Guppedantha Manasu Nov 30 Today Episode :స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ చాలా క్లాసిక్ గా కొనసాగుతోంది. మరి ఈ రోజు (నవంబర్ 30, 2021)న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
మార్నింగ్ నిద్రలేచిన రిషి… జగతి ఇంటికి వెళ్తాడు. అక్కడ వసు పట్టి ఇచ్చేసి కాలేజ్‌కు వెళ్లిపోతాడు. ఇక కాలేజీలో వసు జ్ఞాపకాలతో ఆమె క్లాస్ రూం వరకూ వెళతాడు. అదే టైంలో వాచ్‌మెన్ టీ తీసుకుని వెళ్తాడు. కానీ అతడు రిషికి వసులాగా కనిపిస్తాడు. నువ్వు టీ తీసుకొచ్చావేంటంటూ అడుగుతాడు. దీనికి వాచ్ మెన్ షాక్ అయ్యి ప్రతి రోజు నేనే తెస్తాను కదా సార్ అని బదులిస్తాడు. తర్వాత వసు కాదని వచ్చింది వాచ్ మెన్ అని తెలుసుకుంటాడు రిషి. తర్వాత నిజంగానే కాలేజికి వస్తుంది వసు. రిషి సార్ ఎక్కడున్నారు అంటూ వాచ్ మెన్ ను అడుగుతుంది. క్లాస్ రూంలో ఉన్నారంటూ అతడు చెప్పడంతో ఆ వైపు నడుచుకుంటూ వెళ్తుంది వసు. ఆమె పట్టీల శబ్ధం రిషికి వినిపిస్తుంది. అంతలోనే గుడ్ మార్నింగ్ సార్ అంటూ చెబుతుంది వసు. అటు వైపు చూడకుంటా మళ్లీ వాచ్ మెన్ వచ్చాడనుకుని ఏంటీ మళ్లీ వచ్చావంటూ ప్రశ్నిస్తాడు. నేను మళ్లీ రావడం ఏంటి సార్.. ఇప్పుడే వచ్చాను అని వసు చెప్పడంతో ఆమె నిజంగానే వచ్చిందా అంటూ అనుకుంటాడు. ఇలా వచ్చావేంటి.. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని అడుగుతాడు. అలా మాటలు కలిపి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రిషికి దేవయాని కాల్ చేస్తుంది. అతడు కట్ చేస్తాడు. తర్వాత వాచ్ మెన్ కు కాల్ చేస్తుంది. దీంతో వసుధర మేడమ్, రిషి సార్ ఇక్కడే ఉన్నారని అతడు చెప్పడంతో దేవయానికి పట్టలేనంత కోపం వస్తుంది.
Guppedanta Manasu November 30 Episode-1
అలాగే కోపగించుకుంటూ మహేంద్ర వద్దకు వెళ్తుంది దేవయాని. రిషిని ఎందుకు పట్టించుకోవడం లేదు. వారిద్దరు కలిసే ఉంటున్నారట. సెలవుల్లోనూ వీరెందుకు కాలేజీకి వెళ్తున్నారు. రిషి చేయి దాటిపోయే ప్రమాదముంది అంటూ మహేంద్రకు చెబుతుంది దేవయాని. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాడు మహేంద్ర. రిషికి మీరే చెప్పొచ్చుగా వదిన అంటాడు. చెబతా.. నా పద్దతిలోనే చెబుతా అంటూ హెచ్చరిస్తుంది దేవయాని. తర్వాత రిషి, వసు కారులో బయలుదేరగా కారు పంచర్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం.