస్తాడు. మినిస్టర్ అలా చూపించడంతో జగతి ఇబ్బంది పడుతూనే రిషి పక్కన వెళ్లి కూర్చుంటుంది. అక్కడకు వచ్చిన మహేంద్రను జగతి పక్క సీట్ లో కూర్చోమని మినిస్టర్ చెబుతాడు. అక్కడ అప్పటికే రిషి, జగతి పక్కపక్కన కూర్చోవడం చూసిన మహేంద్ర మురిసి పోయి వెంటనే జగతి పక్కన కూర్చుంటాడు. తనలో తాను ఆనందపడుతూ ఉంటాడు.


Guppedantha Manasu Dec 7 episode

Guppedantha Manasu Dec 7 episode



కానీ ఈ సీన్ ను చూసిన దేవయాని మాత్రం తెగ కుళ్లుకుంటుంది. ఈ జగతికి అన్నీ ఇలా ఎందుకు కలిసి వస్తాయో అని అనుకుంటుంది. ఇలా జగతి, రిషి, మహేంద్ర పక్కపక్కన కూర్చోవడం చూసిన వసు చూసి సంబరపడిపోతూ వడ్డిస్తూ ఉంటుంది. ఫొటో తీయమని అక్కడే ఉనన పుష్పకి ఫోన్ ఇస్తుంది.


ఇక ఆ సీన్ చూసిన వసు అయితే.. సంబరంగా వడ్డిస్తూ పొంగిపోతుంది. ధరణి కూడా చాలా సంతోషిస్తుంది. తర్వాత ఫొటో తియ్యి అంటూ పుష్పకి ఫోన్ ఇచ్చి పంపిస్తుంది. కానీ పుష్ప ఆఫొటోలను తీస్తుంటే రిషి చాలా కోపంగా చూస్తాడు. దీంతో పుష్ప భయపడిపోయి ఫోన్ ను తిరిగి వసుకు ఇస్తుంది. ఇక వసునే ఏకంగా ఫొటోలు తీస్తూ ఉంటుంది. అయినా కానీ రిషి వసుని కోపంగా చూస్తాడు. కానీ వసు మాత్రం అవేమీ చూడకుండా వారి ఫొటోలను తీస్తూ ఉంటుంది.

Tags

Related News