Guppedanta Manasu November 29 Episode : స్టార్ మాలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీరియల్ నేటితో 304 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందనేది ఒక్క సారి తెలుసుకుందాం.
రిషి అలాగే కాలేజ్ గెస్ట్ హౌజ్ లోనే నిద్రపోతానని చెప్పి వసు గురించే ఆలోచిస్తుంటాడు. అతడు బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడు. అలా రిషి బాస్కెట్ బాల్ ఆడుతున్న సమయంలో వసు ఉన్న ఆటో కాలేజీ గేటు ముందు ఆగుతుంది. ఆటో డ్రైవర్ వసుతో మేడమ్ మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అని అంటాడు. అలా అనగానే కాలేజ్ చూసి షాక్ అయిన వసుంధర నేను ఈ అడ్రస్ చెప్పానా అని ఆటో డ్రైవర్ తో అంటుంది. దానికి ఆ డ్రైవర్ అవును మేడమ్ మీరు చెప్పిన అడ్రస్ ఇదే అని అంటాడు.
దాంతో చేసేదేం లేక వసు కిందకు దిగుతుంది. ఆటోలో నుంచి కిందకు దిగిన వసుంధన షాక్ అవుతుంది. అప్పుడే వసుంధర దగ్గరకు వచ్చిన వాచ్ మెన్ ఏంటి మేడం మీరా. రిషి సర్ రమ్మని పిలిచాడా అని అడుగుతాడు. దానికి వసు ఆ వాచ్ మెన్ తో ఏంటి రిషి సర్ ఇక్కడున్నారా? అని అంటుంది. వెంటనే ఆటో వాడికి డబ్బులిచ్చిన వసుంధర లోపలికి వెళ్తుంది.
Guppedanta Manasu November 29 Episode-1
వసుని చూసిన రిషి ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు. ఏంటి నువ్ ఇలా వచ్చావ్ అని వసుని అడుగుతాడు. దానికి వసుంధర సారీ అది అనుకోకుండా వచ్చేశాను అని సమాధానం చెబుతుంది. మెషన్ ఎడ్యుకేషన్ లీడర్ గా ఎందుకు చేశారు అని అడుగుతుంది. బాస్కెట్ బాల్ ఆడడం వచ్చా అని రిషి వసుని అడుగుతాడు. పూర్తిగా రాదు అని వసు సమాధానం చెబుతుంది. రా నేర్పిస్తా అని రిషి అనడంతో వసు బాస్కెట్ బాల్ ఆడడం కోసం తన హ్యాండ్ బ్యాగ్ ను పక్కన పెట్టి వస్తుంది.
నడుమును చున్నీని కట్టుకున్న వసు రంగంలోకి దిగుతుంది. కానీ రిషి వసుని టచ్ చేయడంతో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ నడుస్తుంది. దీంతో వసుంధర కాస్త ఎక్కువ ఫీల్ అయి రిషికి గోల్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ సీన్ చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ రిషికి ఆ సమయంలో ఫోన్ రావడంతో వసునే గోల్ వేస్తుంది. అది చూసిన రిషి ఇందాక కావాలనే ఓడిపోయావా అని వసుని అడుగుతాడు. దానికి సమాధానంగా రిషితో మనం ఆడింది గెలుపుకోసం కాదు కద సర్ అని అంటుంది.