Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌ను అరేయ్ అంటూ ఫైర్ అయిన హరితేజ.. స‌పోర్టు చేసిన వేణు..!

Anchor Pradeep: పండుగలు వస్తే చాలు బుల్లితెరపై కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తుంటాయి. దీనికి బాగా తెలిసిన మొహలే యాంకరింగ్ చేస్తుంటాయి..

By: jyothi

Published Date - Sat - 24 September 22

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌ను అరేయ్ అంటూ ఫైర్ అయిన హరితేజ.. స‌పోర్టు చేసిన వేణు..!

Anchor Pradeep: పండుగలు వస్తే చాలు బుల్లితెరపై కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తుంటాయి. దీనికి బాగా తెలిసిన మొహలే యాంకరింగ్ చేస్తుంటాయి. ప్రస్తుతం దసరా పండుగ రానున్న నేపథ్యంలో కొన్ని ఛానెళ్లు కొత్తగా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నాయి. ఒక్కో టెలివిజన్ వారు ఒక్కో గేమ్ షో ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అనే షో ప్రారంభమైంది. ఇది ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.

కమెడియన్లతో పంచులు వేయించుకున్న ప్రదీప్..

కొత్తగా ప్రారంభమైన షో చూసేందుకు సుమ క్యాష్ ప్రోగ్రామ్ లాగా ఉందని కొందరు అంటున్నారు. ఇందులో కూడా గేమ్స్ ఆడి డబ్బులు గెలుచుకోవాలి. తాజా ఎపిసోడ్ ఈ షోకు రెండోది. ఇందులో యాంకర్‌గా ప్రదీప్ ఎప్పుడూ టాప్‌లో ఉండగా.. కంటెస్టెంట్లుగా సింగర్ గీతామాధురి, నటి హరితేజ, కమెడియన్స్ వేణు, ధనరాజ్.. నటులు అమిత్, భానుశ్రీ పాల్గొన్నారు. ఈ షోలో ఆటపాటలతో పాటు టాస్కులు కూడా ఉన్నాయి.

ఇక ప్రూట్ జ్యూస్ పిండాలని ప్రదీప్ టాస్క్ ఇవ్వగా ఇందులో హరితేజ ముందుకు వచ్చింది. టాస్క్‌లో భాగంగా సింగర్ గీతామాధురి జ్యూస్ పిండటానికి ఇవన్నీ గ్లాసులు ఎందుకు రెండు సరిపోతాయ్ కదా? అని అడుగగా..రెండోది పగిలితే మూడోది యూస్ అవుతుంది కదా అని ప్రదీప్ అంటాడు. వెంటనే దీనికి హరితేజ కౌంటర్ వేసింది. శుభం పలకరా పెళ్లికొడకా అంటే.. అశుభం పలుకుతావా అంటూ సెటైర్ వేస్తుంది.

ఇక దగ్గరలో పెళ్లికూతురు లేదులే అని ప్రదీప్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాడు. ఇక హరితేజ దగ్గర ఎక్కువ డబ్బులు లేవని వేణు అనడంతో గెలుస్తామని అంటున్నారు కదా అంటూ ప్రదీప్ కౌంటర్ ఇస్తాడు. దీనికి వెంటనే వేణు.. గెలవకపోతే మీరు ఇస్తారా? అంటూ ప్రదీప్ పై మరో కౌంటర్ వేస్తాడు. దీనిని బట్టి ఈషో కూడా జబర్దస్త్ వలే పంచులతో సందడిగా ఉండనుందని ఇట్టే అర్థం అవుతోంది. దసరా నాడు ఈ షో ప్రసారం కానుందని తెలుస్తోంది.

Read Also : Pragya Jaiswal : పొట్టి డ్రెస్సులో వాటిని య‌మ రంజుగా చూపిస్తున్న ప్ర‌గ్యాజైస్వాల్‌..!

Read Also : Kriti Sanon : వైట్ అండ్ వైట్‌లో చూపించకూడనివి చూపించిన కృతి సనన్..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News