• Telugu News
  • movies

Guppedantha Manasu Dec 4 episode : దేవయాని కంట్లో పడ్డ రిషి, వసుధర.. ఏదో ప్రమాదం ముంచుకురాబోతుందంటూ..!

Guppedantha Manasu Dec 4 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. డిసెంబర్ 4వ తేదీన ఈ సీరియల్ 309వ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వసుధర, రిషిలు కలిసి కారులో వన భోజనాలకు బయలు దేరుతుండగా పిల్లలు గోలీల కోసం కొట్టుకోవడం, వసు వెళ్లి వారి సర్దిచెప్పి కిరణ్ అనే పిల్లాడిని మార్చి పిల్లలందరినీ సంతోషంగా మారుస్తుంది. ఇక […].

By: jyothi

Updated On - Sat - 4 December 21

Guppedantha Manasu Dec 4 episode : దేవయాని కంట్లో పడ్డ రిషి, వసుధర.. ఏదో ప్రమాదం ముంచుకురాబోతుందంటూ..!

Guppedantha Manasu Dec 4 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. డిసెంబర్ 4వ తేదీన ఈ సీరియల్ 309వ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వసుధర, రిషిలు కలిసి కారులో వన భోజనాలకు బయలు దేరుతుండగా పిల్లలు గోలీల కోసం కొట్టుకోవడం, వసు వెళ్లి వారి సర్దిచెప్పి కిరణ్ అనే పిల్లాడిని మార్చి పిల్లలందరినీ సంతోషంగా మారుస్తుంది. ఇక రిషికి కూడా డబ్బాలో గోలీలు వేసి గుర్తుగా ఇచ్చిన విషయం తెలిసిందే.


తాజా ఎపిసోడ్‌లో వసు, రిషిలు మంత్రి గారి తోటలో వనభోజనాలకు నడుచుకుంటూ బయలుదేరతారు. అప్పుడు వసు.. ‘సార్ మీ బూట్లు తీసి చేతిలో పట్టుకుని ప్యాంటు పైకి అని నడవండి ఇది కూడా మంచి అనుభూతి అనడంతో అలాగే చేస్తాడు రిషి..వసు కూడా చెప్పులను చేతితో పట్టుకుని నడుస్తుంది. అదే టైంలో బ్యాగ్ రౌండ్ ఓ మంచి ఫీల్ గుడ్ సాంగ్ ప్లే అవుతుంది.


మహేంద్రను భయపెట్టిన దేవయాని..

వసు, రిషి దగ్గరకు చేరుకోగానే మంత్రి గారి బావమరిది సార్ ఇక్కడ మీ పెదనాన్నగారు ఇక్కడ ఉన్నారని పిలుస్తారు. ఇక వసు జగతి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుతుండగా.. జగతి కోసం మహేంద్ర వచ్చి ఆమె పక్కన కూర్చిలో కూర్చుంటాడు. అదే టైంలో దేవయాని వచ్చి మహేంద్రను గుర్రుగా చూస్తుండటంతో మహేంద్ర చైర్ వెంటనే వసు వైపుకు తిప్పుకుని ఆమె ఎడ్యూకేషన్ గురించి ఏదో ఏదో అడుగుతుంటాడు. ఏం మాట్లాడుతున్నారని వసు అడుగడంతో నా వెనుకే మా వదిన ఉంది.. నన్ను కోపంగా చూస్తుంది కొంచెం కవర్ చేయాలని వసును వేడుకుంటాడు మహేంద్ర.. ఎంతకూ దేవయాని వెళ్లకపోవడంతో మహేంద్ర లేచి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu Dec 4 episode

Guppedantha Manasu Dec 4 episode

రిషి, వసులను ఓ కంట కనిపెడుతున్న దేవయాని..

రిషి దేవయానిలు మాట్లాడుకుంటుండగా అప్పుడే పుష్ప వస్తుంది. ఏంటీ పుష్ప నువ్విక్కడా? అంటూ రిషి అడుగడంతో నేనే రమ్మన్నాను.. నాకు తోడుగా ఉంటుందని అంటుంది వసుధర.. అదే టైంలో మంత్రిగారి బావమరిది వచ్చి ‘సార్ తోట చూద్దురు గానీ రండి అంటూ తీసుకెళ్తాడు.. అయితే, వసు, రిషి ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్లి విను అని దేవయాని ధరణిని పంపిస్తుంది.


వసు, రిషి, పుష్ప అంతా కలిసి తోటకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అదే టైంలో పుష్ప చిన్నప్పుడు ఉయ్యాల మాట్లాడటం. నేను కడతానని వసు చెట్టు ఎక్కి రిషి మీద పడటం ఇదంతా మనకు తెలిసిందే.. వీరిద్దరిని పుష్ప, ధరణి లేపుతారు. కమింగ్ అప్‌లో వసు, రిషిలు ఆటోలో కలిసి వెళ్లడం, మళ్లీ వన భోజనాలకు అరటి ఆకులు తీసుకొని వస్తుండగా దేవయాని కంట్లో పడుతారు వీరిద్దరు. దీంతో ఆమె కోపంతో రగిలిపోతుంటుంది. రుషి, వసుధరలు కలిసి ఏదో ముప్పు తెచ్చేలా ఉన్నారని భావిస్తుంది దేవయాని.. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాంటే గుప్పెడంత మనసు కొనసాగుతోంది.

Tags

Latest News

Related News