Heroines: ఒకే లాగా కనిపించే హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారా…?

Heroines ఎవరైనా చూస్తే ఇతను అతనిలా వున్నాడు అని అనుకుంటూ ఉంటారు ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు సినిమా ఇండస్ట్రీలో కొంతమందిని చూస్తే ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ లా ఉందే అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించే కొంత మంది హీరోయిన్లు ఉన్నారు వారెవరో ఇప్పుడు మనం చూద్దాం… శ్రేయ జెనీలియా శ్రేయ తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలందరితో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది […].

By: jyothi

Published Date - Sat - 16 October 21

Heroines: ఒకే లాగా కనిపించే హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారా…?

Heroines ఎవరైనా చూస్తే ఇతను అతనిలా వున్నాడు అని అనుకుంటూ ఉంటారు ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు సినిమా ఇండస్ట్రీలో కొంతమందిని చూస్తే ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ లా ఉందే అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించే కొంత మంది హీరోయిన్లు ఉన్నారు వారెవరో ఇప్పుడు మనం చూద్దాం…
శ్రేయ జెనీలియా
శ్రేయ తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలందరితో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది నాగార్జునతో సంతోషం, నేనున్నాను లాంటి సినిమాల్లో నటించింది అలాగే వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్ సినిమా లో నటించింది. చిరంజీవితో ఠాగూర్ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి లాంటి హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా చాలా కాలం పాటు వెలుగొందింది అయితే శ్రేయ లాగానే హీరోయిన్ జెనీలియా కూడా బొమ్మరిల్లు సినిమాతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంది. జెనీలియా కూడా చాలా కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా కొనసాగింది. అయితే కొన్ని సందర్భాల్లో సడన్ గా చూసినప్పుడు శ్రేయ జెనీలియా ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు అని చాలామంది అంటుంటారు.


అమలాపాల్ దీపిక పదుకొనే
అమలాపాల్ తెలుగులో నాయక్ సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది అలాగే ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన విఐపి సినిమాని తెలుగులో రఘువరన్ బీటెక్ గా డబ్ చేశారు ఆ సినిమాతో కూడా తనకు నటిగా మంచి గుర్తింపు లభించింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమా తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే వీరిద్దరూ కూడా చూడడానికి కొంచెం ఓకే ఫేస్ కట్ తో ఉంటారని వాళ్ల ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు.

ఐశ్వర్యరాయ్ స్నేహ ఉల్లాల్
ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలాగే రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా తో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పారు.తెలుగు లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించింది బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సింహ సినిమాలో కూడా నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు సాధించింది.

మీరాజాస్మిన్ సుజిత
విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడి సినిమా తెలుగులో డబ్బు అయి మంచి విజయం సాధించింది దానిలో నటించిన మీరా జాస్మిన్ కి హీరోయిన్ గా తెలుగులో బాగా ఫేమస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ రవితేజతో భద్ర సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు. అలాగే తెలుగు సీరియల్ లో నటించే సుజిత మనందరికీ తెలుసు మీరాజాస్మిన్ సుజిత చూడడానికి ఇద్దరూ ఒకే లాగా ఉంటారు ఎవరైనా చూస్తే ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుకుంటారు. తెలుగులో చాలా సీరియల్ లో నటిస్తూ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపును సాధించుకున్నారు.

సౌందర్య నిత్యామీనన్
అలనాటి స్టార్ హీరోయిన్ అయిన సౌందర్య తెలుగు సినిమా చరిత్రలో తనదైన మార్కును చూపించి హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అనుకునే లాగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలతో నటిస్తూ వీలైనప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్న హీరోయిన్ నిత్యామీనన్. ఒకరకంగా చూస్తే సౌందర్య నిత్యామీనన్ ఇద్దరు ఇంచుమించు ఒకే రకంగా కనిపిస్తారు.
వీళ్లే కాకుండా ఇండస్ట్రీలో ఇంకా చాలామంది చూడ్డానికి ఒకే ఫేస్ కట్ తో ఉన్నారు.

Tags

Latest News

Related News