Guppedantha Manasu dec 3 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 3)న 308 ఎపిసోడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ భాగంలోని హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. గుప్పెడెంత మనసు సీరియల్ లాస్ట్ ఎపిసోడ్‌లో జగతి, వసుధర, దేవయాని ఫ్యామిలీని మంత్రి గారు వనభోజనాలకు పిలువడంతో అందరూ వెళ్లాలని నిర్ణయించకుంటారు.
తెల్లవారి అంతా వెళ్తామనే టైంకు రిషి వచ్చి వసుధరకు బయటకు తీసుకెళ్తాడు. అయితే, దారిలో ఓ బాబు ఏడుస్తుండగా.. కారు ఆపమన్న వసు.. బాబు దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతుంది. కిరణ్ గాడు నా గోలీలు అన్ని తీసుకున్నాడని చెప్పడంతో వసు ఆ పిల్లాడితో గేమ్ ఆడి అతన్ని మార్చేస్తుంది..
రిషికి వసుధర గోలీల బహుమతి..
దీంతో కిరణ్ తన వద్దనున్న గోలలను వసుధరతో పాటు పిల్లలందరికీ పంచిపెడతాడు. ఇక వసుధర, రిషిలు పిల్లలకు బాయ్ చెప్పి కారులో బయలు దేరుతారు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న వసు రిషికి గోలీలు గిప్ట్‌గా ఇస్తుంది. దీంతో రిషి చాలా సంతోషిస్తాడు. ఇక వనభోజనాలకు దేవయాని కుటుంబం వచ్చే సరికి జగతి అక్కడ ఉంటుంది. ఇక జగతిని చూడగానే దేవయాని కోపంతో రగిలిపోతుంటుంది. మంత్రి గారి భార్య వారిని ఒకరికొకరికి పరిచయం చేసి వెళ్లడంతో మహేంద్ర, ఫణేంద్రలు కూడా మంత్రిని కలసేందుకు వెళ్తారు.
Guppedantha Manasu dec 3 episode
దేవయానికి పంచ్ ఇచ్చిన జగతి..
ఇక అక్కడే ఉన్న జగతి, దేవయాని ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం ఆరంభిస్తారు. ‘ఏంటి ముందే వచ్చావ్ అంటూ దేవయాని వెటకారం స్టార్ట్ చేస్తుంది. నా ఆలోచనే ఎప్పుడూ కరెక్ట్ కాదు అక్కయ్యా..! అడవిలో జింకలు, కుందేళ్లతో పాటు గుంట నక్కలు, తోడేళ్లు కూడా ఉంటాయని దేవయాని అనడంతో.. జగతి ‘ఎప్పటికైనా జింకలు, కుందేళ్లు పులికి బలికావాల్సిందే’ అంటూ పంచ్ ఇస్తుంది.
మహేంద్ర జగతికి సిగ్నల్ ఇవ్వడం జగతి నవ్వుకోవడం చూసిన దేవయాని ఛీఛీ.. వీళ్లు ఇక మారరు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కమింగ్ అప్‌లో తోటలో ధరణి, రిషి, వసుధు మాట్లాడుకుంటుంటారు. ‘మా చిన్నతనంలో తోటల్లో ఉయ్యాలా కట్టేవారని ధరణి అనడంతో వసుధర నాకు కట్టడం వచ్చంటూ చెట్టు ఎక్కుతూ జారి రిషి మీద పడిపోతుంది. వసు రిషి గుండెలపై పడే దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటుంది.. తర్వాత ఏమైందంటే ‘గుప్పెడంత మనసు’ కొనసాగుతోంది.