Guppedantha Manasu December 8 Episode : రిషి, వసు కలిసి ఉన్నారని తెలిసి కోపంతో రగిలిపోయిన దేవయాని!

Guppedantha Manasu December 8 Episode : గుప్పెడంత మనసు సీరియల్ లో డిసెంబర్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి, వసు కుటుంబాలు వాన భోజనాల సందర్భంగా భోజనాలు చేయగా చూసాం.. ఇక ఈ ఎపిసోడ్ లో భోజనాలు చేయగా ఇంకా అన్నం మిగలడంతో వాటిని అనాధ ఆశ్రమానికి పంపించి వస్తాను అను వసు జగతితో వెళ్లకుండా ఆగిపోతే రిషి మాత్రం వసు తనతో చెప్పకుండా వెళ్ళిపోయింది అని […].

By: jyothi

Published Date - Wed - 8 December 21

Guppedantha Manasu December 8 Episode : రిషి, వసు కలిసి ఉన్నారని తెలిసి కోపంతో రగిలిపోయిన దేవయాని!

Guppedantha Manasu December 8 Episode : గుప్పెడంత మనసు సీరియల్ లో డిసెంబర్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి, వసు కుటుంబాలు వాన భోజనాల సందర్భంగా భోజనాలు చేయగా చూసాం.. ఇక ఈ ఎపిసోడ్ లో భోజనాలు చేయగా ఇంకా అన్నం మిగలడంతో వాటిని అనాధ ఆశ్రమానికి పంపించి వస్తాను అను వసు జగతితో వెళ్లకుండా ఆగిపోతే రిషి మాత్రం వసు తనతో చెప్పకుండా వెళ్ళిపోయింది అని మనసులో తిట్టుకుంటాడు.


ఆ తర్వాత వసు చీకటి పడడంతో కారు వస్తుంది అని మినిష్టర్ బావమరిది చెప్పడంతో ఉయ్యాల ఊగుతూ రిషి జ్ఞాపకాల్లో మునిగిపోతుంది. అయితే వసు ఉయ్యాల ఊగుతున్న సమయంలో రిషి వెనకనుండి రావడంతో భయపడుతుంది. మీరా నేను ఎవరో అనుకుని భయపడ్డాను అని వసు రిషితో చెబుతుంది. నువ్వు వెళ్లలేదని తెలుసుకుని వచ్చా అని రిషి చెబుతాడు. ఆ తర్వాత వసు రిషిని బలవంతంగా ఉయ్యాల ఎక్కించి ఊపుతుంది. వసు ఎలా ఊపుతూ ఎదో విషయం చెప్పబోతుండగా దేవయాని రిషికి కాల్ చేతిసుంది.


ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నా పెద్దమ్మ అంటాడు అప్పుడు రిషి ఫోన్ కిందపడింది. అయ్యోసార్ అంటూ కింద పడిన ఫోన్ ను వసు తీసి తుడిచి ఇస్తుంది. దేవయానికి ఆ మాటలు వినిపిస్తాయి. రిషి వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వసు ఇంకా రిషి తోనే ఉందా.. వీళ్ళ వ్యవహారం ఎటు పోతుంది అంటూ దేవయాని కోపంతో రగిలిపోతుంది.


Guppedantha Manasu Dec 8 episode

Guppedantha Manasu Dec 8 episode



అంతలో కరురావడంతో మినిస్టర్ బావమరిది కారులో ఒకరికి మాత్రమే చోటు ఉంది అని చెప్పగా రిషి కారులో వసు బయలు దేరుతుంది. పుష్ప మినిస్టర్ కారులో వెళ్తుంది. ఇక అప్పుడు రిషి, వసు మనసు విప్పి మాట్లాడుకుంటారు. వాన భోజనాలు చాలా నచ్చాయి అని రిషి చెప్పడంతో.. అవును సార్ బాల్యం బాగుటుంది.. నేను ప్రతి ఏడాది మా అమ్మా నాన్నలతో కలిసి వనభోజనాలకు వెళ్లేదాన్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం..అంటూ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. లక్ష్యం కోసం వారిని దూరం చేసుకున్నాను కానీ వారు నాకు ప్రతి క్షణం గుర్తు వస్తూనే ఉంటారు అని చెప్పి వసు బాధపడుతుంది.


దాంతో రిషి తన మనసులోని మాటలను తర్వాత చెబుతాను అంటూ వాయిదా వేస్తాడు. ఇక రిషి, వసు కారులో వెళ్తూ ఉండగా కారు ఆగిపోతుంది. రిషి సర్వీస్ సెంటర్ కు కాల్ చేయగా మెకానిక్ ని పంపిస్తాం అని చెప్పగా వాళ్ళు రోడ్డు మీదనే వైట్ చేస్తూ ఉంటారు. ఇక దేవయాని మాత్రం నిద్రపోకుండా రిషి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక తర్వాత ఎం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.

Tags

Latest News

Related News