Heroines: పెళ్లితో క్రేజ్ పెంచుకున్న హాట్ బ్యూటీస్ ఎవరో తెలుసా.??

Heroines : పెళ్ళికి ముందు కెరీర్ ఓ వేగంతో వుంటే, పెళ్ళయ్యాక కెరీర్ మరో కొత్త తరహాలో వేగం పుంజుకుంది కొందరు అందాల భామలకి. సమంత నుంచి నజ్రియా వరకు.. లిస్టులో చాలామందే వున్నారు. అలాగని, పెళ్ళయినవారందరికీ సినిమా కెరీర్ కొత్తగా కలిసొచ్చిందని అనుకోవడానికి వీల్లేదు. కొందరు పెళ్ళయ్యాక సినిమాల్ని పూర్తిగా వదిలేశారు కూడా. కొత్త ట్రెండ్ ఏంటంటే, పెళ్ళయిన హీరోయిన్ల కోసం యంగ్ హీరోలు పోటీ పడుతుండడం. అలా పెళ్ళయిన హీరోయిన్లకు సరికొత్తగా ఛాన్సులొచ్చేస్తున్నాయిప్పడు. వారి […].

By: jyothi

Updated On - Sun - 21 November 21

Heroines: పెళ్లితో క్రేజ్ పెంచుకున్న హాట్ బ్యూటీస్ ఎవరో తెలుసా.??

Heroines : పెళ్ళికి ముందు కెరీర్ ఓ వేగంతో వుంటే, పెళ్ళయ్యాక కెరీర్ మరో కొత్త తరహాలో వేగం పుంజుకుంది కొందరు అందాల భామలకి. సమంత నుంచి నజ్రియా వరకు.. లిస్టులో చాలామందే వున్నారు. అలాగని, పెళ్ళయినవారందరికీ సినిమా కెరీర్ కొత్తగా కలిసొచ్చిందని అనుకోవడానికి వీల్లేదు. కొందరు పెళ్ళయ్యాక సినిమాల్ని పూర్తిగా వదిలేశారు కూడా. కొత్త ట్రెండ్ ఏంటంటే, పెళ్ళయిన హీరోయిన్ల కోసం యంగ్ హీరోలు పోటీ పడుతుండడం. అలా పెళ్ళయిన హీరోయిన్లకు సరికొత్తగా ఛాన్సులొచ్చేస్తున్నాయిప్పడు. వారి కోసం దర్శకులూ మంచి మంచి కథలు రెడీ చేస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్లలో అందరూ కొత్త కొత్తగా తమ కెరీర్ పరంగా.. పెళ్ళయ్యాక పరుగు పెంచినవాళ్ళే.. వాళ్ళెవరో తెలుసుకుందాం పదండిక..

సమంత అక్కినేని:

Heroines samantha craze after marriage

Heroines samantha craze after marriage

సమంత రూత్ ప్రభు కాస్తా, అక్కనేని నాగచైతన్యను పెళ్ళాడక సమంత అక్కినేని అయ్యింది. అక్కినేని నాగార్జున, తనతో కలిసి సినిమాల్లో నటించిన అమలను పెళ్ళాడారు కదా.. అలాగే నాగచైతన్య కూడా, తన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమంతను పెళ్ళాడాడు. పెళ్ళికి ముందు సమంత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. పెళ్ళయ్యాక కూడా ఆమె స్టార్ డమ్ ఏమీ తగ్గలేదు. నిజానికి, పెళ్ళయ్యాకే సమంతకి లేడీ సూపర్ స్టార్ అనే గుర్తింపు వచ్చింది. పెళ్ళయిన తర్వాత ఆమె ఎంచుకున్న సినిమాలు అలాంటివి. దటీజ్ సమంత.


కాజల్ అగర్వాల్: 

heroines kajal agarwal craze after marriage

heroines kajal agarwal craze after marriageకరోనా సమయంలో గ్యాప్ దొరకడంతో, తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లుని పెళ్ళాడింది కాజల్. అంతకు ముందు దాదాపు ఏడెనిమిదేళ్ళుగా ఇద్దరి మధ్యా ప్రేమాయణం నడిచిందట. మరి, మీడియా ఎందుకు ఈ విషయాన్ని పసిగట్టలేకపోయింది.? ఏమోగానీ, పెళ్ళయ్యాక కాజల్ కెరీర్ సరికొత్త రీతిలో పుంజుకుంది. అంతకు ముందు ఆమె కెరీర్ ముగిసిపోయిందనే అనుకున్నారు చాలామంది.. దానిక్కారణం వరుస ఫ్లాపులే. కానీ, కాజల్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా వుంది. చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

నజ్రియా:

heroines Nazriya nazim craze after marriage

heroines Nazriya nazim craze after marriageనజ్రియా నజీమ్ కాస్తా.. నజ్రియా ఫహాద్ అయ్యింది. తమిళ సినిమా ‘రాజ రాణి’తో తెలుగు ప్రేక్షులకీ దగ్గరైందీ భామ. ఎప్పుడో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఓ తెలుగు సినిమా చేయాల్సి వున్నా, అప్పట్లో తొందరపడి పెళ్ళి చేసేసుకుని, సినిమా అవకాశాల్ని వదిలేసుకుంది. ఎలాగైతేనేం, పెళ్ళయ్యాక.. కొంత కాలం సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని, తిరిగి సినిమాలు షురూ చేసింది. నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే, సుందరానికీ..’ అనే సినిమాలో నటిస్తోందిప్పడు నజ్రియాకి. భారీ రెమ్యునరేషన్ ఈ బ్యూటీకి ఆఫర్ చేశారట.


శ్రియ:

heroines craze after marriage shriya

heroines craze after marriage shriya

పెళ్ళికి ముందు, పెళ్ళయ్యాక.. శ్రియ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే, ఏమాత్రం మార్పు లేదు. కాస్తో కూస్తో గ్రాఫ్ పైకి కనిపిస్తోన్నది పెళ్ళయ్యాకే.. అంటారు కొందరు. పెద్ద హీరోలకు బెస్ట్ ఆప్షన్.. అయిపోయింది శ్రియ. వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని అందం శ్రియ ప్రత్యేకం. అదే శ్రియకు పెళ్ళయ్యాక కూడా బోల్డన్ని అవకాశాల్ని తెచ్చిపెడుతోంది.

నిహారిక:

heroines niharika craze after marriage

heroines niharika craze after marriageమెగా కాంపౌండ్ నుంచి వచ్చి వెండితెరపై వెలిగిపోవాలనుకున్న నిహారికకి వరుస పరాజయాలు వెక్కిరించాయి. దాంతో, ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనని అంతా అనుకున్నారు. ఇటీవల నిహారిక పెళ్ళయ్యింది కూడా. అయితే, పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటిస్తానంటోంది నిహారిక. మరి, హీరోయిన్ రోల్స్ ఆమెకి వస్తాయా.? అన్నదే ఆసక్తికరమైన ప్రశ్న.

పూజా రామచంద్రన్:

actress Pooja ramchandran craze after marriage

actress Pooja ramchandran craze after marriageఈ లిస్టులో హీరోయిన్ పూజా రామచంద్రన్ పేరు కూడా చేర్చేయొచ్చు. ఆమెకు గతంలోనే పెళ్ళయ్యింది. కానీ, ఆ తర్వాత ఆమె విడాకులు తీసుకుని, ఇటీవలే మళ్ళీ పెళ్ళి చేసుకుంది. పెళ్ళి – పెళ్ళిళ్ళ వ్యవహారం సంగతి పక్కన పెడితే, తెలుగు తెరపై గ్లామరస్ పాత్రల్లో అడపా దడపా ఆమె కనిపిస్తూనే వుంటుంది. ‘హీరోయిన్’ అనదగ్గ పాత్రలు రాకపోయినా, అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ.

వీళ్ళే కాదు, ఇంకా చాలామంది హీరోయిన్లున్నారు.. పెళ్ళయ్యాక కూడా హీరోయిన్లుగా వెండితెరపై వెలిగిపోతున్నవారు. ట్రెండ్ మారిందని అనేది అందుకే మరి.

Tags

Related News