Sara Ali Khan : ఆమెతో నటిస్తే చాలు హీరోలకు పెళ్లైపోతుంది.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

Sara Ali Khan : సారా అలీఖాన్ తో నటిస్తున్న హీరోలకు వరుసగా పెండ్లి అయిపోతోందని తెలిపింది. అలా పెండ్లి అయిన వారిలో విక్కీ నాలుగో హీరో అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. దానికి విక్కీ కూడా స్పందిస్తూ.. ఎవరైనా హీరోలు పెండ్లి కావాలంటే సారాతో నటించడం అంటూ చెప్పారు..

By: jyothi

Updated On - Wed - 17 May 23

Sara Ali Khan : ఆమెతో నటిస్తే చాలు హీరోలకు పెళ్లైపోతుంది.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

Sara Ali Khan : సినిమాల్లో కొన్ని సెంటిమెంట్లు బలంగా ఉంటాయి. ఒక సినిమాకు హిట్ టాక్ రావడానికి ఏదైనా సెంటిమెంట్ కారణం అని అనుకుటే.. అదే సెంటిమెంట్ ను తర్వాత సినిమాలకు కంటిన్యూ చేస్తుంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ తో ఏ హీరో నటిస్తే అతనికి పెండ్లి అయిపోతోంది.

ఇదే విషయాన్ని ఇప్పటికే నలుగురు హీరోలు చేసి చూపించారు. ఆమెతో నటించిన నలుగురు హీరోలకు ఆ సినిమా సెట్ మీద ఉండగానే పెండ్లి అయిపోతోంది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా సైఫ్‌ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. తాజాగా ఆమె విక్కీ కౌశల్ తో కలిసి ఓ సినిమాలో నటించింది.

ఈ మూవీ ప్రమోషన్ లో ఆమె తాజాగా పాల్గొంది. అయితే ఆమె తనతో నటిస్తున్న హీరోలకు వరుసగా పెండ్లి అయిపోతోందని తెలిపింది. అలా పెండ్లి అయిన వారిలో విక్కీ కౌశల్ నాలుగో హీరో అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. దానికి విక్కీ కూడా స్పందిస్తూ.. ఎవరైనా హీరోలు పెండ్లి కావాలంటే సారాతో నటించడం అంటూ చెప్పారు.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విక్కీకి కత్రినా కైఫ్‌ తో పెండ్లి అయిపోయింది. ఇక ఈ సినిమా త్వరలోనే బాక్సాఫీస్ వద్దకు రాబోతోంది. ప్రస్తుతం సారా అలీఖాన్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఆమె స్పీడు చూస్తుంటే.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Read Also : Jayachitra : ఆ హీరోయిన్ ను చెప్పుతో కొట్టిన జయసుధ.. ఎందుకంటే..?

Read Also : Taapsee Pannu : తెరవెనక నీచమైన పనులు చేస్తారు.. హీరోయిన్లపై తాప్సీ షాకింగ్ కామెంట్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News