Heroines : పెళ్లి కాకుండానే తల్లి అయిన హీరోయిన్లు.. ఎవరంటే..?

Heroines : పెళ్లి కాకుండానే తల్లి కూడా అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది.. ఇష్టమైన వ్యక్తితో గర్భం దాల్చడంలో తప్పులేదు అని పెళ్లి ముందే హీరోయిన్స్ తల్లి అవుతున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం...

By: jyothi

Updated On - Mon - 24 April 23

Heroines : పెళ్లి కాకుండానే తల్లి అయిన హీరోయిన్లు.. ఎవరంటే..?

Heroines : భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.. పరాయి మగాడితో మాట్లాడడం కూడా తప్పే అనే సమాజం మనది.. అయితే ఇప్పుడు ఇదే సమాజం ఊహించని స్థాయికి ఎదిగింది.. పెళ్లి కాకుండానే తల్లి కూడా అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది.. ఇష్టమైన వ్యక్తితో గర్భం దాల్చడంలో తప్పులేదు అని పెళ్లి ముందే హీరోయిన్స్ తల్లి అవుతున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

ఇలియానా : ఇలియానా తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అయితే అక్కడ వరుస అవకాశాలు అనుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు.. వరుస ప్లాప్స్ పడడంతో అక్కడ కూడా ఈమె ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇది పక్కన పెడితే తాజాగా ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరి కారణంగా ఇలియానా గర్భం దాల్చారన్న విషయం మాత్రం రివీల్ చెయ్యలేదు.

ఆలియా భట్ : ఆలియా భట్ కూడా పెళ్ళికి ముందే రణబీర్ కపూర్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారు. ఇక ఆ తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అయ్యాక ఆ విషయం తెలియకూడదని పెళ్లి హడావిడిగా కానిచ్చేశారు.. ఇప్పుడు పెళ్లి అయిన 7 నెలలకే ఈమెకు పాప పుట్టింది..

పూర్ణ : నటి పూర్ణ కూడా పెళ్ళికి ముందే తల్లి అయినట్టు సమాచారం.. ఎంగేజ్మెంట్ గురించి చెప్పిన ఈమె పెళ్లి గురించి దాచి పెట్టింది.. దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిగింది అని చెప్పింది.. కానీ ఈమె పెళ్లి చేసుకున్నట్టు సరైన సమాచారం లేదు.. ఈమె వ్యాపారవేత్త షానిద్ అలీని పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చింది.

అమీ జాక్సన్ : ఈమె కూడా పెళ్ళికి ముందే గర్భవతి అయ్యింది.. ఐ, రోబో 2.0, రామ్ చరణ్ ఎవడు వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్రిటిష్ నటి వ్యాపారవేత్త జార్జ్ తో చాలా కాలంగా సహజీవనం చేస్తుంది.. అయితే పెళ్లి చేసుకోకుండానే ఈ జంట పిల్లల్ని కనింది..

కియారా అద్వానీ : కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈమె కూడా పెళ్ళికి ముందే గర్భం దాల్చింది అని అయితే అబార్షన్ చేయించుకుంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

Reaad Also : Star Heros : టాలీవుడ్ లో రీమేక్ లు చేయని ఇద్దరు స్టార్ హీరోలు వీరే.. గొప్పోళ్లయ్యా..!

Read Also : Akkineni Naga Chaitanya And Akhil : అక్కినేని వారసుల ఫెయిల్యూర్ వెనుక కారణం ఇదా.. ఇన్నాళ్లకు బయట పడింది..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News